ప్రతి పార్వ్శానికి ఓ ఉద్దేశం ఉంది – జవాన్ మల్టీఫేసెటెడ్ పోస్టర్ రిలీజ్
ప్రతి ముఖానికీ ఓ లక్ష్యం ఉంది – జవాన్ మల్టీఫేసెటెడ్ పోస్టర్ రిలీజ్
ప్రతి లుక్‌కీ ఓ ప్రాముఖ్యత ఉంది – జవాన్ మల్టీఫేసెటెడ్ పోస్టర్ రిలీజ్
Or
న్యాయానికున్న పలు కోణాలను ఆవిష్కరించిన ఎస్ ఆర్ కె – జవాన్ మల్టీఫేసెటెడ్ పోస్టర్ విడుదల
మీ కేలండర్లలో సెప్టెంబర్ 7ని మార్క్ చేసుకోండి. ఎస్ ఆర్ కె లోని పలు పార్వ్శాలను తెరమీద ఆవిష్కరించబోయేది ఆ రోజే!
షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా జవాన్. నయనతార నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రివ్యూ ఇటీవల విడుదలైంది. ఆ రోజు నుంచే షారుఖ్‌ఖాన్ తెర మీద ఎన్ని కోణాల్లో కనిపిస్తారోననే ఉత్కంఠ సర్వత్రా వ్యాపించింది.
ఈ సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పకనే చెప్పింది ప్రివ్యూ. యాక్షన్ గురించి జనాలు ఎంతగా మాట్లాడుకుంటున్నారో, జవాన్ సినిమాలో షారుఖ్‌ఖాన్ ఎన్ని గెటప్పుల్లో కనిపిస్తారోననే విషయం గురించి కూడా అంతే క్యూరియాసిటీతో మాట్లాడుకుంటున్నారు. అతని గెటప్పుల వెనుక ఉన్న కథల గురించి ఆసక్తికరంగా ఆరా తీస్తున్నారు.
సినిమాలోని ఆయన గెటప్పులన్నిటినీ సింగిల్ ఫ్రేమ్‌లోకి తెచ్చే విధంగా కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులోని ఐదు డిఫరెంట్ లుక్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయి. ఒకదానితో ఇంకోదానికి పోలిక లేకుండా, ప్రతి అవతార్‌లోనూ తనకు తానే సాటి అన్నంత వైవిధ్యంతో మెప్పిస్తున్నారు షారుఖ్.
ఈ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరూ షారుఖ్ ఖాన్ నెవర్ సీన్ బిఫోర్ అవతార్‌లో ప్రేక్షకులకు కన్నులపండుగ కలిగాస్తారని సంతోషిస్తున్నారు.
సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? థియేటర్లకు వెళ్దామా? అని ఎదురుచూస్తున్నారు.
జవాన్ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సగర్వంగా సమర్పిస్తోంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది జవాన్.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…