సునీల్, అఖిల్ ఉడ్డెమారిల సైకాలజికల్ థ్రిల్లర్ ‘ఫైట్ మహా’ ట్రైలర్ రిలీజ్ – సినిమా ఆగస్టు 21న వరల్డ్‌వైడ్ రిలీజ్

సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రదాన పాత్రల్లో డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఫైట్ మహా”. కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా గత నెల విడుదల చేసిన టీజర్ అద్భుతమైన స్పందన వచ్చింది, మిలియన్ ప్లస్ వ్యూస్ తో ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. కాగ ఈ రోజు 2 నిమిషాల 20 సెకండ్స్ నిడివిగల ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రం ఆగస్టు 21 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రొడ్యూసర్ ఏవీఎస్ రాజు మాట్లాడుతూ – “దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ కథ చెప్పినప్పుడు మా అందరికీ బాగా నచ్చింది. కథే ఈ సినిమా నిర్మించేందుకు మమ్మల్ని ఇన్స్ పైర్ చేసింది. డైరెక్టర్ మాకు కథ ఎంత బాగా చెప్పాడో అంతే బాగా రూపొందించాడు. వైజాగ్, కేరళ, హైదరాబాద్ లో ఈ సినిమాను చిత్రీకరించాం.ఈ సినిమా పోస్టర్ లో కేవలం ఇద్దరు సునీల్, అఖిల్ ఉడ్డెమారి కనిపించినా షుమారు 40 మంది నటీ నటులు ఈ చిత్రం లో అలరించనున్నారు. జూలై నెలలో టీజర్ మా రాము చేతులమీదుగా విడుదల చేసాము మిలియన్ ప్లస్ వ్యూస్ తో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం” అన్నారు.

డైరెక్టర్ ఆనంద్ చంద్ర మాట్లాడుతూ – ” ‘ఫైట్ మహా’ లో మేము చూపించిన స్లీప్ వాకింగ్ అనే కాన్సెప్ట్ చాలా యునిక్ గా వుంటుంది. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చినా, మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రంలోని కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందని నమ్మకం ఉంది. ఈ చిత్రం ఒక వినూత్నమైన సైకాలజికల్ థ్రిల్లర్. కలలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావన, ఎక్కడో దాగి ఉన్న నిజాల చుట్టూ తిరిగే ఈ కథ. ‘మహా’ అనేది మా మూవీలో మెయిల్ లీడ్ క్యారెక్టర్ పేరు. ఆయన తన జీవితంతో ఫైట్ చేస్తుంటాడు. అందుకే ఫైట్ మహా అనే టైటిల్ మా మూవీకి పెట్టాం. లైఫ్ లో నిరాశ, నిసృహలతో ఏ విషయాన్నీ అయినా వదిలిపెట్టకూడదు. నిత్యం పోరాడుతూనే ఉండాలి అనే మంచి సందేశం ఈ సినిమాలో చూపిస్తున్నాం.” అన్నారు.

నటీనటులు – సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, దీపక్ కేశవ్, కృష్ణంరాజు (జోగి బ్రదర్స్), జబర్దస్త్ శాంతి కుమార్, ఆయేషా, హరీష్, పూర్ణ శ్రీ, మాస్టర్ రోహన్, మాస్టర్ జొన్న, హేమంత్ బాలాజీ, పద్మ వెంకట్, కందకట్ల, లక్ష్మి, సుమ రెడ్డి, నాగురిశ్లోకం, అభ భాయి జి. కల్యాణ్, మహేంద్రనాథ్, శ్రీ, పి.రామచంద్ర రాజు, ఏవీఎస్ రాజు, రోహిత్ కన్న, మధు యాదవ్, దాసరి శ్రుతి, అర్జున్, ఎం సీతరామశాస్త్రి, భవానీ శంకర్, మంజుల రాథోడ్

టెక్నికల్ టీమ్

బ్యానర్ – న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్పీ
స్క్రిప్ట్, డైరెక్షన్ – ఆనంద్ చంద్ర
ప్రొడ్యూసర్స్ – ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర
డీవోపీ – నాని ఐయివెల్లి
ఎడిటర్ – ఆనంద్ పవన్
ప్రొడక్షన్ డిజైనర్ – దేవర మధుకర్
మ్యూజిక్ – వసంత్ ఇసైపెట్టై
లిరిక్స్ – శ్రీరామ్ తపస్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నరేంద్ర చారి
CEO – శ్రీనివాస్ నల్లగంట్ల, రోహిణి స్టూడియోస్
పీఆర్ఓ – రాంబాబు వర్మ

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago