విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ నుంచి రాబోతున లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో మెప్పించిన డైనమిక్ యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో నార్నే నితిన్ మీడియాతో ‘ఆయ్’ సినిమా విశేషాలను తెలియజేశారు..
* సినిమాకు ముందుగా ‘ఆయ్’ అనే టైటిల్‌ను అనుకోలేదు. అరవింద్‌గారి ఆలోచనతోన ఈ టైటిల్ పెట్టాం. అందుకు కారణం.. గోదావరి స్లాంగ్‌లో ఆయ్ అనే పదాన్ని కామన్‌గా వాడుతుంటాం. అలాగే సినిమాలోని పలు సందర్భాల్లో ఈ పదాన్ని వాడటాన్ని చూడొచ్చు. కాబట్టే టైటిల్‌ను ‘ఆయ్’ అని ఫిక్స్ చేశాం.
* సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది. కాబట్టి పోస్టర్స్‌లో అంతా ఫన్ బాత్ అనే పెట్టాం. ఇది డైరెక్టర్‌గారి ఆలోచన. సినిమా విడుదలైన రోజున ఆ విషయం స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది.
* ఆగస్ట్ 15న చాలా సినిమాలు రిలీజ్‌లున్నాయి. అయితే మాకుండాల్సిన ఆడియెన్స్ మాకున్నారని అనుకుంటున్నాం. మంచి ఫన్ ఉన్న గోదావరి బ్యాక్ డ్రాప్ మూవీ వచ్చి చాలా కాలమైంది. కచ్చితంగా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం.
* చిన్నప్పటి నుంచి నాకున్న గోదావరి ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, వాళ్లు మాట్లాడేటప్పుడు వినటం చేశాను. కాబట్టి ‘ఆయ్’ మూవీలో స్లాంగ్ మాట్లాడేటప్పడు నాకేమీ ఇబ్బందిగా అనిపించలేదు.
* దర్శకుడు అంజి కె మణిపుత్ర అమలాపురం కుర్రాడు. ఆయనకున్న ఫ్రస్టేషన్స్, లైఫ్‌లో ఆయన చూసినవన్నీ కలిపి చేసిన సినిమానే ‘ఆయ్’. డైరెక్టర్ ఎవరితోనైనా ఇట్టే కలిసి పోయే వ్యక్తి. సెట్స్‌లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు.
* మ్యాడ్ మూవీ కథకు తగ్గట్టు బిహేవ్ చేశాను. ‘ఆయ్’ సినిమా కథకు తగ్గట్టు యాక్ట్ చేశాను. ఈ మూవీ కోసం స్పెషల్ గా కష్టపడలేదు. డైరెక్టర్‌గారు చెప్పినట్లు ఫాలో అయ్యానంతే.
* ఎన్టీఆర్‌గారు ట్రైలర్ చూశారు. ఆయనకు కామెడీ బాగా నచ్చింది. ఎంజాయ్ చేశారు. సినిమా చూసిన తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి అలాంటి రెస్పాన్స్ వస్తే బావుంటుందనిపిస్తుంది.
* అంకిత్ కొయ్య, కసిరెడ్డిగారితో ‘ఆయ్’ సినిమాకు సంబంధించిన జర్నీ చాలా బావుంది. బాగా డిస్కషన్ చేసుకుని ఎలా చేస్తే బావుంటుందనే సలహాలను తీసుకుని నటించాం.
* డెబ్యూ డైరెక్టర్స్‌తోనే సినిమాలు తీయాలని ఏం అనుకోవటం లేదు. కథ నచ్చితేనే సినిమాలు చేస్తున్నాను. మ్యాడ్ అయిన ‘ఆయ్’ మూవీ అయినా కథ నచ్చే నటించాను. మ్యూజిక్ గురించి చెప్పాలంటే రామ్ మిర్యాలగారు మూడు పాటలకు సంగీతాన్నిస్తే.. అజయ్ అరసాడగారు రెండు పాటలకు మ్యూజిక్ ఇస్తూ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. మ్యూజిక్ సినిమా సక్సెస్‌లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
* హీరోయిన్ నయన్ సారిక మరాఠీ అమ్మాయి. కానీ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. తన పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది.
* కులం, మతం కంటే స్నేహం చాలా గొప్పది. అంత కంటే గొప్ప విషయమేదీ ఉండదనే మెసేజ్‌ను ‘ఆయ్’ సినిమాలో ఇస్తున్నాం.
* మ్యాడ్ సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉండొచ్చు. ఇంకా కొత్త ప్రాజెక్టులేవీ ఓకే చేయలేదు.
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేలా ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను తయారు చేశారు. బ్రహ్మ శ్రీ…
The album Vasavi Sakshatkaram was created to celebrate and showcase the divine significance of Sri…
Under the banners of Sri Jaganmatha Renuka Creations and Four Founders, the film "Raja Markandeya"…
శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్, ఫోర్ ఫౌండర్స్ పతాకాలపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్…
"డాకు మహారాజ్"లో పోషించినపాయల్ పాత్రకు దండిగా ప్రశంసలుఅందుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ గగన గీతిక "డాకు మహారాజ్ లో నటించే అవకాశం…
Child artist Gagana Geethika, who played the role of Payal in "Daku Maharaj", is receiving…