Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

“విరాజి” గర్వపడేలా ఉంటుంది – హీరో వరుణ్ సందేశ్

Must Read

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు హీరో వరుణ్ సందేశ్.

  • “విరాజి” మూవీలో నా లుక్ కొత్తగా ఉండేలా మా డైరెక్టర్ ఆద్యంత్ హర్ష డిజైన్ చేశారు. రెండు డిఫరెంట్ కలర్స్ లో వెరైటీగా హెయిర్ స్టైల్, ముక్కు పుడక, టాటూస్ తో ఒక కొత్త మేకోవర్ చేయించారు. నాకు కథ కంటే ముందు నేను ఈ సినిమాలో చేసిన ఆండీ క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుందో డైరెక్టర్ వివరించారు. సినిమా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ప్రమోషన్ కోసం మళ్లీ ఆ లుక్ లోనే కనిపిస్తున్నా. మీకు త్వరగా రిజిస్టర్ అయ్యి రీచ్ అవ్వాలంటే కొత్తగా కనిపించాలి.
  • “విరాజి” ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ ఆస్పత్రి దగ్గర కొద్దిమంది ఉంటారు. వారి దగ్గరకు ఆండీ వస్తాడు. అతను వచ్చాక గందరగోళం మొదలవుతుంది. అదేంటి అనేది తెరపై చూడాలి. ఈ కథలో అంతర్లీనంగా సోషల్ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో నా లుక్ చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. కానీ వాటికి ఈ సినిమానే సమాధానం చెబుతుంది. “విరాజి” సినిమా చూశాక నేను ఎందుకు ఈ మేకోవర్ లో ఉన్నాను అని తెలుసుకుంటారు. ఈ సినిమా చూశాక ఆండీ క్యారెక్టర్ పట్ల గర్వపడతారు.
  • “విరాజి” కథలో చాలా టిస్టులు టర్న్స్ ఉంటాయి. ఒక మంచి మూవీ చేశామని మేమంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ సినిమాలో వర్క్ చేస్తున్నప్పుడు మేకోవర్ కోసమే ఎక్కువ కష్టపడ్డాను. హెయిర్ కలరింగ్ కోసం 7 అవర్స్, అలాగే టాటూస్ కోసం దాదాపు గంట సమయం పట్టేది. ప్రతి రోజూ ఒక స్నేక్ టాటూ వేసేవాళ్లం.
  • “విరాజి” సినిమా చూశాక ఎమోషనల్ అయ్యాను. చివరలో హార్ట్ టచింగ్ గా అనిపించింది. నా వైఫ్ వితిక కూడా సినిమా చూసి అలాగే ఫీలయ్యింది. ఈ సినిమాలో సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడుతుంటా. ఇది నా బాడీ లాంగ్వేజ్ కు కంఫర్ట్ గా అనిపించింది. ప్రతి సినిమాకు, క్యారెక్టర్ కు నేనెంతవరకు అడాప్ట్ అవగలనో అంతవరకు ప్రయత్నిస్తుంటాను.
  • నా గురించి, నా సినిమాల గురించి, నా కెరీర్ గురించి ఎవరైనా ఏదైనా అంటే నేను భరిస్తాను. నటుడిగా నా కెరీర్ లో విమర్శలు కూడా ఒక భాగం. కానీ నా వైఫ్ వితిక ఫైర్ బ్రాండ్. అందుకే తను నా కెరీర్ గురించి స్పందిస్తూ మాట్లాడింది. వితిక లాంటి భార్య ఉండటం నా అదృష్టం. 18 ఏళ్లప్పుడు హ్యాపీడేస్ చేశాను. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా ఎక్సీపిరియన్స్ లు చూశాను. అందుకే మరొకరి అభిప్రాయాల పట్ల స్పందించను. ప్రతి ఒక్కరికీ ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. ఈ మూవీ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎబనెజర్ పాల్ “విరాజి”కి అద్భుతమైన బీజీఎం ఇచ్చాడు. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆయన ఇప్పుడు మరో మూడు బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ సైన్ చేశాడు.
  • ఏపీలో “విరాజి” టూర్ చేశాం. ఆ టూర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టూర్ విశేషాలు ఇన్ స్టా లో షేర్ చేసుకున్నా. చీకట్లో ఉన్న వారికి వెలుగు పంచే వాడు విరాజి. ఇదే టైటిల్ జస్టిఫికేషన్. సస్పెన్స్ , థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్, డ్రామా, ఎమోషన్ వంటి అన్ని అంశాలు కథలో కలిపి రూపొందించారు దర్శకుడు ఆద్యంత్ హర్ష.
  • మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మా “విరాజి” మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఫస్ట్ వాళ్లను నేనే అప్రోచ్ అయ్యాను. మంచి మూవీ చూడమని చెప్పాను. వాళ్లు చూసి మేము రిలీజ్ చేస్తామని ముందుకొచ్చారు.
  • ఇవాళ ప్రేక్షకులు సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు కోరుకునే అలాంటి కొత్తదనం ఉన్న సినిమా “విరాజి”. ఈ కథ చెప్పేటప్పుడే దర్శకుడు ఆద్యంత్ హర్ష చాలా డీటెయిల్డ్ గా బీజీఎం రిఫరెన్స్ లతో చెప్పాడు. సినిమాను అంతే పర్పెక్ట్ ప్లానింగ్ తో రూపొందించాడు. ఏ సీన్ లో ఏం ఏం అవసరమో అవన్నీ పేపర్ మీద వర్క్ చేసి పక్కాగా ఉండేలా చూసుకున్నాడు.
  • ఈ వారం ఓ పదీ పన్నెండు సినిమాలు రిలీజ్ కు వస్తున్నాయి. వాటిలో మా “విరాజి” మూవీ కనిపిస్తుందంటే దానికి మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల గారు చేయిస్తున్న ప్రమోషనే కారణం. ఆయనకు సినిమా పట్ల ప్యాషన్ ఉంది. ఈ కథను అలాంటి ప్రొడ్యూసర్ మాత్రమే నిర్మించగలరు.
  • కథ బాగుండి, క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మంచి స్టోరీ ఉంటే వెబ్ సిరీస్ ల్లోనూ నటించాలని ఉంది. మైఖేల్ సినిమాలో విలన్ గా కనిపించాను. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలనే పరిమితులు ఏవీ లేవు. “విరాజి” ఒక మంచి సినిమా. దీనికి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా.

Latest News

TFPC Pays Tribute to Veteran Actress & Producer Krishnaveni

The Telugu Film Producers Council has expressed deep condolences on the passing of veteran actress, producer, singer, and studio...

More News