ఘనంగా మహేష్ కాంపెల్లి ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ టీజర్ లాంచ్ ఈవెంట్…

మహేష్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ చిత్ర టీజర్‌ను చిత్రబృందం నేడు ఘనంగా విడుదల చేసింది. మిస్టరీ, సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం విభిన్నమైన కథనంతో తెరకెక్కుతోంది. “ది పాయింట్ ఆఫ్ వ్యూ” అనే ట్యాగ్‌లైన్‌నే కథలోని ప్రధాన అంశాన్ని ప్రతిబింబిస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఘనంగా మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా…

నిర్మాత సత్య చౌదరి మాట్లాడుతూ.. “మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ని. కానీ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. దాదాపు పదేళ్ల క్రితం మహేష్ ఈ కథను నాకు వినిపించారు. ఒక మహిళా ప్రధాన కథతో మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. నా తొలి నిర్మాణంతో ఇద్దరు తెలుగు హీరోయిన్లను పరిచయం చేయడం ఆనందంగా ఉంది. సినిమా రంగం నాకు కొత్త అయినప్పటికీ మహేష్ ప్రతి విషయంలో నాకు అండగా నిలిచారు. మా హీరోయిన్లు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు” అన్నారు.

హీరోయిన్ సోనియా నాయుడు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. స్టేజ్‌పై మాట్లాడటం ఇదే మొదటిసారి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్య గారికి, మహేష్ గారికి ధన్యవాదాలు. షూటింగ్ మొత్తం మహేష్ సర్ ఎంతో సపోర్టివ్‌గా ఉండేవారు. నా సహనటి పూజా రెడ్డి, సంగీత విభాగం, సినిమాటోగ్రఫీ టీమ్ అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

హీరోయిన్ పూజా రెడ్డి మాట్లాడుతూ.. “మా టీజర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మహేష్ గారు కథ చెప్పిన వెంటనే ఇది నాకు మంచి అవకాశం అని భావించాను. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు. మా టీజర్‌ను ఆదరించినట్లే సినిమా విడుదలైన తర్వాత కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు మహేష్ కాంపెల్లి మాట్లాడుతూ.. “ఇది నా తొలి దర్శకత్వ చిత్రం. నేను ఇంతకుముందు ఏ దర్శకుడి దగ్గరా పని చేయలేదని నిర్మాత సత్య గారికి ముందే చెప్పాను. అయినప్పటికీ నేను రాసుకున్న కథపై పూర్తి నమ్మకం ఉంది. దిశ ఘటనతో పాటు కొన్ని వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ కథ ద్వారా మహిళల పట్ల సమాజంలో అవగాహన పెంచే బలమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

అన్విధ్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో కీలక పాత్ర ఇచ్చిన సత్య గారికి, మహేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సినిమాకు అండగా నిలుస్తున్న మీడియా, నా కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.

సాగర్ మాట్లాడుతూ.. “మా కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. దర్శకుడు మహేష్ ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తారని నమ్ముతున్నాను. మా హీరోయిన్లు పూజా రెడ్డి, సోనియా నాయుడు అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి కష్టపడ్డ నిర్మాతతో పాటు సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు” అన్నారు.

సంగీత దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను ఇంతవరకు తీసుకొచ్చిన నిర్మాత సత్య గారికి, దర్శకుడు మహేష్ గారికి అభినందనలు. వారి కష్టం తప్పకుండా ఫలిస్తుంది. ఈ చిత్రంలో మంగ్లీ, హారిణి అద్భుతమైన పాటలు పాడారు. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు సమీర్ మాట్లాడుతూ.. “మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఒక కొత్త కోణంలో, విభిన్నమైన అంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రతి నటీనటుడు ఎంతో అద్భుతంగా నటించారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మాకు అండగా నిలిచిన నిర్మాతకు నా వందనం. అలాగే తండ్రి మరణించిన రోజునే షూటింగ్‌కు వచ్చి పనిచేసిన సాగర్ అంకితభావం నన్ను ఎంతో కదిలించింది. మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అన్నారు.

రంగారావు చౌదరి మాట్లాడుతూ.. “ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంలో మీడియా సహకారం ఎంతో అవసరం. నిర్మాత, దర్శకులకు నా అభినందనలు” అన్నారు.

దర్శకుడు సాయి మాట్లాడుతూ.. “మొదటి రోజు నుంచి ఈ సినిమా ప్రయాణంలో నేను భాగమయ్యాను. టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. మహిళా ప్రధాన కథతో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్లు, ఇతర నటీనటులు అద్భుతంగా నటించారు. ‘వ్యూ’ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” అన్నారు.

మూసా అలీ ఖాన్ మాట్లాడుతూ.. “మా సినిమాకు మద్దతుగా నిలుస్తున్న మీడియాకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లి నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇది మహిళా ప్రధాన చిత్రమైనప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” అన్నారు.

నటీనటులు

సోనియా నాయుడు, పూజా రెడ్డి, సమీర్, సాగర్ తదితరులు.

సాంకేతిక నిపుణులు

కథ, దర్శకత్వం: మహేష్ కాంపెల్లి
నిర్మాత: సత్య చౌదరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లక్ష్మీ నారాయణ
సమర్పణ: కార్తికేయ
బ్యానర్: పరవాణి చలనచిత్ర
సంగీతం: అర్జున్
నేపథ్య సంగీతం: శరవణ
ఛాయాగ్రహణం: ధర్మ జి జి
ఎడిటర్: లక్ష్మి
పీఆర్‌ఓ: దినేష్ కె

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

4 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

5 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago