న్యూస్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి గా అమ్మిరాజు కానుమల్లి విజయం

తెలుగు ఫిలిమ్ లోని 24 క్రాఫ్టుకు చెందిన ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి గా అమ్మిరాజు కానుమల్లి విజయం సాధించారు. నేడు, ఆదివారంనాడు జరిగిన కార్యదర్శి ఎన్నికల్లో అమ్మిరాజు 35 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇంతకుముందు ఈ పోస్ట్ లో దొరై ఉండేవారు. ఇటీవలే జరిగిన మేనేజర్ స్ ఎన్నికల్లో దొరై ఓడిపోయారు. నిబంధనల ప్రకారం ఆయన ఫెడరేషన్ పోస్ట్ కు అనర్హుడు కావడంతో ఈ పోస్ట్ కు ఎన్నిక అనివార్యం అయింది.


కాగా, ఫెడరేషన్ కార్యదర్శిగా వెళ్లంకి శ్రీనివాస్, వెంకట్ కృష్ణ కూడా పోటీచేయగా అమ్మిరాజు గారు 35 ఓట్ల ఆధిక్యత తో గెలుపొందారు.
దీనితో, ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా అనిల్ వల్లభనేని, కార్యదర్శిగా అమ్మిరాజు, కోశాధికారిగా సురేష్ ఉన్నారు.


ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అనిల్ మాట్లాడుతూ, 24 శాఖలకు చెందిన ఫెడరేషన్ లో కార్యదర్శి ఎన్నిక అనివార్యం అయింది. అమ్మిరాజు గారు కార్య దర్శి గా ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ కి 24 క్రాఫ్ట్ కీలకం. కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని అన్నారు. తనను కార్యదర్శి గా ఎన్నుకున్న సభ్యులకు అమ్మిరాజు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల పక్షాన సమస్యలకు అండగా ఉంటానని తెలిపారు.

Tfja Team

Recent Posts

ఇట్స్ కాంప్లికేటెడ్’ సినిమాని థియేటర్స్ లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బాయ్ సిద్ధు జొన్నలగడ్డ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో  కరోనా మహమ్మారి సమయంలో…

10 hours ago

Vijay Deverakonda VD12 TITLED ‘KINGDOM’

Vijay Deverakonda’s upcoming film directed by Gowtam Tinnanuri is one of the most anticipated films…

15 hours ago

విజయ్ దేవరకొండ ‘VD12’ చిత్రానికి ‘కింగ్‌డమ్’ టైటిల్..

మే 30, 2025 న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో 'కింగ్‌డమ్' విడుదల యువ సంచలనం విజయ దేవరకొండ కథానాయకుడిగా ప్రతిభగల దర్శకుడు…

15 hours ago

రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ చిత్రం నుండి స్టన్నింగ్ అండ్ ఎగర్నెస్ ట్రైలర్ రిలీజ్ : ఫిబ్రవరి 28, 2025న సినిమా రిలీజ్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ 'శారీ' లాగ్ లైన్: 'టూ మచ్ లవ్ కెన్ బి…

16 hours ago

Ram Gopal Varma’s ‘SAAREE’ Movie Trailer Released

The distinctive director Ram Gopal Varma’s latest movie ‘Saaree’ tagline: “Too much love can be…

16 hours ago

‘తల’ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీపై ప్రశంసలు కురిపించిన గెస్ట్ లు

దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా'తల'. అమ్మ రాజశేఖర్ తనయుడు…

16 hours ago