Categories: EnglishNews

“ఆదిపర్వం” పాటలుఅదిరిపోయాయి!!

గీత రచయితలు –
గాయనీగాయకులు-
సంగీతదర్శకులకు
సముచిత స్థానం కల్పించడం
కడు అభినందనీయం!!

ప్రముఖ సంగీత దర్శకుల
మెచ్చుకోలు

ఆదిపర్వం” ఇది అమ్మవారి కథ, అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ, ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ కుమార్ మేగోటి దర్శకుడు.
రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ – ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు – కన్నడ – హిందీ – తమిళ – మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి… ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదలయ్యాయి. సంచలన సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి క్రిష్ణ పాటల వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భాజపా నాయకులు మరియు నిర్మాత చీర్ల శ్రీనివాస యాదవ్, జనసేన నాయకులు యనమల భాస్కరరావు, ‘డాన్స్ మాస్టర్’ సన్ రేస్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్

వి.ఉదయ శంకర్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సినిమా మ్యూజిక్ లో భాగం అయిన భారతి బాబు (రచయిత), రామ్ సుధి (మ్యూజిక్ డైరెక్టర్), బి. సుల్తాన్ వలి (మ్యూజిక్ డైరెక్టర్), ఓపెన్ బనాన ప్రవీణ్ (మ్యూజిక్ డైరెక్టర్), లూబిక్ లీ మార్విన్ (మ్యూజిక్ డైరెక్టర్),ఊటుకూరు రంగారావు (గీత రచయిత), రాజ్ కుమార్ సిరా (రచయిత), సాగర్ నారాయణ(రచయిత), సత్యమూర్తి (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు), లక్ష్మి పద్మజ (సింగర్), మేఘన నాయుడు, వినాయక్ (సింగర్), వెంకి (సింగర్), అపర్ణ (సింగర్), నటీనటులు : సమ్మెట గాంధీ, జెమిని సురేష్, అయేష, శివ కంఠమనేని, రావుల వెంకటేశ్వర్ రావు, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్.శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి కృష్ణ “ఆదిపర్వం” గీతాలను ఆవిష్కరించారు.
ఆడియో వేడుకలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులకు సముచిత స్థానం కల్పించడమనే సత్సంప్రదయాన్ని పునః ప్రారంభించిన దర్శకనిర్మాతలు అభినందనీయులని వారు పేర్కొన్నారు. పాటలు చాలా బాగున్నాయని, ఈ చిత్రం సాధించే విజయంలో ఇవి తప్పకుండా ముఖ్యపాత్ర పోషిస్తాయని మిగతా అతిధులు అభిలషించారు. చిత్ర దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ…”బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం”అన్నారు.

మంచులక్ష్మీ, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, శివకంఠంనేని , వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెటగాంధీ, యోగికత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, అయేషా, రావుల వెంకటేశ్వర్ రావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, కైపా ప్రతాప్ రెడ్డి, జ్యోతి, శ్రీరామ్, రాఘవేంద్ర, అమృత్,రాజ్ కుమార్, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), పద్మారావు, సునీల్, మల్లి, నాగరాజు, మృత్యుంజయ శర్మ తదితరులతోపాటు దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రంలో నటీనటులు: మంచులక్ష్మీ, శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, కైపా ప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు.

సాంకేతికవర్గం:
సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్
ఆర్ట్ : కేవీ రమణ
మ్యూజిక్ : మాధవ్ సైబా – సంజీవ్ మేగోటి, బి.సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్.
సాహిత్యం: సాగర్ నారాయణ్, రాజాపురం శ్రీనాథ్, ఊటుకూరు రంగారావు, మనేకుర్తి మల్లికార్జున, రాజ్ కుమార్ సిరా
ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి,
ఫైట్స్: నటరాజ్
కొరియోగ్రఫీ : సన్ రేస్ మాస్టర్  
పబ్లిసిటీ డిజైనర్ : రమణ బ్రష్
పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ
కో డైరెక్టర్: అక్షయ్ సిరిమళ్ళ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:
ఘంటా శ్రీనివాసరావు
సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి- ప్రదీప్ కాటుకూటి- రవి దశిక- రవి మొదలవలస –
శ్రీరామ్ వేగరాజు.
నిర్మాత : ఎమ్.ఎస్.కె.
రచన, దర్శకత్వం: సంజీవ్ కుమార్ మేగోటి,

Tfja Team

Recent Posts

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

4 hours ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

13 hours ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

1 day ago

“అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…

1 day ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్…

2 days ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల ఘన విజయం*

▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…

2 days ago