తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి సి కళ్యాణ్ గారు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. అలాగే అదే మన ప్యానల్ నుండి చదలవాడ శ్రీనివాసరావు గారు కోశాధికారిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా మన ప్యానెల్ నుండి మోహన్ వడ్లపట్ల గారు, ప్రోగ్రెస్ ప్యానెల్ నుండి దామోదర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా మన ప్యానల్ నుండి అమ్మిరాజు గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు గెలిచారు. ఈసీ సభ్యులుగా ప్రోగ్రెసివ్ ప్యానల్ నుండి ముగ్గురు అనగా మైత్రి రవి గారు, నిరంజన్ రెడ్డి గారు, డిఎస్ రావు గారు గెలవగా మన ప్యానెల్ నుండి 12 మంది పద్మిని గారు, ఎషియన్ సునీల్ గారు, మోహన్ గౌడ్ గారు, శివలెంక కృష్ణప్రసాద్ గారు, దానయ్య గారు, వంశీ నందిపాటి గారు, పల్లి కేశవ రావు గారు, శ్రీనివాసరావు గారు, పుల్లారావు గారు, బాపిరాజు గారు, ఆర్ కె కౌడ్ గారు,నయీం గారు గెలిచారు. ప్రస్తుతం సెక్రటరీ పోస్టు గురించి కేసు కోర్టులో ఉండటంతో వారి ఎన్నికల ఫలితాలను ఒక సీల్డ్ కవర్లో ఎన్నికల అధికారి దుర్గా ప్రసాద్ గారు శీల్ చేసి కోర్టులో అప్పగించనున్నారు. 8వ తేదీన కోర్టులో జడ్జ్ గారి సమక్షంలో సెక్రటరీ ఎన్నికల ఫలితాన్ని వెల్లడించనున్నారు.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ముందుగా మాకు సహకరించి మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. మాకు ఓటు వేయడం కోసం వచ్చిన దూరం నుండి వచ్చిన అందరికీ థాంక్స్. 95% మెజారిటీతో మన ప్యానెల్ సభ్యులను గెలిపించినందుకు థాంక్స్. మేము ఇక్కడికి మంచి చేయడం కోసం వచ్చాము. నిర్మాతల కోసం వచ్చాము, నిర్మాతల మంచి కోసం పని చేస్తాము. అన్ని పరిశ్రమలకంటే తెలుగు పరిశ్రమ బావుంది. మాకు అందరూ కోపరేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అతి త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మా కార్యాచరణను వెల్లడిస్తాము. చిన్న నిర్మాతలకు అన్ని విధాలుగా సాయంగా నిలబడతాడు. నాకు సహకరించిన బండ్ల గణేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

అలాగే గెలిచిన సభ్యులు అందరికీ వచ్చిన ఓట్లు వెల్లడించి వారి విజయానికి అభినందనలు తెలియజేశారు. అలాగే సెక్రటరీ సంబంధిత కేసు కోర్టులో ఉండటంతో అధికారంగా కోర్టు వెల్లడించనుంది.

కోశాధికారి చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ… “మాకు మంచి మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు థాంక్స్. మాకు సపోర్ట్ ఇచ్చిన నందమూరి కుటుంబానికి, సునీల్ నారంగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా ప్యానెల్ లో అనుభవజ్ఞులు ఉండటంతో వారి అనుభవాన్ని ఉపయోగించుకుని సినీ పరిశ్రమను మరింత ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేస్తాము. చిన్న నిర్మాతలకు అండగా నిలబడతాడు” అన్నారు.

తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ… “మాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా వారికి థాంక్స్. ఇక్కడ గెలిచిన సభ్యులు అందరికీ అభినందనలు. పరిశ్రమకు మంచి చేసే వారు గెలిచారు. నిర్మాతల మండలి ఎన్నికలలో బలమైన వ్యక్తులు గెలవడం గొప్ప విషయం” అన్నారు.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago