‘ఆ ఒక్కటీ అడక్కు’ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్: డైరెక్టర్ మల్లి అంకం

కామెడీ కింగ్ అల్లరి నరేష్  ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా  హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు మల్లి అంకం విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘ఆ ఒక్కటీ అడక్కు’ క్లాసిక్ టైటిల్ కదా.. ఈ సినిమాకి పెట్టాలన్నపుడు బరువుగా అనిపించలేదా?
-‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ కథకు యాప్ట్ టైటిల్. ఈ టైటిల్ పెట్టాలనే ఆలోచన కూడా నరేష్ గారిదే. కేవలం టైటిల్ వరకే తీసుకున్నాం. ఈ కథకు, ఆ సినిమాకు  సంబంధం లేదు. పెళ్లి చుట్టూ ఎలాంటి ఎమోషన్స్ వుంటాయి? కొందరు ఆ ఎమోషన్స్ ని ఎలా క్యాష్ చేసుకుంటారు? ఇలాంటి అంశాలని చాలా వినోదాత్మకంగా చూపిస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేశాం. ఇందులో వుండే కంటెంట్ అందరూ కనెక్ట్ అయ్యేలా వుంటుంది. ఇది అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

‘ఆ ఒక్కటీ అడక్కు’ అనేది ఇందులో ఎవరి మాట ?
-హీరోని పెళ్లి గురించి అందరూ అడుగుతున్నప్పుడు ఆయన సమాధానంగా చెప్పే మాట ‘ఆ ఒక్కటీ అడక్కు’. నిజానికి పెళ్లి గురించి అందరూ చాలా తేలిగ్గా అడిగేస్తారు కానీ.. తీసుకున్నవారు దాన్ని చాలా పెయిన్ ఫీల్ అవుతారు. ఆ కుటుంబంలో కూడా అదో బాధలా వుంటుంది. ఇందులో ఆ ఎమోషన్ ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇందులోని కామెడీ, ఎమోషన్ ఆడియన్స్ ని హత్తుకునేలా వుంటాయి.

ఇందులో సందేశం ఏవైనా ఉందా ?
-ప్రత్యేకంగా సందేశంలా వుండదు కానీ.. పెళ్లి ఎప్పుడు? అని అడగడం కన్నా మీ దగ్గర ఏదైనా మంచి సంబంధం వుంటే చూసి పెట్టండనే ఆలోచనని రేకెత్తించేలా ఈ సినిమా వుంటుంది. అలాగే పెళ్లి సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చూపించే ప్రయత్నం చేశాం.

కామెడీ సినిమాల్లో నరేష్ గారికి ఇది రీఎంట్రీ లాంటి సినిమా కదా.. ఆయన్ని ఎలా ఒప్పించారు ?
-నరేష్ గారిని అమ్మిరాజు గారి ద్వారా కలిశాను. అప్పటికే ఆయన నాలుగు సినిమాలతో బిజీగా వున్నారు. కామెడీ కథ అనేసరికి మొదట అంత ఉత్సాహం చూపించలేదు. అయితే నేను కథ చెప్పడం మొదలుపెట్టాను. ఫస్ట్ హాఫ్ విని షేక్ హ్యాండ్ ఇచ్చి ‘ఈ కథ మనం చేసేద్దాం’  అన్నారు. నాలుగు సినిమాల్లో రెండు వెనక్కి పెట్టి ఈ సినిమా ముందుకు తీసుకొచ్చారు. అంతలా ఈ కథ ఆయనికి నచ్చింది. ఇందులో కామెడీ తో పాటు చాలా మంచి ఎమోషన్ వుంది. నరేష్ గారి క్యారక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తాయి.  

ఫరియా అబ్దులా గురించి ?
-ఫారియా పాత్ర ఇందులో చాలా కీలకంగా వుంటుంది. కథ ఆమె పాత్ర ద్వారానే మలుపు తిరుగుతుంది. ఫరియాలో మంచి కామెడీ టైమింగ్ వుంది. ఇందులో తన పాత్రని చాలా అద్భుతంగా చేసింది. సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.

ఈ కథకు స్ఫూర్తి ఉందా ? ఎలాంటి రిసెర్చ్ చేశారు ?
-సమాజంలో జరిగే సంఘటనల స్ఫూర్తి వుంది. నా ఫ్రెండ్స్ లో కొంతమందికి పెళ్లి కాలేదు. వారంతా ఒక వేడుకకు వచ్చినపుడు వేదికపైకి రాలేదు. కారణం అడిగితే.. అందరూ పెళ్లి గురించి అడుగుతారు. వారికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక రాలేదని చెప్పారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళ పెయిన్ ని ఫీలయ్యాను. అలాగే మ్యాట్రిమోనీకి సంబధించిన సంఘటనలు, పేపర్ లో వచ్చే కొన్ని వార్తలు కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. వీటన్నిటికీ ఫిక్షన్ జోడించి ఈ కథ చేయడం జరిగింది.

నిర్మాత గురించి ?
-చిలక ప్రొడక్షన్ రాజీవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ కథకు కావాల్సిన బడ్జెట్ ని సమకూర్చారు. వారితో నాకు ముందే అనుబంధం వుంది. ఛోటా బీమ్స్ కి సంబధించిన కొన్ని పనులు నేనే చేసేవాడిని. వారికి ఎప్పటినుంచో సినిమా చేయలని వుంది. అలాంటి సమయంలో ఈ కథ చెప్పాను. వారికి నచ్చడంతో ప్రాజెక్ట్ మొదలైయింది.

డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గురించి ?
-అబ్బూరి రవి గారు ఎమోషన్ ని అద్భుతంగా రాస్తారు. ఇందులో కూడా మాటలు ఆకట్టుకునేలా వుంటాయి. రవిగారు సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు.  

సినిమాలపై మీకు ఆసక్తి ఎప్పుడు ఏర్పదింది ?
-నేను బియస్సీ పూర్తి చేశాను. ఒకసారి మా కాలేజ్ కి దాసరి నారాయణ గారు అతిధిగా వచ్చారు. అప్పుడు నేనో స్కిట్ రాశాను. చాలా బాగా రాశావ్ అని ఆయన మెచ్చుకున్నారు. తెలియకుండానే అప్పటి నుంచి పరిశ్రమలోకి రావాలనే ఆసక్తి ఏర్పడింది. ఇక్కడి వచ్చిన తర్వాత భాను శంకర్ గారు, సాయి కిరణ్ అడవి తో పాటు మరికొన్ని చోట్ల పని చేశాను.  

గోపిసుందర్ మ్యూజిక్ గురించి ?
-గోపిసుందర్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. అవుట్ పుట్ చూశాక చాలా ఆనందంగా అనిపించింది. నేపథ్య సంగీతం హత్తుకునేలా చేశారు.

జామీ లివర్ ని తెలుగు పరిచయం చేయడం గురించి ?
-జామీ లివర్ ఇందులో నరేష్ గారి తమ్ముడి భార్య పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర చాలా హిలేరియస్ గా వుంటుంది. ఆమె చేసిన ఓ వెబ్ సిరిస్ చూశాం. మా పాత్ర ఆమె అయితే సరిగ్గా సరిపోతారనిపించింది. తీరా చూస్తే ఆమె జానీ లీవర్ గారి కుమార్తె. జామీ చాలా చక్కని తెలుగు మాట్లాడుతుంది. ఇందులో హర్ష, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా వినోదాత్మకంగా వుంటాయి. పాత్రలన్నీ ఎంటర్ టైనింగ్ గా ఉంటూనే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి.

ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నరేష్ గారి రియాక్షన్ ఏమిటి ?
-నరేష్ గారు ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇది వారి నాన్నగారి టైటిల్. ఖచ్చితంగా భాద్యత మరింతగా వుంటుంది. సినిమా చూసిన తర్వాత నమ్మకాన్ని నిలబెట్టాననే భావన ఆయనలో కనిపించింది. టీం అంతా అవుట్ పుట్ పై చాలా ఆనందంగా, నమ్మకంగా వున్నాం.
సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ వాళ్ళు మంచి పాయింట్ చెబుతున్నారని చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చాలామందికి తెలియని విషయాలు చెబుతున్నారని అభినందించారు.

కొత్తగా చేయబోయే ప్రాజెక్ట్స్ ?
-కొన్ని కథలు వున్నాయి. అయితే ప్రస్తుతం నా ద్రుష్టి ఈ సినిమా విడుదలపైనే వుంది.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago