మీడియాపై తమన్నా బౌన్సర్ల దాడి

మిల్కీ బ్యూటీ తమన్నా బౌన్సర్స్ వీడియో జర్నలిస్ట్ లపై దాడి చేయడం సంచలనం సృష్టిస్తోంది. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న తమన్నా ప్రస్తుతం బబ్లీ బౌన్సర్ అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రంలో తమ్మూ కూడా లేడీ బౌన్సర్ పాత్రలోనే కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల కానున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ కోసం ఇవాళ(శనివారం) అన్నపూర్ణ స్టూడియోలో మీడియా మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ మీట్ లో కొందరు వీడియో, ఫోటో జర్నలిస్ట్ లు తమన్నా ఫోటోస్ తీసుకున్నారు.

మరి తర్వాత ఏమైందో కానీ సడెన్ గా తమన్నా బౌన్సర్లు వీరిపై దాడికి దిగారు. అక్కడ ఉన్న డస్ట్ బిన్స్ తో పాటు మరికొన్ని వస్తువులు పట్టుకుని మరీ వీరిపై దాడి చేసే ప్రయత్నం చేశారు.ఈ దాడిలో ఇద్దరు కెమెరామెన్ కు దెబ్బలు తగిలాయి. కేవలం తమన్నా వీడియో బైట్ కోసం ప్రయత్నిస్తున్నారనే కారణంతోనే వారు దాడికి దిగారు. అయినా మీడియాతో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు బైట్స్ తీసుకోవడం కామన్. ఆ కామన్ సెన్స్ లేకుండా తమన్నా సహాయకులు, లేదా ప్రోగ్రామ్ ను అరేంజ్ చేసినవారు బౌన్సర్స్ ను కంట్రోల్ చేసి ఉండాల్సింది. అలా చేయకపోవడంతో మొత్తం రచ్చరచ్చ అయిపోయింది. ఇక జరిగిన విషయంపై మీడియా సీరియస్ అయింది.

ఓ దశలో సదరు బౌన్సర్స్ పై కేస్ కూడా పెట్టాలని ప్రయత్నించారు. కానీ నిర్వాహకులు సర్ది చెప్పి వారితో సారీ చెప్పించడంతో గొడవ సద్దు మణిగింది. కానీ ఇలాంటి విషయాలు ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు కూడా జరిగాయి. కామన్ పీపుల్ కు, మీడియా వారికి మధ్య తేడా తెలియని బౌన్సర్స్ ను నియమించుకుంటే ఇలాగే జరుగుతుంది.కామన్ పీపుల్ అంటే వారు తక్కువ మీడియా వారు ఎక్కువ అని కాదు.. జనరల్ ఆడియన్‌స్ అయితే సినిమా వారిని చూస్తే హద్దులు తెంచుకుని ప్రవర్తిస్తారు. కానీ మీడియా వాళ్లు వారిని తరచూ చూస్తుంటారు కాబట్టి వారికి వీరితో ఏ సమస్యా ఉండదు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago