Categories: English

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఐ హేట్‌ మ్యారేజ్‌’ ప్రారంభం

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌గా నమ్ముతూ సినిమాలు తీస్తున్నారు నేటి యువ దర్శకులు. వినూత్నమైక కాన్సెప్ట్‌లతో, వైవిధ్యమైన సినిమాలు తీస్తూ అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే యువ దర్శకుడు పరమేష్‌ రేణుకుంట్ల ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఓ చిత్రాన్ని ప్రేక్షకల ముందుకు రాబోతున్నాడు. ‘ఐ హేట్‌ మ్యారేజ్‌’ పేరుతో పరమేష్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో ఆర్య సినిమా పతాకంపై ఎం.దయానంద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.

సుగి విజయ్‌, జుప్సీ భద్ర హీరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత శ్రీనివాస రాజు క్లాప్‌ నివ్వగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అన్నయ్య, రచయిత, నిర్మాత విజయ్‌కుమార్‌ కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. చిత్ర సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి ముహుర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకలు నచ్చే భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం.

యూత్‌ఫుల్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారికి కావాల్సిన అంశాలు వున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందరిని కడుపుబ్బ నవ్విస్తుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘సోమవారం నుంచి చిత్రీకరణ ప్రారంభించాం. ఏకధాటిగా డిసెంబర్‌ వరకు జరగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది.

రొటిన్‌కు భిన్నంగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్నిప్రేక్షకులకు అందించబోతున్నాం’ అన్నారు. సుగి విజయ్‌, జుప్సీ భద్ర, పృథ్వీ, ఆశ్రిత, లోహిత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: విజయ్.సి.కుమార్‌, సంగీతం: వరికుప్పల యాదగిరి, అడిషినల్‌ డైలాగ్స్‌: శ్రీనివాస్‌ తేజ, నిర్మాత: ఎం.దయానంద్‌, కథ- స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పరమేష్‌ రేణుకుంట్ల.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago