తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ) కమిటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రసీమకు, సినీ కార్మికులకు తెలంగాణ సీఎం అండగా నిలుస్తున్నందుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 24 శాఖల అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. అందులో టీఎఫ్‌జేఏ సభ్యులను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు అధ్యక్షులు వైజే రాంబాబు.
జర్నలిస్టులకు టీఎఫ్‌జేఏ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో చేయాలని తలపెట్టిన కార్యక్రమాల గురించి వివరించడానికి సమయం ఇవ్వవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డిని వైజే రాంబాబు కోరగా… తప్పకుండా మరొకసారి కలుద్దామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ఉపాధ్యక్షులు ప్రేమ మాలిని, సంయుక్త కార్యదర్శి జీవీ రమణ – సురేష్ కొండి, ఇతర కమిటీ సభ్యులు ఉన్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…