‘శుభం’ సినిమాను, ఆ సినిమాలో నా పాత్రను ఆదరించింనందుకు ప్రేక్షకులను నా ధన్యవాదాలు: నటుడు గవిరెడ్డి శ్రీనివాసరావు

Must Read

ప్రముఖ కథానాయిక సమంత నిర్మాతగా మారుతూ నిర్మించిన తొలిచిత్రం ‘శుభం’. హారర్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయపథంలోకి దూసుకెళుతోంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రదారుల్లో ఒకరిగా నటించిన గవిరెడ్డి శ్రీనివాస రావు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆయన మాట్లాడుతూ ” శుభం చిత్రం ఘనవిజయం సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా సినిమాతో పాటు అన్ని పాత్రలను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా నా పాత్రను కూడా ఆడియన్స్‌ బాగా ఆదిరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నా పాత్ర గురించి మాట్లాడుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. నా పాత్రతో అందరూ కనెక్ట్‌ అవుతున్నారు.
బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. త్వరలోనే ప్రతి థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులను నా యూనిట్‌తో పాటు కలవబోతున్నాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన సమంత గారికి, దర్శకుడికి నా ధన్యవాదాలు. భవిష్యత్‌లో ప్రేక్షకులను మరిన్ని మంచి పాత్రలతో అలరిస్తాను’ అన్నారు.

Latest News

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా...

More News