మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందుతున్న #VT13 ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
వాస్తవ సంఘటనల స్పూర్తితో ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-హిందీ ద్విభాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ను IAF అధికారిగా కనిపిస్తారు. ప్రేక్షకులు లార్జర్ దేన్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి మేకర్స్ అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రీకరించడానికి మేకర్స్ భారీ సెట్‌ను రూపొందించారు. మునుపెన్నడూ చూడని ఈ యాక్షన్ కోసం వరుణ్ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా, మేకర్స్ నుండి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది.
దేశం ఇప్పటివరకు చూడని అతిపెద్ద, భయంకరమైన వైమానిక దాడులలో పోరాడిన మన హీరోల పోరాట స్ఫూర్తికి తగిన పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్ తో కూడిన ఈ చిత్రం టైటిల్‌ను మేకర్స్ త్వలోనే అనౌన్స్ చేయనున్నారు.
మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.
శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహా నిర్మాతలు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…