‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి..!

Must Read

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను సమీర్, వెన్నపూస శ్రీకర్ రెడ్డి సహ నిర్మాతలుగా ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీలో అక్షయ్ లగుసాని, కేయూరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో , జయకృష్ణ, రావు రమేష్, హర్షవర్థన్‌, అనిత చౌదరి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని డిసెంబర్ 11న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ‘మేఘాలు సంద్రంలో’ అంటూ సాగే సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో..

వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గిరి, ప్రణయ్ చెప్పిన ఈ కథ నాకు ఎంతో నచ్చింది. ఈ ఇద్దరి పేర్లు ఇండస్ట్రీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది. సింజిత్ అద్భుతమైన పాటల్ని ఇచ్చాడు. అక్షయ్, సింజిత్ మంచి స్నేహితులు. కేయూరికి ఆల్ ది బెస్ట్. ఈటీవి విన్‌తో కలిసి ఈ మూవీని డిసెంబర్ 11న ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాం. ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

ఈటీవీ విన్ కంటెండ్ హెడ్ భరణ్ మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ మాకెంతో ప్రత్యేకమైన సినిమా. ఈ చిత్రంతో ఒకేసారి ఇద్దరు దర్శకుల్ని పరిచయం చేయబోతోన్నాం. వంశీ గారికి నిర్మాతగా ఇదే తొలి చిత్రం. అందుకే మా సినిమా ప్రత్యేకం. సినిమాకు సింజిత్ మంచి సంగీతం ఇచ్చారు. డిసెంబర్ 11న మా సినిమాని రిలీజ్ చేస్తున్నామ’ని అన్నారు.

ఈటీవీ విన్ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ మాట్లాడుతూ .. ‘మాకు సింజిత్ ఎప్పుడూ మంచి పాటల్నే ఇస్తుంటాడు. ‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాకి కూడా సింజిత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వంశీ నందిపాటి గారిని నిర్మాతగా పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీతో ఇద్దరు దర్శకుల్ని పరిచయం చేయబోతోన్నామ’ని అన్నారు.

దర్శకుడు ప్రణయ్ వల్లూరిపల్లి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రానికి సింజిత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అన్ని పాటలు బాగుంటాయి. కిట్టూ గారు మంచి లిరిక్స్ అందించారు. రేహాన్ మంచి విజువల్స్ ఇచ్చారు. అనురాగ్ మంచి మాటలు అందించారు. మా సినిమా డిసెంబర్ 11న రాబోతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవి విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు గిరి పెమ్మసాని మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాతో మాకు అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవీ విన్ టీంకు థాంక్స్. ఇదే మాకు తొలి చిత్రం. సింజిత్ మంచి సంగీతమందించారు. పాటలన్నీ బాగుంటాయి. మున్ముందు మరిన్ని ఈవెంట్లలో ఆడియెన్స్ ముందుకు వస్తాం. మా సినిమా డిసెంబర్ 11న రాబోతోంది’ అని అన్నారు.

అక్షయ్ లగుసాని మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన వంశీ గారికి, ఈటీవి విన్ టీంకి థాంక్స్. ఈ ఈవెంట్‌కి సింజిత్ హీరో. అతను నా ఫ్లాట్ మేట్. 24 గంటలూ పని చేస్తూనే ఉంటాడు. మా కోసం మంచి పాటల్ని ఇచ్చాడు. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డిసెంబర్ 11న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.

కేయూరి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రంలో అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవి విన్ టీంకు థాంక్స్. నాకు మంచి పాత్రను ఇచ్చిన ప్రణయ్, గిరికి థాంక్స్. అక్షయ్, జైకృష్ణ గురించి మున్ముందు ఈవెంట్లలో మాట్లాడతాను. మేం రిలీజ్ చేసిన పాట అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

నటుడు జై కృష్ణ మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాలోని మా సాంగ్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సాంగ్ లాంచ్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రంలో మొదటి సారిగా ఇద్దరు దర్శకులతో పని చేశాను. నాకు అక్షయ్ మంచి మిత్రుడు. నాకు ఇష్టమైన జానర్ రొమ్ కామ్, ఈ సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవీ విన్ టీంకి థాంక్స్. మూవీ చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 11న మా చిత్రం రాబోతోంది’ అని అన్నారు.

కో ప్రొడ్యూసర్ సమీర్ మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాలోని ‘మేఘాలు సంద్రంలో’ సాంగ్‌ లాంచ్ ఈవెంట్‌కి వచ్చిన అందరికీ థాంక్స్. మాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి, రమణా రెడ్డి గారికి, ఈటీవి విన్ టీంకి థాంక్స్. గిరి, ప్రణయ్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. సింజిత్ మంచి పాటల్ని అందించారు. మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రఘు మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ మూవీని కష్టపడి చేశాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవీ విన్ టీంకు థాంక్స్. మున్ముందు ఈ మూవీ గురించి ఇంకా విశేషాలు పంచుకుంటామ’ అని అన్నారు.

డైలాగ్ రైటర్ అనురాగ్ మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రంలో అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవీ విన్ టీంకు థాంక్స్. గిరి, ప్రణయ్‌లకు ఆల్ ది బెస్ట్. సింజిత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు’ అని అన్నారు.

ఎడిటర్ నరేంద్ర మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమా చాలా బాగా వచ్చింది. పాటలన్నీ బాగుంటాయి. మున్ముందు మరిన్ని అప్డేట్లతో అందరినీ ఆకట్టుకుంటామ’ని అన్నారు.

కెమెరామెన్ రెహాన్ మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రంలో అవకాశం ఇచ్చిన వంశీ గారికి, సాయి గారికి, భరణ్ గారికి థాంక్స్. గిరి, ప్రణయ్‌లతో పని చేయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాయి కిషోర్ మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం డిసెంబర్ 11న రాబోతోంది. సింజిత్ మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. టైటిల్ ఎంత క్రేజీగా ఉందో సినిమా కూడా అంతే క్రేజీగా ఉంటుంది’ అని అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్ మాట్లాడుతూ .. ‘‘క్రియేటివ్ ప్రొడ్యూసర్’ సాంగ్ లాంచ్ కోసం వచ్చిన అందరికీ థాంక్స్. టీం అందరికీ కంగ్రాట్స్. డిసెంబర్ 11న థియేటర్లో కలుద్దాం’ అని అన్నారు.

Latest News

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ...

More News