నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరోలు నాగ చైతన్య, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, రాహుల్ సాంకృత్యాన్, వెంకీ కుడుమల, అవసరాల శ్రీనివాస్, నటులు శ్రీనివాస్ రెడ్డి, రాహుల్ రామకృష్ణ, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ.. ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కథ విన్న వెంటనే నచ్చేసింది. ఇందులో ఒక ఫిల్మ్ డైరెక్టర్ గా చేస్తున్నాను. ప్రతి డైరెక్టర్ కి ఒక టేస్ట్ వుంటుంది. దాన్ని తిక్క అని కూడా అనొచ్చు. ఈ సినిమాలో నా పాత్ర ఎంత ముఖ్యమో కృతిశెట్టి పాత్ర కూడా అంతే ముఖ్యం. అందరూ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఇంద్రగంటి గారితో ఇది మూడో సినిమా. ఆయన నాకు ఒక బిగ్ బ్రదర్. ఆయన కథలకు నన్ను నమ్మారు. ఈ సినిమానే మా కాంబినేషన్ ని తీసింది. ఆయన అన్నీ జోనర్స్ చేశారు. కృతిశెట్టి ఈ సినిమా తర్వాత తన స్థానం మరింత సుస్థిరం చేసుకుంటుంది. పీజీ విందా గారితో మూడో సినిమా ఇది. అద్భుతంగా చూపించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారు. వివేక్ సాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మార్తండ్ కే వెంకటేష్, సాహి సురేష్, మిగతా టెక్నిషియన్లు అందరికీ థాంక్స్. ఈ వేడుకు వచ్చిన నాగ చైతన్య, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, రాహుల్ సాంకృత్యాన్, వెంకీ కుడుమల అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. కృష్ణంరాజు గారు ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ వుంటాయి. ఆయన గర్వపడే చేయడం ప్రభాస్ ఒక్కరి బాధ్యతే కాదు మనందరి భాద్యత. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మంచి కంటెంట్ వున్న సినిమా. మంచి సినిమాని ప్రేక్షకుల చేతుల్లో పెడుతున్నాం. మంచి కథ, కంటెంట్, సినిమాని చూశామని ఫీలై మళ్ళీ మళ్ళీ సినిమాని చూస్తారనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 16న థియేటర్లో ఈ సినిమా చూడండి, మీ స్పందనని తెలియజేయండి” అన్నారు
నాగచైతన్య మాట్లాడుతూ.. ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీం నాకు చాలా ఇష్టం. ఇంద్రగంటి గారి వర్కింగ్ స్టయిల్ గురించి విన్నాను. ఆయనతో కలసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. సుధీర్ తో ఏం మాయ చేశావే లో కలిసి పని చేశాను. సుధీర్ ఆల్ రౌండర్. కృతిశెట్టి చాలా హార్డ్ వర్కింగ్ చేస్తోంది. నిర్మాతలు కిరణ్, మహేంద్ర, సుధీర్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ కి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.. ఇది నాకు స్పెషల్ మూవీ. ఇష్టపడి రాసుకున్న కథ. కమర్షియల్ డైరెక్టర్స్ కి ఈ సినిమా ఒక ట్రిబ్యుట్ అని చెప్తాను. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ నన్ను దీవించారు. వెల్ కమ్ టు ది ఫ్యామిలీ అన్నారు. విందా, వివేక్ సాగర్, కాసర్ల శ్యాం, మార్తండ వెంకటేష్, రామజోగయ్యా శాస్త్రీ గారితో పని చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. ఈ సినిమాతో సాహి సురేష్ లాంటి మంచి ఆర్ట్ డైరెక్టర్ కూడా తోడయ్యారు. మహేంద్ర, కిరణ్ బెంచ్ మార్క్ లో ఈ సినిమా మంచి మెట్టు అవ్వాలని కోరుకుంటున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. నాగచైతన్య, అడవిశేస్, సిద్దు జొన్నల గడ్డ కి స్పెషల్ థాంక్స్. రాహుల్ సాంకృత్యాన్, వెంకీ కుడుమల, అవసరాల శ్రీనివాస్ కి కూడా కృతజ్ఞతలు. సుధీర్ బాబు అద్భుతమైన నటుడు. హరీష్ శంకర్ చెప్పినట్లు ఆయన బలానితగ్గ కథలు ఇవ్వాలేకపోతున్నాం. సుధీర్ బాబుతో ఈ సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. మహేష్ బాబు గారు ఈ సినిమా చూసి తప్పకుండా గొప్పగా ఫీలౌతారు. ఉప్పెనకి ముందే కృతిశెట్టిని ఈ సినిమా కోసం ఎంపిక చేశాను. ఇందులో సరికొత్త కృతిశెట్టిని చూస్తారు. ఇందులో కృతి నటన చూసి ఆశ్చర్యపోతారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సెప్టెంబర్ 16న సకుటుంబ సపరివార సమేతంగా మంచి హాస్యం, రోమాన్స్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
అడవిశేష్ మాట్లాడుతూ.. నిర్మాతలు కిరణ్, మహేంద్ర, సుధీర్ బాబుకు గుడ్ లక్. ఇంద్రగంటి గారు మా డైరెక్టర్. ఆయనకి 2008లో నా షార్ట్ ఫిలిం ఒక్క కాపీ ఇచ్చాను. కానీ ఇప్పటివరకూ తిరిగి ఇవ్వలేదు. వివేక్ సాగర్ సంగీతం అంటే నాకు ఇష్టం. సుధీర్ అంటే నాకు గౌరవం. గూడాచారి సినిమాలో యంగ్ అడవి శేష్ సుధీర్ గారి అబ్బాయే. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న కుమ్మేస్తుంది. థియేటర్లో కలుద్దాం” అన్నారు
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారు చాలా మంచి కంటెంట్ వున్న చిత్రాలు తీస్తున్నారు. సుధీర్ బాబు గారు డెడికేటడ్ యాక్టర్. ఆయన్ని చూస్తే జలసీగా వుంటుంది. నేను జిమ్ కి పోలేను. ఆయన జిమ్ నుండి బయటికి రాలేడు. ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. కృతిశెట్టి చాలా అందంగా వుంది. మహేంద్ర గారితో పాటు సినిమా యూనిట్ అందరికోసం ఈ సినిమా గొప్పగా ఆడాలని కోరుంటున్నాను.
కృతిశెట్టి మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి వచ్చిన దర్శకులు, హీరోలందరికీ కృతజ్ఞతలు. ఈ కథ విన్న తర్వాత ఇంద్రగంటి గారు ఒక అమ్మాయికి ఇచ్చే ప్రాధాన్యత , బలం చూసి చాలా ఆనందంగా ఫీలయ్యా. ఇందులో పాత్రని చాలా కనెక్ట్ అయ్యాను. ఈ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సుధీర్ గారి నుండి చాలా నేర్చుకున్నాను. విందాగారు నన్ను చాలా అందంగా చూపించారు. ఇందులో నటించిన నటీనటులకు , సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. మా నిర్మాతలు ఈ సినిమాతో బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలి. మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. నా సినిమాలని ఆదరించారు. ఈ సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ తెలుగుదనం ఉట్టిపడుతున్న టైటిల్. ఇంద్రగంటి గారు నా అభిమాన దర్శకుడు. ఈ కథలో హీరోయిన్ డైరెక్టర్ ని లవ్ చేస్తుందనే పాయింట్ నాకు చాలా నచ్చింది. టీజర్, ట్రైలర్ అన్నీ బావున్నాయి. సుధీర్ చాలా బలమున్న నటుడు. సుధీర్ లోని యాక్టింగ్ ని మోహన్ గారు ఎప్పుడో బయటికి తీసుకొచ్చారు. సుధీర్ లో యాక్షన్ యాంగిల్ ని కూడా బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. నిర్మాతలు కిరణ్,మహేంద్ర, సుధీర్ బాబుకు ఆల్ ది బెస్ట్. పాండమిక్ ని ఎదురుకొని ఈ సినిమాని గ్రాండ్ గా థియేటర్ లో విడుదల చేయడం ఆనందంగా వుంది. చాలా మంచి సినిమా చూడబోతున్నామనే నమ్మకం వుంది. యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” చెప్పారు
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టైటిలే చాలా ఇంట్రస్టింగా వుంది. ఇందులో ఒక డైరెక్టర్ ని హీరో చేశారు ఇంద్రగంటి గారు. మేము కూడా హీరోలా కాసేపు ఫీలవ్వొచ్చు. ఇంద్రగంటి సినిమా వైవిధ్యంగా వుంటుంది. ఎప్పుడూ కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. సుధీర్ గారు హార్డ్ వర్కింగ్ హీరో. కృతి శెట్టితో పాటు మిగతా టీంకి కృతజ్ఞతలు. నిర్మాతలు కిరణ్,మహేంద్ర, సుధీర్ బాబుకు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. సుధీర్ బాబు గారు చాలా క్లాసీ హీరో. కృతిశెట్టి మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్. ఇంద్రగంటి గారు నాకు ఇష్టమైన దర్శకులు. కిరణ్ , మహేంద్ర గారు , టీం అందరికీ ఈ సినిమా పెద్ద విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
వెంకీ కుడుమల మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారి సమ్మోహనం ఇష్టాచమ్మా నాకు ఇష్టమైన చిత్రాలు. ఈ సినిమా కూడా బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నాను. సుధీర్ గారు వండర్ ఫుల్ యాక్టర్. కృతిశెట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. ఇంద్రగంటి, సుధీర్ గారి సినిమా అంటే ఎప్పుడూ ఎక్సయిటింగా వుంటుంది. ఈ సినిమా చేస్తున్న నిర్మాతలు నాకు ఆప్తులు. ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సినిమా అందరూ చూసి అందరికీ బావుందని చెప్పాలి” అని కోరుకున్నారు.
పీజీ విందా మాట్లాడుతూ.. ఇంద్రగంటితో పని చేయడం ఆనందంగా వుంది. కమర్షియల్ గా ఎమోషనల్ సినిమాని చింపేశారు. సుధీర్ బాబు, కృతి చాలా అందంగా కనిపిస్తారు. సెప్టెంబర్ 16న సినిమా చూడండి” అన్నారు.
వివేక్ సాగర్ మాట్లాడుతూ.. ఇంద్రగంటితో మరోసారి పనిచేయడం ఆనందంగా వుంది. చాలా మంచి సినిమా ఇది. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి” అని కోరారు.
శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ , కృతిశెట్టి గారితో పని చేయడం ఆనందంగా వుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి పెద్ద హిట్ కావాలి” అని కోరారు.
గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ మాట్లాడుతూ.. ఇంద్రగంటి మోహనకృష్ణ గారు నాకు బాగా ఇష్టమైన మనిషి. మా ఇద్దరికి బాగా కుదురుతుంది. ఈ సినిమాలో మంచి మూడు పాటలు రాశాను. మహేంద్ర గారు ఎప్పటి నుండో తెలుసు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో చేయి కలపడం శుభ సూచికం. సుధీర్ బాబు గారి మరోసారి పని చేయడం ఆనందంగా వుంది. మంచి కథ. వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రెండు పాటలు విడుదలైయాయ్యి. మరో బాంబ్ లాంటి పాట వుంది. దాని కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలని, అందరూ థియేటర్ లిఒ చూడాలని ఆశిస్తున్నాను.
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. సమ్మోహనం తర్వాత ఇంద్రగంటి గారితో పాటు మిగతా టీంతో పని చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. అచ్చతెలుగు సినిమా. మీ అందరూ సినిమా చూడాలి” అని కోరారు.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారి సినిమాలంటే చాలా ఇష్టం. మంచి రసజ్ఞత వున్న దర్శకుడాయన. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయి గురించి బాగా చెప్పారని అనుకుంటారు. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారుఓ ఇందులో ఒక తత్త్వంలా సాగే పాటని రాశాను. చాలా మంచి పాటిది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
సుబ్రమణ్య మాట్లాడుతూ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ ట్రైలర్ అదిరిపోయాయి. సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.” అన్నారు
జ్ఞాన సాగర్ మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారంటే చాలా ఇష్టం. సుధీర్ గారు ఇంద్రగంటి గారి కాంబినేషన్ ఎప్పుడూ స్పెషల్ గా వుంటుంది. ఈ సినిమా కోసం చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాం” అన్నారు
అభిలాష్ మాట్లాడుతూ.. ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన్ని కలవాలని రెండేళ్ళు తిరిగా. కానీ కుదరలేదు. ఇప్పుడు వేదికపై వుండటం ఆనందంగా వుంది. సుధీర్ బాబు గారు, టీం అందరికీ ఆల్ ది బెస్ట్ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మాట్లాడుతూ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రాజెక్ట్ లో భాగం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి కృతజ్ఞతలు. ఇంద్రగంటి గారి వర్కింగ్ స్టయిల్ లో నాలో చాలా స్ఫూర్తిని నింపింది. బెంచ్‌మార్క్ స్టూడియోస్ కి ఈ సినిమా బెంచ్ మార్క్ అవుతుంది. సుధీర్ బాబు గారికి ఆల్ ది బెస్ట్. .. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సెప్టెంబర్ 16 న విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.
Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional…
మీ నేపథ్యం ఏమిటి:నాకు చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్. అమ్మ…
The film "Erra Cheera - The Beginning" is jointly produced by Sri Padmayal Entertainment and…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర -…
తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ…
Movies made in the Tamil industry are being dubbed in Telugu and achieving great success.Without…