ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫస్ట్ డే ఫస్ట్ షో`. ‘జాతి రత్నాలు’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ సంచిత బషు విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మీ నేపధ్యం గురించి చెప్పండి ? ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
మాది బీహార్. నాకు చిన్నప్పటి నుండి నటన అంటే ఇష్టం. టిక్ టాక్ లో నేను చేసిన వీడియోలు చాలా జనాదరణ పొందాయి. సోషల్ మీడియా వేదికలుగా చేసిన రీల్స్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. నా వీడియోలు చూసి దర్శకుడు అనుదీప్ గారు ఆడిషన్స్ కి పిలిచారు. అలాగే లుక్ టెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కోసం ఆయన నుండి పిలుపొచ్చింది. నటిని కావాలని వుండేది. కానీ మొదటి సినిమాకే లీడ్ రోల్ లో అవకాశం రావడం నిజంగా చాలా ఆనందంగా వుంది.
అనుదీప్ చిత్రాల్లో కామెడీ ప్రధానంగా వుంటుంది. తెలుగు కామెడీని ఎలా అర్ధం చేసుకున్నారు ?
టిక్ టాక్ వీడియోలు, నటనకు తేడా వుంటుందని నాకు ముందే తెలుసు. టిక్ టాక్ వీడియోలో ఆడియోకి లిప్ సింక్ చేస్తాం. కానీ నటన వచ్చేసరికి వాయిస్, ఫెర్ఫార్మెన్స్ మనదే కావాలి. షూటింగ్ లో మొదటి రోజు చాలా టెన్షన్ పడ్డా. అయితే దర్శకులు ప్రతి డైలాగ్, సీన్ ని చక్కగా అర్ధమయ్యేట్లు వివరించి చెప్పారు. అలాగే భాషని ప్రాక్టీస్ చేశా. దీంతో నటన సులువైయింది.
తొలి చిత్రానికే ఇద్దరి దర్శకులతో పని చేయడం ఎలా అనిపించింది ?
వంశీ, లక్ష్మీ నారాయణ.. ఇద్దరూ చాలా ఫ్రండ్లీగా వుంటారు. నన్ను చాలా ప్రోత్సహించారు. మంచి సమన్వయంతో ఈ సినిమాని చేశారు. అలాగే శ్రీజ గారు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ఎన్నో విలువలైన సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
ఈ చిత్రంలో లయ అనే పాత్రలో కనిపిస్తా. 2000 కాలం అమ్మాయిని. లయ పాత్రలో సిగ్గు, అమాయకత్వం వుంటాయి. లయ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమాని. ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలని తన బాయ్ ఫ్రండ్ ని కోరుతుంది. ఆ టికెట్లు సంపాదించడం చుట్టూ ఈ కథ వుంటుంది. బీహార్ లో కూడా హిందీలో డబ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తాం. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఖుషి చూశా. నాకు చాలా నచ్చింది. అలాగే అనుదీప్ గారి జాతిరత్నాలు సినిమా కూడా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను.
శ్రీకాంత్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
శ్రీకాంత్ చాలా ఫ్రండ్లిగా వుంటారు. షూటింగ్ సమయంలో చాలా ప్రోత్సహించారు.
ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశం ?
అనుదీప్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన్ని కలసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన సినిమాలో అవకాశం రావడం గొప్ప విషయం. అలాగే పూర్ణోదయ క్రియేషన్స్ ప్రతిష్టాత్మక సంస్థ. వారి నిర్మాణంలో ముఫ్ఫై ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాలో భాగం అవ్వడం కంటే గొప్ప విషయం ఏముటుంది.
ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా వుండబోతుంది ?
ఫస్ట్ డే ఫస్ట్ షో హిలేరియస్ ఎంటర్ టైనర్. ఫుల్ లెంత్ కామెడీ వుంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా తొలి చిత్రం. ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
నటిగా తెరపై చుసుకున్నపుడు ఎలా అనిపించింది ?
టిక్ టాక్ వీడియోలు చేసినప్పుడు నా లుక్ పైనే ద్రుష్టి వుండేది. కానీ తొలిసారి థియేటర్ లో చూసుకున్నపుడు చాలా గొప్ప అనుభూతి పొందాను. నాకంటే మా అమ్మగారు ఎక్కువ ఆనందం పొందారు. మా అమ్మ నేషనల్ అథ్లెట్. నా కోసం తన కెరీర్ ని త్యాగం చేసింది. నన్ను చాలా ప్రోత్సహించింది. నాలో తన కలల్ని చూసుకుంది. నన్ను పెద్ద స్క్రీన్ పై చూసి చాలా ఆనందంగా ఫీలయ్యారు. సోషల్ మీడియాలో నాకు 2.1మిలియన్ ఫాలోవర్స్ వున్నారు. ఈ సినిమా హిందీ లో కూడా డబ్ అయితే నా ఫాలోవర్స్ కూడా చూసి ఆనందపడతారు. ట్రైలర్ , టీజర్, పాటలు నా ఫాలోవర్స్ కి చాలా నచ్చాయి. ఈ సినిమా కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చదువుని కొనసాగిస్తారా ?
మనం ఏ రంగంలో వున్న చదువు చాలా ముఖ్యం. ఇంటర్ పూర్తవుతుంది. దిని తర్వాత డిగ్రీలో జాయిన్ అవుతా.
ఏ హీరోలతో పని చేయాలని అనుకుంటున్నారు ?
ధనుష్, అల్లు అర్జున్, ప్రభాస్ గారంటే చాలా ఇష్టం. వారి సినిమాల్లో పని చేయాలనీ వుంది.
ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ?
కథ బావుండి నాకు నప్పే పాత్రలు చేయాలని వుంది. పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే సినిమాలంటే ఇష్టం.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…