పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు అతిథులుగా ఘనంగా “సాV3” మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సాV3”. ఈ చిత్రాన్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో “సాV3” సినిమా టీజర్ ఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో

సింగర్, బిగ్ బాస్ ఫేమ్ రాము రాథోడ్ మాట్లాడుతూ – “సాV3” సినిమా టీజర్ నాకు బాగా నచ్చింది. సామ్రాట్, లిఖిత, డీమోన్ పవన్ తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో వాళ్లు పోటా పోటీగా నటించారని అనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు సంజయ్ తుమ్మ మాట్లాడుతూ – “సాV3” సినిమా టీజర్ చాలా బాగుంది. డైరెక్టర్ కృష్ణ మాయ, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. నేను డీమోన్ పవన్ నటనకు అభిమానిని. ఆయన ఫ్యూచర్ లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, నాని లా పేరు తెచ్చుకుంటాడని నమ్మకంగా చెప్పగలను. అన్నారు.

నటి హారిక మాట్లాడుతూ – ఈ సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. నేను ఈ పాత్రలో మెప్పించగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కృష్ణ మాయ కి థ్యాంక్స్. ఆయనకు సినిమా అంటే చాలా ప్యాషన్. పొద్దుటి నుంచి రాత్రి వరకు అదే ప్యాషన్ తో ఎనర్జీతో వర్క్ చేస్తుంటారు. సామ్రాట్ తన క్యారెక్టర్ లో నటించారు అనేకంటే జీవించారు అని చెప్పాలి. మా సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్ననాను. త్వరలో రిలీజ్ కు వస్తున్న సినిమాను కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.

నటి రీతు చౌదరి మాట్లాడుతూ – ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉంది. “సాV3” సినిమా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీజర్ లో లవ్ అండ్ లైఫ్ గురించి చూపించారు. నా దృష్టిలో లైఫ్ లో ఎలా కష్టాలు ఉంటాయో లవ్ లో కూడా ఉంటాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తేనే హ్యాపీగా ఉంటాం. టీజర్ లాగే సినిమా కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మా పవన్ ఈ చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ – కృష్ణ మాయ సినిమా పట్ల ప్యాషన్ ఉన్న టెక్నీషియన్. నేను ప్రొడ్యూస్ చేసిన అన్ని సినిమాలకు వర్క్ చేశాడు. నటుడిగా, ఆర్ట్ డైరెక్టర్ గా నా మూవీస్ కు పనిచేశాడు. ఎంత కష్టమైన వర్క్ అయినా చేస్తాడు. సినిమా అంటే అతనికి అంత ఇష్టం. గతంలో రైల్వే స్టేషన్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో మరింత మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా.య టీజర్ చాలా బాగుంది. పవన్ కు ఈ సినిమా మంచి పేరు తేవాలి. అతన్ని చూస్తుంటే దుల్కర్ సల్మాన్ లా అనిపిస్తాడు. “సాV3” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ – మా “సాV3” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. నా స్నేహితులు చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విష్ చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన కృష్ణ మాయ గారికి థ్యాంక్స్. సినిమా పట్ల ఆయనకు మంచి విజన్ ఉంది. ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేసే ఒక మంచి మూవీని ఆయన మన ముందుకు తీసుకురాబోతున్నారు. నా కో ఆర్టిస్ట్స్ సామ్రాట్, లిఖితతో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. టీజర్ లాగే సినిమా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. అన్నారు.

హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ – నేను కూడా మీతో పాటే “సాV3” సినిమా టీజర్ చూస్తున్నాను. టీజర్ చాలా బాగుంది. మా మూవీలో సాంగ్స్ కూడా బాగా వచ్చాయి. ఈ కథ చెబుతున్నప్పుడే ఎలాగైనా ఈ సినిమాలో నటించాలి అనేంత ఇష్టం ఏర్పడింది. మేమంతా సినిమాలో ఇంత బాగా ఇన్వాల్వ్ అయి చేశామంటే అందుకు మా డైరెక్టర్ కృష్ణమాయ కారణం. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ గా ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఈ చిత్రంతో ప్రేక్షకుల ఆదరణ, అభిమానం పొందుతాననే నమ్మకం ఉంది. మీ అందరి సపోర్ట్ మా సినిమాకు ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సామ్రాట్ మాట్లాడుతూ – నన్ను ఇప్పటిదాకా మన మూవీస్ లో లవర్ బాయ్ లా, చాక్లెట బాయ్ లా, ఫియాన్సే లా, డబ్బున్న కుర్రాడిలా చూపించారు. అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తుండేవి. ఒకే తరహా పాత్రలు చేస్తున్నాననే ఫీల్ నాలో ఉండేది. అలాంటి టైమ్ లో కృష్ణ మాయ ఈ సినిమా స్టోరీ చెప్పాడు. కథ వింటున్నప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుంది అనే క్యూరియాసిటీ కలిగింది. “సాV3″లో నన్ను త్రివిక్రమరాజు పాత్రలో కొత్తగా చూస్తారు. నేను ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమా నాకు రీలాంఛ్ లాంటిది అనుకోవచ్చు. ప్రేక్షకులు నన్ను ఈ క్యారెక్టర్ లో ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మూవీ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్ కృష్ణ మాయకు థ్యాంక్స్. మా మూవీ టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. అన్నారు.

ప్రొడ్యూసర్ వి. విజయ మాట్లాడుతూ – మా మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ కు అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సుధావల్లి, నాగవర్థిని మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరి సపోర్ట్ తో ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ కృష్ణమాయ మాట్లాడుతూ – సినిమా ప్రొడక్షన్ ఎలా చేయాలి అనేది నేను అశోక్ కుమార్ గారిని చూసి నేర్చుకున్నా. ఆయన నాకు గురువు. సినిమా దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం గారి దగ్గర వర్క్ చేసినప్పుడు తెలుసుకున్నాను. మా ఆర్టిస్టులు సామ్రాట్, పవన్, లిఖిత ముగ్గురూ అద్భుతంగా నటించారు. మూవీ క్లైమాక్స్ లో సామ్రాట్ పర్ ఫార్మెన్స్ చూడాల్సిందే. అలాగే లిఖిత ఎలాంటి పర్ ఫార్మెన్స్ కావాలన్నా చేసి చూపించింది. ఆమె నటనకు ఆశ్చర్యపోయాను. పవన్ నిజంగా గొప్ప పర్ ఫార్మర్. ఆయనకు ఫ్యూచర్ లో మంచి పేరొస్తుంది. నేనే మరో సినిమాకు ఆయనను లాక్ చేశా. తర్వాత పవన్ అంత ఈజీగా దొరకడు. ఈ సినిమాను అన్ని విషయాల్లో సక్సెస్ ఫుల్ గా తీసుకెళ్తున్నాం. ఇది టీజర్ మాత్రమే సినిమాలో ఇంకా స్ట్రాంగ్ కంటెంట్ చూస్తారు. త్వరలోనే మా చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

నటీనటులు – సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత, హారిక, తదితరులు

టెక్నికల్ టీమ్

స్టంట్స్ – అఖిల్
ఎడిటర్ – శివ శర్వాణి
డీవోపీ – పవన్ మణి
మ్యూజిక్ డైరెక్టర్ – సాయి కార్తీక్
ప్రొడ్యూసర్ – వి. విజయ
ఆర్ట్ డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – కృష్ణ మాయ
పీఆర్ఓ – బి.వీరబాబు

TFJA

Recent Posts

’90s’ వెబ్ సిరీస్ బాటలోనే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది: చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s'…

2 hours ago

*సినీ ప్రముఖుల చేతుల మీదగా పూజ కార్యక్రమాలతో #LUB చిత్ర ప్రారంభం*

జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ…

2 hours ago

‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…

1 day ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…

1 day ago

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

5 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

7 days ago