కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
కేవలం ప్రకటనతోనే ‘డాకు మహారాజ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నందమూరి అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా చూడాలనే ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ, ఇప్పుడు ఈ చిత్ర పాటల పండుగ మొదలైంది.
బాలకృష్ణ నటించిన గత మూడు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించి, ఆ ఘన విజయాలలో కీలక పాత్ర పోషించిన తమన్ ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ది రేజ్ ఆఫ్ డాకు’ పేరుతో మొదటి గీతం విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే, సంగీత ప్రియుల్లో ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, తమన్ ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు. ‘డాకు మహారాజ్’ పాత్ర తీరుని తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యాన్ని అందించారు. “డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా” వంటి పంక్తులతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక గాయకులు భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు.
లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. విజువల్ గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కనిపిస్తోంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా అద్భుతమైన అనుభూతిని పంచనుందని లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
‘డాకు మహారాజ్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…