1980’s లో రాదే కృష్ణ ఈ నెల 18న బ్రహ్మాండమైన విడుదల

Must Read

ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై వూడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్ ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎం. ఎల్. రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా1980’s లో రాదే కృష్ణ. ఈ సినిమాని తెలుగు మరియు బంజారా రెండు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ మరియు సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులు ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ప్రొడ్యూసర్ వూడుగు సుధాకర్ మాట్లాడుతూ : ఈనెల 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్ SK. ఇస్మాయిల్ మాట్లాడుతూ : ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో అందమైన ప్రేమజంట ఏ విధంగా కులాల మధ్య ఉన్న విభేదాలు వలన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి మనిషిలో ఈ కుల పిచ్చి లేకుండా ఎలా మార్పు తీసుకురావాలి అనే విధంగా ఒక చిన్న ప్రయత్నం చేశాము. గతంలో కూడా చాలా సినిమాలు గ్రామీణ నేపథ్యంలో వచ్చినవి వాటిని ఏ విధంగా ఆదరించారో ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 18న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము.

నటీనటులు : ఎస్ ఎస్ సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి తదితరులు

టెక్నీషియన్స్ :
నిర్మాణం : ఎస్ వి క్రియేషన్స్
నిర్మాత : వూడుగు సుధాకర్
డిఓపి : ఇలియాజ్ పాషా
రైటర్ : రాజేష్ మాచర్ల
డైలాగ్స్ : ఎం. రాజేష్, చరణ్, ఖమ్మం బాబు, జ్ఞానేశ్వర్, వై ఉపేందర్
తెలుగు లిరిక్స్ : మల్ రాజా
బంజారా లిరిక్స్ : ఎం. శ్రీనివాస్ చౌహన్
మ్యూజిక్ : ఎం ఎల్ రాజా
దర్శకుడు : ఇస్మాయిల్ షేక్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పిఆర్ఓ : మధు VR

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News