`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` జాతి రత్నాలు లాంటి వినోదం పంచుతుంది : అనుదీప్ కెవి ఇంటర్వ్యూ


ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. ‘జాతి రత్నాలు’తో బ్లాక్‌ బస్టర్‌ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో అనుదీప్ విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మీరు నవ్వరు కానీ జనాల్ని నవ్విస్తారు.. ఆ రహస్యం ఏమిటో ముందు చెప్పండి ?

నేనూ నవ్వుతాను. అయితే నవ్వినపుడు కెమరాలు వుండవు. (సరదాగా)

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` ఆలోచన ఎలా మొదలైయింది ?

ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని వుండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు వుంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ వున్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. ‘ఖుషి’ సినిమా నేపధ్యాన్ని తీసుకుని ఈ కథని చెబుతున్నాం.

ఈ కథ మీ జీవితానికి దగ్గర వుంటుందా ?

చాలా దగ్గరగా వుంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే.

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూసిన  అనుభవాలు ఉన్నాయా ?

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే వుండదు. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. ‘పోకిరి’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం.

జాతి రత్నాలు తర్వాత ఇంకా పెద్ద సినిమా ఆలోచన చేయాలి కదా.. మరి కొత్తవారితో ఈ సినిమా చేయడం వెనుక లెక్క ఏమిటి ?

 నేను పెద్దగా లెక్కలు వేసుకొను. సినిమా చేసినప్పుడు మజా రావాలి. అంతే. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది.

శ్రీకాంత్ ని ఎలా ఎంపిక చేశారు ? శ్రీకాంత్ మీకు స్నేహితుడని చెప్పారు.

శ్రీకాంత్ నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ వుంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ వుంటుంది.

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`తో మరో జాతిరత్నాలని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకోవచ్చా ?

తప్పకుండా. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్ వుంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే వుంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా వున్నారు.

పబ్లిక్ ఫెమిలియర్ కాస్ట్ వుంటే ఇంకా హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా ?

ఈ కథలో పబ్లిక్ ఫెమిలియర్ కాస్ట్ తో ఒక సమస్య వుంది. అందరికీ తెలిసన నటుడు ఉన్నారనుకోండి. అతడికి సినిమా టికెట్ దొరకదని చూపించడం అంత సహజంగా వుండదు. అదే కొత్త నటుడు అయితే ఇది మరింత ఆర్గానిక్ గా వుంటుంది.

శివకార్తికేయన్ సినిమాతో బిజీగా వుండటం వలన ఈ సినిమాకి దర్శకత్వం చేయలేదా ? మరే ఇతర కారణాలు ఉన్నాయా ?

మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. అయితే నాకు కొంత లైనప్ వుంది. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు వుంటే బావుందని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్ లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం ఇలా చాలా అంశాలలో నా ఇన్వాల్మెంట్ వుంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా భాద్యత వుంటుంది.

సినిమా టికెట్ గురించి ప్రయత్నించడం చిన్న లైన్ కదా.. దిన్ని రెండు గంటల సినిమాగా మార్చడం ఒక సవాల్ కదా ?

నిజమే. రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న పాయింట్. దాన్ని రెండు గంటల కథ చేయడం సవాల్ తో కూడుకున్నదే. ఈ ఆలోచన ఎప్పటి నుండో వుంది. చాలా కాలం పాటు చర్చలు జరిగి ఒక సంపూర్ణమైన సినిమా కథగా మలిచాం. కథ ఎప్పటినుండో వున్నా .. డైలాగ్స్ మాత్రం జాతిరత్నాలు తర్వాత రాశాను.

ఖుషి `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`  చూశారా ?

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` టికెట్లు దొరకలేదు. నారాయణ్ ఖేడ్ లో మాట్నీ షో చూశా. నేను పుట్టి పెరిగిన ప్రాంతాలు, చుసిన ప్రదేశాలు గురించి సులువుగా రాయగలుగుతానని భావిస్తాను. ఈ సినిమాలో చిత్రీకరించిన  థియేటర్ హైదరాబాద్ లోని మణికంఠ. 

కామెడీ విషయంలో మీ స్ఫూర్తి ?

ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువుంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుండి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వైలెన్స్ తప్పా .. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా వున్న కథలు కూడా రాయాలని వుంది.

అల్లు అరవింద్ గారు, వెన్నెల కిషోర్ లతో చేసిన ఫన్నీ ప్రమోషన్స్ ఆలోచన మీదేనా ?

అవును. అయితే అల్లు అరవింద్ గారి ఇంటర్వ్యూ అంత ఫన్నీ గా వస్తుందని అనుకోలేదు. ఆయన పెద్ద మనసుతో చాలా గొప్పగా సహకరించారు. ప్రమోషన్స్ విషయంలో వంశీ, శ్రీజగారి ఆలోచనలు కూడా వుంటాయి.

వంశీ, లక్ష్మీ నారాయణల గురించి చెప్పండి ?

హ్యుమర్ విషయంలో వంశీ, నాకు సిమిలర్ ఆలోచనలు వుంటాయి. సినిమా అంటే క్రేజీ వుండాలని ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ నాకు ఎప్పటినుండో స్నేహితుడు. మంచి రీడర్. చాలా పుస్తకాలు చదువుతాడు. కొన్ని సీరియస్ కథలు రాసుకున్నాడు. ఈ కథ విని నచ్చితే చేయమని అడిగాను. అతనికి నచ్చి చేయడం జరిగింది. ఇద్దరిలోనూ మంచి హ్యుమర్ వుంది.

జాతి రత్నాలు తర్వాత జీవితం ఎలా వుంది ?

మొదటి సినిమా సరిగ్గా ఆడలేదు కాబట్టి కొంచెం అలానే చూశారు. జాతిరత్నాలు హిట్ కాబట్టి హిట్ డైరెక్టర్ గా చూశారు.  అయితే జాతిరత్నాలు తర్వాత జీవితంలో అన్నీ చూసిన ఫీలింగ్.

నాగ్ అశ్విన్ తో కథలు గురించి మాట్లాడుతుంటారా ?

లేదండీ. ఆయన చాలా బిజీ. కలిసినప్పుడు కథలు గురించి మాట్లడుకోము. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూశారు. ఆయనకి చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా చూపించాలని భావిస్తున్నాం.

శివకార్తికేయన్ గారితో చేస్తున్న ప్రిన్స్ గురించి ?

పాండిచ్చేరి నేపధ్యంలో సాగే కథ అది. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళి రిలీజ్ వుంటుంది. అది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా వుంటుంది.

జాతి రత్నాలు 2 ఎప్పుడు ?

కొన్ని ఐడియాలు వున్నాయి. రెండు మూడేళ్ళ తర్వాత చేయాలి.

కొత్త ప్రాజెక్ట్స్ ?

వెంకటేష్ గారికి కథ చెప్పాలి. ఇంకొన్ని ఆలోచనలు కూడా వున్నాయి.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago