హీరో హీరోయిన్స్ పాత్రల మధ్య సంఘర్షణే “ది గర్ల్ ఫ్రెండ్” మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చేలా స్ఫూర్తినిచ్చింది – మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్

Must Read

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి పనిచేసిన ఎక్సిపీరియన్స్ తెలియజేశారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్.

  • తెలుగులో నేను ఒప్పుకున్న మొదటి సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమా తర్వాత ఖుషి, హాయ్ నాన్న సినిమాలు చేశాను. ఇవన్నీ ప్రేమ కథా చిత్రాలే. వీటిలో “ది గర్ల్ ఫ్రెండ్” కథలో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. వరుసగా ప్రేమ కథా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ వచ్చాను. ఇప్పుడు వేరే జానర్ మూవీస్ కు ఆఫర్స్ వస్తున్నాయి. కొన్ని ప్రేమ కథా చిత్రాలకు సంగీతాన్ని అందించాను అనే సంతృప్తి ఉంది.
  • ఈ సినిమా రిలీజ్ అవడం లేట్ అయ్యింది. నేను ఈ సినిమాకు బీజీఎం స్టార్ట్ చేశా. అయితే కొన్ని కారణాలతో మూవీ లేట్ అవుతూ వచ్చింది. ఆ టైమ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ప్రశాంత్ విహారిని తీసుకున్నారు. సాటి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రశాంత్ ఈ సినిమాకు పనిచేయడం హ్యాపీగా ఫీలయ్యా. అతను చాలా మంచి బీజీఎం ఇచ్చాడు. నేను అనుకున్న ఫీల్ అతని బీజీఎంలో కూడా కనిపించింది.
  • “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలో నాలుగు సాంగ్స్ ఉంటాయి. వాటిలో నాలుగో పాట నీదే నీదే కథా రీసెంట్ గా రిలీజ్ చేశాం. ఈ పాట కంపోజింగ్ కోసం ఎక్కువ కష్టపడ్డాను. ఈ పాట చేసేముందు రాహుల్ నాకు చెప్పిందేంటంటే ఇది ప్రతి అమ్మాయి ఆంథెమ్ గా ఉండాలి, భూమా ఆంథెమ్ గా ఉండాలి అన్నారు. కష్టపడి ఈ పాట చేశా. మొత్తం ఆల్బమ్ కు రాహుల్ ఇండియన్, వెస్ట్రన్ కలిసిన మ్యూజిక్ కావాలని అడిగాడు. అందుకే మన రాగాలు, వెస్ట్రన్ ఇన్ స్ట్రుమెంట్స్ ఉపయోగించాం.
  • సినిమాలో విక్రమ్, భూమా పాత్రల మధ్య ఉండే సంఘర్షణే నేను ఈ సినిమాకు మంచి పాటలు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. నేనూ ఈ సినిమా చూసి ఆలోచనలో పడ్డాను. మీరంతా మూవీ చూసి అప్రిషియేట్ చేస్తారనే నమ్మకం ఉంది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ రాహుల్ కే దక్కుతుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ కథలో సరైన సందర్భంలో వచ్చేలా రాహుల్ డిజైన్ చేసుకున్నాడు.
  • ఒక మంచి పాట చేసేందుకు ప్రతి సమయం సరైనదే. నాకు కంపోజింగ్ కు ప్రత్యేకంగా ఒక సమయం పెట్టుకోను. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన దిల్ సే సినిమా పాటలను నేను చదువుకునేప్పుడు పాడేవాడిని. ఐఫా వేడుకల్లో ఆయన సమక్షంలో నేను కంపోజ్ చేసిన హాయ్ నాన్న పాటలు పాడటం మర్చిపోలేని సందర్భం. తెలుగులో కీరవాణి ఇష్టం. అలాగే థమన్, దేవిశ్రీ ప్రసాద్, భీమ్స్…వీళ్ల మ్యూజిక్ అన్నా ఇష్టపడతాను.
  • నేను సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారాను. అందుకే నా సినిమాల్లో ఒక పాటైనా పాడమని మేకర్స్ అడుగుతుంటారు. మాస్ జాతర, కన్నప్ప లాంటి ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్లోనూ పాటలు పాడాను. సింగర్ గా మిగతా చిత్రాల్లో పాడటం కూడా నాకు అనుభవాన్నిస్తోంది. దీంతో తెలుగు త్వరగా నేర్చుకుంటున్నా. వచ్చిన అన్ని అవకాశాలు చేయడం లేదు. ఒకేలా ఉన్న మూవీస్ వస్తే వదులుకుంటున్నా. అయితే సితార, గీతా ఆర్ట్స్, మైత్రీ లాంటి సంస్థల నుంచి ఏ అవకాశం వచ్చినా వదులుకోను. నాకు టాలీవుడ్ లో గుర్తింపు ఇచ్చిన సంస్థలు ఇవి.
  • నేను లవ్ సాంగ్స్ ఎక్కువగా చేశాను. త్వరలో మాస్, బీట్ సాంగ్స్ కూడా చేయబోతున్నా. అలాంటి మూవీస్ అవకాశాలు వస్తున్నాయి. ప్రేమ కథలకు బీజీఎం చాలా కీలకం. నేను మ్యూజిక్ చేసిన మనమే, 8 వసంతాలు సినిమాల్లోని బీజీఎం కూడా మంచి పేరొచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేయడం సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ ఒకదాని తర్వాత మరొకటిగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. మలయాళంలో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా దర్శకుడు ఆదిత్య హాసన్ రూపొందిస్తున్న సినిమాతో పాటు తమిళం, కన్నడలో సినిమాలు చేస్తున్నా. నా ఫస్ట్ బాలీవుడ్ మూవీ కూడా త్వరలో ప్రకటిస్తా.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News