బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విడుదల చేసిన జైత్ర సినిమా నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్

Must Read

అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మిస్తున్న చిత్రం జైత్ర‌. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లై మంచి రెస్పాన్స్ లభించింది.

రాయలసీమ స్లాంగ్ , నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగింది.

తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ (అధర నా గుండెలధర) ను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడుతూ…
రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ సినిమాలు చూశాం. మొదటిసారి ఒక రైతు కథతో చాలా సహజంగా మంచి స్లాంగ్ తో రాబోతున్న సినిమా జైత్ర. ఈ మూవీ సాంగ్స్ టీజర్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.

నటీనటులు:
సన్నీ, నవీన్, రోహిణి రాచల్, వంశీ నెక్కంటి, సునీత మనోహర్.

కెమెరా: మోహ‌న్ చారి
పాట‌లు : కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌
సంగీతం : ఫ‌ణిక‌ళ్యాన్‌
ఎడిటర్: విప్లవ్ నైషదం
ద‌ర్శ‌క‌త్వం : తోట మ‌ల్లిఖార్జున్
నిర్మాత‌: అల్లం సుభాష్‌.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News