యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో అమల అక్కినేని విలేఖరుల సమవేశంలో పాల్గొని సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు.
‘ఒకే ఒక జీవితం’ చూసిన తర్వాత ఎమోషనల్ మదర్ పాత్రలకు మీరే కరెక్ట్ ఛాయిస్ అంటున్నారు.. భవిష్యత్ లో ఇలాంటి పాత్రలు చేస్తారా ?
ఒక నటిగా ప్రేక్షకులకు నచ్చడం కంటే గొప్ప విషయం ఏముటుంది. ప్రేక్షకులకు నచ్చే పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా వుంటాను. అయితే ఇలాంటి పాత్రలు చేయడం సవాల్ తో కూడుకున్నది.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత విరామం రావాడానికి కారణం ?
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత రెండు మలయాళం, మూడు హిందీ సినిమాలు, ఒక వెబ్ సిరిస్ చేశాను. ప్రతి భాషలో ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. కానీ తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత ఇదే. అయితే గత ఐదేళ్ళుగా అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా నేనే చూసుకుంటున్నాను. వందలమంది విద్యార్ధుల భవిష్యత్ భాద్యత నాపై వుంది. ఈ భాద్యతని పక్కని పెట్టి నటనలో బిజీగా వుండటం కష్టం. అయితే నా మనసుకు హత్తుకునే కథ విన్నపుడు, ఆ పాత్రకి నేను కరెక్ట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. ఒకే ఒక జీవితం అలా మనసుకు నచ్చిన కథే. ఒక నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుంది. ఒకే ఒక జీవితం మరోసారి దాన్ని రుజువుచేసింది.
సినిమా చూసిన తర్వాత నాగార్జున గారు ఎమోషనల్ మాట్లాడటం ఎలా అనిపించింది ?
‘ఒకే ఒక జీవితం’ హృదయాన్ని హత్తుకునే సినిమా అని నాగార్జున గారిని ముందే ప్రిపేర్ చేశాను. ఈ సినిమా చూశాక హార్ట్ ఓపెన్ అవుతుందని చెప్పాను. నాగార్జున గారికి వారి అమ్మగారు అన్నపూర్ణమ్మ గారు గుర్తుకు వచ్చారు. నిజంగా అది గ్రేట్ ఫీలింగ్. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరికి వారి మనసులకు దగ్గరరైనవారు గుర్తుకు వస్తారు. ‘ఒకే ఒక జీవితం’లోని బ్యూటీ అదే.
టైం మిషన్ లో వెళ్ళే అవకాశం వస్తే ఏ టైంలోకి వెళ్తారు ?
పదేళ్ళు భవిష్యత్ లోకి వెళ్తాను(నవ్వుతూ). ఇప్పుడు చాలా పనులు చేస్తున్నాం. ఆ పనులు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయో చూడాలని వుంది. అవి విజయాన్ని సాధించాయో లేదో తెలుసుకోవాలని వుంది(నవ్వుతూ)
విధి, కాలంని నిజ జీవితంలో ఎలా నిర్వచిస్తారు, విధితో సంబంధం లేకుండా మనిషి తన జీవితాన్ని గెలుచుకోగలడా ?
జీవితంలో ప్రతి అవకాశం కోసం ప్రయత్నిస్తాం. ఒక ప్రయత్నంలో విజయం, మరో ప్రయత్నంలో అపజయం వుంటుంది. అపజయం, జయం కోసం మనల్ని సిద్ధం చేస్తోంది. జీవితంలో జయానికి అపజయానికి సమానమైన ప్రాధాన్య ఉంటుందని భావిస్తాను. అపజయం చాలా విషయాల్ని నేర్పిస్తుంది. లైఫ్ టైం ని ఒక రిహార్సల్ గా భావిస్తే సరైన సమయం వస్తుందని నా ఆలోచన. ఇలాంటి ఒక సక్సెస్ రావడానికి నేను చాలా ప్రయత్నాలు చేసివుంటాను. కొన్ని ప్రయత్నాలు విజయాన్ని ఇవ్వలేకపోవచ్చు. కానీ ఆ అనుభవాలన్నీ విజయానికి బాటలు వేస్తాయని భావిస్తాను.
తెరపై మీ పాత్ర చుసుకున్నపుడు మీ అమ్మగారి వున్న జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయా ?
ఈ సినిమా చూసి మా అమ్మగారు నన్ను చాలా గట్టిగా కౌగలించుకుకొని ‘ఐ యామ్ సో ప్రౌడ్ అఫ్ యూ’ అన్నారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నాగార్జునతో పాటు అఖిల్ , మా కుటుంబ సభ్యులందరూ ఈ చిత్రానికి చాలా డీప్ గా కనెక్ట్ అయ్యారు. నన్ను చూడకుండా కేవలం కథ, పాత్రలతో ప్రయాణం చేశారు.గొప్ప తృప్తిని, హాయిని ఇచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం.
బ్లూ క్రాస్ పనులు చూసుకోవడానికి సమయం కుదురుతుందా ?
బ్లూ క్రాస్ అఫ్ హైదరాబాద్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా వుంది. మంచి వైద్యులు, మ్యానేజ్మెంట్, సిబ్బంది వుంది. బ్లూ క్రాస్ గొప్ప స్థాయికి వచ్చింది. నేను వున్నా లేకపోయినాకూడా అద్భుతమైన సేవలు అందిస్తుంది. అయితే నా తరపునుండి ప్రతి శనివారం స్వచ్చందంగా వెళ్లి పని చేస్తాను.
ఇంట్లో సినిమాలు గురించి మాట్లాడుతుంటారా ?
నాగార్జున, చైతు, అఖిల్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్లానింగ్స్ గురించి మాట్లాడుతుంటారు. నేను వింటాను. అయితే ఫిల్మ్ స్కూల్ లో ఎక్కువగా సినిమాలు గురించి చర్చిస్తుంటాం. విద్యార్ధులతో కలసి సినిమా గురించి లోతైన విశ్లేషణలు ఫిల్మ్ స్కూల్ లోనే ఎక్కువగా జరుపుతుంటాం.
నాగార్జున గారితో మీరు కలసి నటించే అవకాశం వస్తే చేస్తారా ?
ఇంట్లో ఎప్పుడూ కలిసే వుంటాం. మళ్ళీ స్క్రీన్ పై వద్దండీ.( నవ్వుతూ). ఇటివల ఆయన నటించిన బ్రహ్మాస్త్ర చూశాను. నాకు చాలా నచ్చింది. నాగార్జున గారి ప్రజన్స్ కొంత సమయమే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ముంబాయి నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…