సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సంగీత వేడుక “ది నైట్ ఆఫ్ ది స్టార్స్” జూన్ 12, 2026న హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీలో జరగనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, ప్రముఖ నేపథ్య గాయని గీతా మాధురి, అలాగే సాకేత్, వినూత్న, కశ్యప్, అదితి , భార్గవి తమ అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఈ వేడుకని ఆర్గనైజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిఖిల్ విజయేంద్ర సింహ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మనందరం చిన్నప్పటి నుంచి పాటలను మధురమైన జ్ఞాపకాలుగా, నోస్టాల్జిక్ ఫీలింగ్స్‌గా ఆస్వాదిస్తూ పెరిగాం. ఆ నోస్టాల్జిక్ పాటలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు 23 సంవత్సరాల తర్వాత కళ్యాణి మాలిక్ గారి ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ లైవ్ షో జరగడం చాలా సంతోషంగా ఉంది. జూన్ 12న అసెంబ్లీ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మాకు ఈ వేదికను అందించిన శ్రీకాంత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే కళ్యాణి మాలిక్ గారికి, గీతా మాధురి గారికి, సాకేత్ గారికి, వినూత్న గారికి, అదితి గారికి ధన్యవాదాలు. వీరందరూ కలిసి ఈ వేడుకను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. మీరు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై, మాతో కలిసి ఈ సంగీత వేడుకను ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. టికెట్ల కోసం డిస్ట్రిక్ట్ యాప్, మేము అందించిన ఫోన్ నంబర్లను కూడా సంప్రదించలని కోరుతున్నాం.

కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నా మొదటి సినిమా ఐతే విడుదలైనప్పుడు ఎంత ఆనందంగా, ఉత్సాహంగా ఫీలయ్యానో, ఈ షో నిర్వహిస్తున్నప్పుడు కూడా అదే భావన కలుగుతోంది. మా సింగర్స్ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. జూన్ 12న జరిగే ఈ మ్యూజికల్ ఈవెంట్‌కు తప్పకుండా అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఈ షో ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది.

గాయని గీతా మాధురి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. కళ్యాణి మాలిక్ గారు మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ షో గురించి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. అందరూ ఈ కార్యక్రమం గురించి ఆసక్తిగా అడుగుతున్నారు. కళ్యాణి గారి పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నాకు లైవ్ మ్యూజిక్ షోలు అంటే చాలా ఇష్టం. అలాంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. అసెంబ్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ కార్యక్రమం జరగడం మరో ప్రత్యేకత. ఈ వేదిక చాలా అద్భుతంగా ఉంది. టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే నిర్వాహకులు ఇచ్చిన ఫోన్ నంబర్ల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించవచ్చు. కళ్యాణి మాలిక్ గారి పాటలను ఈ వేదికపై పాడబోతుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మీడియా సమావేశంలో గాయకులు, నిర్వాహకులు, కార్యక్రమానికి సంబంధించిన ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

