రాందేవ్ 25 ఏళ్ల కష్టానికి నిదర్శనమే ఈ ‘ఎక్స్ పీరియం’ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీ

Must Read

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘రాందేవ్‌తో నా పరిచయం ఇప్పటిది కాదు. ఈ ఎక్స్‌పీరియం పార్కుని మీ అందరి కంటే ముందుగా నేను చూశాను. 2000వ సంవత్సరంలోనే దీని గురించి రాందేవ్ నాతో పంచుకున్నారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూనే ఉన్నాను. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. రాందేవ్‌ ఓ వ్యాపారవేత్తగా ఎప్పుడూ ఆలోచించరు. పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచిస్తుంటారు. ఈ 150 ఎకరాలను వాణిజ్యంగానూ వాడుకోవచ్చు. కానీ ఆయన ఈ 25 ఏళ్లుగా రకరకాల మొక్కల్ని, వివిద దేశాల నుంచి కొత్త జాతి మొక్కల్ని ఇక్కడకు తీసుకొచ్చి ఈ పార్కుని నిర్మించారు. ఈ రకంగా రాం దేవ్ ఓ మంచి ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు.

ఈ ఎక్స్‌పీరియం పార్కుని చూసి నేను, గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు షాక్ అయ్యాం. ఇంత అద్భుతంగా ఉన్న ఈ పార్కుని చూసి షూటింగ్‌కు ఇస్తారా? అని రాం దేవ్‌ను అడిగాను. ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే అయితే ఇస్తామని అన్నారు. కానీ ఈ ఎండలో నేను ఇక్కడ హీరోయిన్‌తో స్టెప్పులు వేయడం అంటే కాస్త కష్టమే. వర్షా కాలం తరువాత ఇక్కడ మరింత గ్రీనరి వస్తుందని ఆ టైంలో షూటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. వెడ్డింగ్, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలకు ఈ చోటు అనువైనదిగా ఉంటుంది.

Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy will participate in Inauguration of Experium

దేశవిదేశాల్లో ఉండే ఎన్నో అరుదైన జాతి మొక్కల్ని ఒక చోటకు చేర్చి ఇంత అద్భుతమైన పార్కుని రాం దేవ్ నిర్మించారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం అభినందనీయం. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి ప్రకృతి, పర్యావరణ

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News