నిజ జీవితంలోనూ గోపీలానే ఉంటాను.. ‘మసూద’ విజయంపై హీరో తిరువీర్

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా హీరో తిరువీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

పరేషాన్ సినిమా చేస్తున్న సమయంలో మసూద గురించి తెలిసింది. సినిమాటోగ్రఫర్ జగదీష్ చీకటి ద్వారా ఈ సినిమా గురించి నాకు తెలిసింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సినిమా ఆఫర్ నీకు వస్తుంది అని చెప్పాడు. స్వధర్మ్ బ్యానర్ కాబట్టి కథ కూడా వినకుండా ఓకే చెబుదామని అనుకున్నా. మసూద డైరెక్టర్‌ నన్ను ఓ సారి కలిశాడు. కలిసినంత మాత్రాన నిన్ను సినిమాలో తీసుకుంటానని అనుకోకు.. నిర్మాతకు నచ్చితేనే తీసుకుంటాను అని అన్నారు. ఆడిషన్ కోసం ఓ సీన్ చేశాం. అందులో ఇంగ్లీష్‌ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. ఐదారు టేక్స్ తీసుకున్నా. ఇక సినిమా ఆఫర్ రాదని అనుకున్నా. కానీ చివరకు దర్శక నిర్మాతలకు నచ్చింది. మసూద ఆఫర్ వచ్చింది.

ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు బాధగా అనిపించింది. నాకు ఎక్కువగా విలన్, సైకో పాత్రలే వచ్చాయి. అలాంటి కారెక్టర్లే నేను చేస్తానా? వాటికే సూట్ అవుతానా? అనే భావన నాలో కలిగేలా చేశారు. అందుకే అందులోంచి బయటకు రావాలి, వెరైటీ పాత్రలు చేయాలని అనుకున్నా. పైకి ఎవ్వరూ చెప్పకపోయినా కూడా అందరికీ హీరో అవ్వాలని ఉంటుంది. చిన్నప్పటి నుంచి గోడ మీద పోస్టర్లు చూసి కథలు అనుకుంటూ ఉండేవాడిని. పలాస టైంలోనూ నా పోస్టర్ ఉంటుంది. కానీ మసూద నాది అఫీషియల్‌గా ఫస్ట్ పోస్టర్.

ప్రతి ఒక్కరిలో భయాలు ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచీ చీకటి అంటే భయం. నేను నా జీవితంలోనూ గోపీలానే ఉంటాను. నాకు ఈ పాత్రను పోషించడం పెద్ద కష్టంగా అనిపించలేదు. మిగతా సినిమాల్లో చేసిన కారెక్టర్లే కష్టంగా అనిపించాయి. మసూదలో క్లైమాక్స్‌లో చేసిన స్టంట్స్ కాస్త కష్టంగా అనిపించాయి.

నాకు చిన్నప్పటి నుంచి నటీనటులను చూడటం ఇష్టం. షూటింగ్‌లు జరిగే సమయంలో వారిని చూసి తెగ సంబరపడిపోయేవాడిని. శుభలేక సుధాకర్, సంగీత, సత్యం రాజేష్ ఇలా అందరితో పని చేయడం సంతోషంగా ఉంది. వారితో పని చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకోగలం.

చిన్నతనంలో అమ్మ, నాన్నలను కథలు చెప్పమని అడిగేవాడిని. ఆ కథలు వింటూనే పడుకునేవాడిని. మసూద కథ విన్నప్పుడు కూడా నాకు చాలా నచ్చింది. మసూద కోసం తీసుకున్న నేపథ్యం అందరికీ కొత్తగా అనిపించింది.

నేను చేసిన చిత్రాలన్నీ అవార్డ్ విన్నింగ్, విమర్శకుల ప్రశంసలు వచ్చేలానే ఉంటాయి. మల్లేశం, పలాస, జార్జిరెడ్డి వల్ల నేను ఇండస్ట్రీ జనాలకు తెలిశాను. కానీ మసూదలో గోపి పాత్ర వల్ల కామన్ ఆడియెన్స్ వరకు చేరాను. నన్ను వారు గుర్తు పడుతున్నారు. సోషల్ మీడియాలో మెసెజ్‌లు పెడుతున్నారు.

మసూదతో నాలోని ఇంకో కోణం కూడా అందరికీ తెలిసిందే. నెగెటివ్ మాత్రమే కాదు ఇలాంటి పాత్రలు కూడా పోషించగలడని అంతా నమ్ముతున్నారు. దిల్ రాజు గారికి నా పాత్ర చాలా నచ్చింది.

ఒకప్పుడు నేను ఎక్కువగా మీమ్స్ వేసేవాడిని. కానీ ఇప్పుడు నా మీద మీమ్స్ వేస్తున్నారు. గోపీ పాత్రతో జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.

హీరో అనే ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ప్రకాష్‌ రాజ్ గారు, కోట శ్రీనివాసరావు గారిలా అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరిక ఉంది. నేను సినిమాలో ఉంటే బాగుంటుందని జనాలు అనుకుంటే చాలు.

నా పేరు తిరుపతి రెడ్డి. నేను గురువుగా భావించే రఘువీర్ నుంచి వీర్ అని తీసుకుని తిరువీర్ అని పెట్టుకున్నా. అయితే వీర్ అనేది మరో సెంటిమెంట్‌ కూడా యాడ్ అయింది. వీరమ్మ అనేది మా అమ్మ పేరు. అమ్మ, గురువు నుంచి తీసుకోవడంతో తిరువీర్ అనేది నాకు రెండు రకాలుగా సెంటిమెంట్ అయింది.

ప్రస్తుతం పరేషాన్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మోక్షపటం అనే చిత్రం కూడా లైన్‌లో ఉంది. వైజయంతీ మూవీస్‌లో ఓ వెబ్ సిరీస్ ఉంది. పారాహుషార్ అనే మరో సినిమా కూడా లైన్‌లో ఉంది. అలా మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉన్నాయి. కొత్తగా ఏ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు. కథ నచ్చితేనే సినిమాలు చేద్దామని, కౌంట్ కోసం చేయకూడదని అనుకుంటాను.

కమల్ హాసన్ ద్రోహి, విచిత్ర సోదరులు, స్వాతి ముత్యం ఇలా వెరైటీ కథలు, కారెక్టర్లు చేయాలని ఉంది. అయితే రెమ్యూనరేషన్ కోసం మాత్రం సినిమాలు చేయను. కథ, స్క్రిప్ట్ నచ్చితేనే సినిమాలు చేస్తాను.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago