ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ “పోచమ్మ” ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ గ్లింప్స్ ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన రిలీజ్ చేశారు. అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్న “పోచమ్మ” వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్ చేసిన అనంతరం

దర్శకుడు బుచ్చిబాబు సాన మట్లాడుతూ – “పోచమ్మ” వెబ్ సిరీస్ గ్లింప్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంది. చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి. కొన్ని కొన్ని ముందే తెలిసిపోతుంటాయి. అలా ఈ సిరీస్ కు చాలా పాజిటివ్ వైబ్ ఉంది. గ్రామ దేవతలు అంటేనే మనకొక భయమూ, గౌరవమూ ఉంటాయి. అదంతా ఈ గ్లింప్స్ లో బాగా కనిపించింది. “పోచమ్మ” వెబ్ సిరీస్ పెద్ద హిట్ కావాలి, టీమ్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్ తో “పోచమ్మ” సిరీస్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. పోచమ్మ దేవత గొప్పతనం, మహిమను అంచనా వేయక తప్పులు చేసే కొందరిని ఆమె ఎలా శిక్షించింది, తనను పూజించే వారిని ఎలా రక్షించింది అనేది గ్లింప్స్ లో ఆసక్తికరంగా చూపించారు. ఎల్వీ ముత్తుగణేష్ అందించిన బీజీఎం ఈ గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు అనే డైలాగ్ ఈ సిరీస్ ఎలా ఉండబోతోంది అని తెలియజేస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ కంటెంట్ చూసే ఆడియెన్స్ ను ఈ వెబ్ సిరీస్ ఎంగేజ్ చేయనుంది.

TFJA

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

6 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

6 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

6 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

7 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

7 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago