Categories: న్యూస్

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ది ఘోస్ట్’  ఫస్ట్ సింగిల్ వేగం విడుదల

కింగ్ అక్కినేని నాగార్జున,  క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్’ ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాట ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. అంచనాలను భారీగా పెంచిన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందనే క్యూరీయాసిటీని పెంచింది.

ముందుగా చెప్పినట్లే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాట సినిమాలోని రొమాంటిక్ సైడ్ ని ఎలిగెంట్ గా ప్రజంట్ చేసింది. నాగార్జున, సోనాల్ చౌహాన్ కలసి తమ లవ్లీ టైమ్ ని చాలా ఉల్లాసంగా గపడం చాలా ప్లజంట్ గా ప్రజంట్ చేశారు. నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించగా, సోనాల్ చౌహాన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. వారి రొమాంటిక్ కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది.

భరత్, సౌరబ్ ద్వయం రొమాంటిక్ ఫీల్‌తో కూడిన ఒక లవ్లీ ట్యూన్ ని స్కోర్ చేశారు.  కపిల్ కపిలన్  రమ్య బెహరా పాటని మరింత ఆహ్లాదంగా ప్రజంట్ చేశారు. కృష్ణ మాదినేని సాహిత్యం ఆకట్టుకుంది. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లకు ఈ పాట సరైన ఆరంభాన్ని ఇచ్చింది.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

 ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు
సాంకేతిక విభాగం
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ – సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago