గాడ్‌ ఫాదర్‌ మెగా పబ్లిక్‌ ఈవెంట్‌

Must Read

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు  మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ.  స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది.మేకర్స్ ఇప్పుడు గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించారు.

సెప్టెంబరు 28న అనంతపురంలోని జేఎన్‌టీయూ మైదానంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ టీమ్‌ ఈ మెగా వేడుకకు హాజరుకానున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానులు, సినీ ప్రేక్షకుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరగనుంది.

ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం.  కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. గాడ్ ఫాదర్  అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Latest News

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా...

More News