‘’రైటర్ పద్మభూషణ్‌’ టీనా శిల్పరాజ్ ఇంటర్వ్యూ

Must Read

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రిమియర్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ టీనా శిల్పరాజ్  విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

రైటర్ పద్మభూషణ్‌ జర్నీ ఎలా మొదలైయింది ? ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
నేను తెలుగమ్మాయినే. మాది హైదరాబాద్. రైటర్ పద్మభూషణ్‌ కి పని చేసిన కాస్టూమ్ డిజైనర్ ద్వారా ఆడిషన్ కాల్ వచ్చింది. అంతకుముందు ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’కి మేము కలసి పని చేశాం. రైటర్ పద్మభూషణ్‌ కి ఆడిషన్స్ ఇచ్చాను. తర్వాత సుహాస్ గారితో లుక్ టెస్ట్ జరిగింది. ఈ సినిమా వస్తుందని బలంగా నమ్మాను. నేను నమ్మినట్లే సినిమా రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

రైటర్ పద్మభూషణ్‌ మూవీ ఎలా ఉండబోతుంది ? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని  ఇస్తుంది ?
రైటర్ పద్మభూషణ్‌ ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ రైడ్ కి తీసుకెళుతుంది. చాలా కామెడీ వుంటుంది,  హ్యాపీ ఎమోషన్స్ వుంటాయి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు.  

ట్రైలర్ లో మీ కామెడీ టైమింగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ? రైటర్ పద్మభూషణ్‌ లో మీ పాత్ర గురించి చెప్పండి  ?  
రైటర్ పద్మభూషణ్‌ లో నా పాత్ర పేరు సారిక. సారిక విజయవాడ అమ్మాయి. పద్మభూషణ్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కథలో చాలా కీలకమైన పాత్రది. దర్శకుడు ప్రశాంత్ సారిక పాత్రని చాలా అద్భుతంగా రాసుకున్నారు.  నా పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ కి దక్కుతుంది.

విజయవాడ, గుంటూరులో జరిగిన రైటర్ పద్మభూషణ్‌  ప్రిమియర్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?
రైటర్ పద్మభూషణ్‌  ప్రిమియర్స్ కి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. విజయవాడ ప్రిమియర్ కి వచ్చిన స్పందన చూసి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. థియేటర్ నిండిపోయింది. మేము స్టేజ్ పై నిలబడి చూశాం.  ప్రేక్షకులంతా సినిమాకి చాలా గొప్పగా కనెక్ట్ అయ్యారు. గుంటూరు, భీమవరంలో కూడా ప్రేక్షకులు నవ్వినవ్వి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం చూసినపుడు మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లనిపించింది.

హీరో సుహాస్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
సుహాస్ అద్భుతమైన ప్రతిభ గల నటుడు. ‘కలర్ ఫోటో’ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సుహాస్ సినిమాతో పరిచయం కావడం నాకు చాలా స్పెషల్.  

రైటర్ పద్మభూషణ్‌ మీ మొదటి చిత్రం కదా.. ఇందులో నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?
రైటర్ పద్మభూషణ్‌ గ్రేట్ జర్నీ. ఇంతకుముందు ఒక సినిమాకి సహాయ దర్శకురాలిగా పని చేయడం వలన సినిమా గురించి అవగాహన వుంది. అయితే ఒక యాక్టర్ గా మనల్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన బలాలు ఏంటి ? బలహీనతలు ఏంటి ? ఎక్కడ మనం బాగా చేయగలుగుతున్నాం.. ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవాలి ?  ఇలా చాలా విషయాలు రైటర్ పద్మభూషణ్‌ ప్రయాణంలో నేర్చుకున్నాను.  

ఛాయ్ బిస్కెట్  ఫిలిమ్స్ గురించి ?
ఛాయ్ బిస్కెట్  ఫిలిమ్స వండర్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్. కొత్త ప్రతిభని ఎంతగానో ప్రోత్సహిస్తారు. తెలుగు పాప్ కల్చర్ లో చాలా పాపులర్.  ఛాయ్ బిస్కెట్  ఫిలిమ్స్ లో నా మొదటి సినిమా కావడం చాలా ఆనందంగా వుంది.

 డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ కూడ ఇది తొలి చిత్రమే కదా.. ఆయనతో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ?
డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ కు చాలా క్లియర్ విజన్ వుంది. అలాగే చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన మంచి మనసు కథలో ప్రతిబింబిస్తుంది.  

రోహిణీ గారు, ఆశిష్ విద్యార్ధి గారు లాంటి సీనియర్స్ కలసి పని చేయడం ఎలా అనిపించింది ?
రోహిణీ గారు, ఆశిష్ విద్యార్ధి గారు లాంటి సీనియర్స్ తో పని చేయడం మర్చిపోలేని అనుభవం.  రోహిణీ గారు, ఆశిష్ విద్యార్ధి గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. వాళ్లతో కలసి నటించడం గ్రేట్ ఫీలింగ్ .

చివరిగా రైటర్ పద్మభూషణ్‌ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు ?
రైటర్ పద్మభూషణ్‌ అందరూ తప్పక చూడాల్సిన సినిమా. అందరూ కనెక్ట్ అవుతారు.  రైటర్ పద్మభూషణ్‌ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప అనుభూతిని ఇస్తుంది.  

ఆల్ ది బెస్ట్
 థాంక్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News