Uncategorized

వైభవంగా ‘ఇద్దరు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌!

అర్జున్‌ సర్జా, రాధిక కుమారస్వామి, జె.డి చక్రవర్తి, ఫైజల్‌ ఖాన్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.ఎస్‌.రెడ్డి సమర్పణలో ఫర్హీన్‌ ఫాతిమా…

1 year ago

‘రంగబలి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’ వస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి…

1 year ago

సుఖ మీడియా ‘’నారాయణ & కో ‘ ట్రైలర్

హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేసిన సుధాకర్ కోమాకుల, చిన్నా పాపిశెట్టి, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ & సుఖ మీడియా ‘’నారాయణ & కో ‘ ట్రైలర్    …

2 years ago

ఎన్ టీ ఆర్ నేషనల్ లెజెండరీ అవార్డ్స్

కర్టెన్ రైజర్ ఆవిష్కరించిన మంత్రి తలసాని ఎఫ్.టి.పి.సి ఇండియా - తెలుగు సినిమా వేదిక సంయుక్త నిర్వహణ!!!      ఫిలిం అండ్ టెలివిజన్ కౌన్సిల్ అఫ్ ఇండియా…

2 years ago

విరూపాక్ష’ సినిమాకు కథే హీరో..సాయి ధరమ్ తేజ్

విరూపాక్ష' సినిమాకు కథే హీరో.. పాత్రల పరిచయ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా…

2 years ago

‘దసరా’ మేము ఊహించిన దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది:   నాని

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సందర్భంగా హీరో నేచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో దసరా బ్లాక్ బస్టర్ విశేషాలని పంచుకున్నారు. దసరా విజయం ఎలా అనిపించిది ? సినిమా చూసిన వారంతా గొప్పగా స్పందిస్తున్నారు. విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ మ్రోగుతూనే వుంది. మాట్లాడి చాలా కాలం అయిన వారు కూడా ఎమోషనల్ గా మెసేజ్ లు పెడుతుంటే.. దీని కోసమే సినిమా తీశాం కదా అనిపించిది. చాలా ఆనందంగా వుంది. దసరా లో చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్లు ఏవి ? దసరా లొకేషన్ లో ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ ఏదీ లేదు. అన్నీ చాలా కష్టపడి  చేసిన సీన్లే. దుమ్ము, ధూళి, వేడి  మధ్య పని చేశాం. అయితే బాగా వస్తున్నాయని ఫీలింగ్ మాత్రం అన్ని సీన్లకి వుంది. థియేటర్ లో ఎలా వుంటుందో అని ఎక్సయిటెడ్ గా అనిపించింది మాత్రం దసరా క్లైమాక్స్. ప్రేక్షకులతో కలసి థియేటర్ లో చూడటానికి చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూసాం. ఆన్ లైన్ ఎడిటింగ్ చూసినప్పుడే మేము షాక్ అయ్యాం. మీరు కంప్లీట్ రీరికార్డింగ్ తో చూసేసరికి ఆ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది. రామ్ చరణ్ కు రంగస్థలం, అల్లు అర్జున్ కి పుష్ప.. మీకు దసరా అలా అని సోషల్ మీడియాలో  మాట్లాడుకుంటారు.. ఈ సినిమా మీలో నటుడికి తృప్తిని ఇచ్చిందా? నటుడిగా నేను ఆనందపడతాను. కానీ తృప్తి పడను. ఎప్పుడు తృప్తి పొందుతామో ఇంకా ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ఈ సినిమాకే కాదు.. ఏ సినిమాకి తృప్తి పడను. ఆనందం మాత్రం వుంటుంది. దసరా తో టీం అందరికీ  మంచి పేరు వచ్చింది. గ్రేట్ ఫీలింగ్. దసరా కథ విన్నప్పుడే దసరా కి ఇంత స్పాన్ వుందని అనుకున్నారా ? ఈ కథ విన్నప్పుడే ఇండస్ట్రీ లో బెస్ట్ టెక్నిషియన్స్ శ్రీకాంత్ కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సినిమా చేస్తున్నపుడే శ్రీకాంత్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పాను. విడుదలకు ముందే చాలా ఈవెంట్స్ లో శ్రీకాంత్ పేరు గుర్తుపెట్టుకోండని చెప్పాను. మిగతా భాషలల్లో తీసుకురావాలని ఎప్పుడు నిర్ణయించారు ? కథ విన్నప్పుడే. ప్రేమ స్నేహం పగ యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్. మన కల్చర్ ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మ తో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి కథ వచ్చినపుడు ఇది మా కల్చర్ చెప్పడం మన బాధ్యత. దినిని అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాంతారతో భూత్ కొళా అనేది కర్ణాటకలో వుందని దేశంలో అందరికీ తెలిసింది. ఇలా మన కల్చర్ ని చెప్పే అవకాశం వచ్చినపుడు దానిని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మాస్ రస్టిక్ సినిమాలు నడుస్తున్నాయి కదా.. ఇలాంటి సినిమా కోసం ఇన్నాళ్ళు ఎదురుచూశారా ? నేను దేని కోసం ఎదురుచూడను. దసరా మాస్ సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా విడుదలకు ముందే దాని నుంచి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఆరేళ్ళ పాపకి తండ్రిగా ఓ సినిమా చేస్తున్న . నేను ఏ బ్రాకెట్ లో పడకూదని భావిస్తాను. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సినిమాలు చేయలనేది నా ఆలోచన. జెర్సీ ఫ్యాన్స్ వున్నారు.. ఇప్పుడు దసరా ఫ్యాన్స్ వున్నారు.. వాళ్లకి సినిమా వుండాలి, వీళ్ళకి సినిమా వుండాలి. నటుడిగా ఈ వైవిధ్యం వుండాలి. దసరా కి నార్త్ నుంచి రెస్పాన్స్ ఎలా వుంది   ? చాలా అద్భుతంగా వుంది. చాలా గొప్ప రివ్యూలు వచ్చాయి. చూసిన వారంతా ఈ ఏడాది మా ఫేవరేట్ ఫిల్మ్ దసరా అని చెబుతున్నారు. మేము ఊహించినదాని కంటే అక్కడ ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించిన ఓపెనింగ్ వచ్చేసింది. దసరా కి వచ్చింది కొన్ని స్ట్రయిట్ హిందీ సినిమాలకి కూడా రాలేదు. రోజురోజుకి పెరుగుతోంది. మీ గత సినిమాల విజయాలకి మాస్ దసరా విజయానికి ఎలాంటి తేడా వుంది ? ఈ సినిమా విడుదలకు ముందు మీరు లవర్ బాయ్ కదా దసరా ఎలా వుంటుందని కొందరు అడిగారు. కానీ నా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ దసరా, ఎంసిఏ, నేను లోకల్. మూడు మాస్ సినిమాలు. నేను ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే వున్నాను. నేను ఏది జోనర్ వారిగా చూడను. నచ్చితే చేసేస్తాను. మీకు కంఫర్ట్ ఫుల్ జోనర్ ?…

2 years ago

‘రావణాసుర’ మాములుగా వుండదు.. దద్దరిల్లుతుంది.రవితేజ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ‘రావణాసుర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ .. దర్శకుడితో మాంచి సింక్ లో వుండి ప్రతి సెట్ చాలా అద్బుతంగా వేశారు. డివోపీ విజయ్ కన్నన్ ఎక్స్ టార్డినరీగా చేశారు. రెండు పాటలు చేసిన జికే విష్ణు, దివాకర్ మణి, ప్రసాద్ మురెళ్ళకి థాంక్స్. వెంకట్, శివ ఫైట్స్ ఇరగదీశారు. మా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఎక్స్ లెంట్ గా చేశారు. ఈ సినిమా మ్యూజిక్ కి స్పెషల్ ఎప్పిరియన్స్ భీమ్స్. నాకు ఇష్టమైన టెక్నిషియన్. ఈ సినిమాకి హర్ష వర్ధన్.. అద్భుతమైన సౌండ్ ఇచ్చాడు. మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. రైటర్ శ్రీకాంత్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాలి. తనతో టైగర్ నాగేశ్వర్ చేస్తున్నాను. రోజ్ డ్యాన్స్ లని చాలా ఎంజాయ్ చేస్తారు. మేఘా, దక్ష, పూజిత, అను, ఫారియా .. హీరోయిన్స్ అంతా పర్ఫెక్ట్ గా చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఆది తో నాకు మంచి టైమింగ్ కుదిరింది. ఈ కాంబినేషన్ కి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని కోరుకుంటున్నాను. మా ఎడిటర్ నవీన్ నూలి.. సినిమా చూసి మొదట చెప్పాల్సింది వాళ్ళే.  ఈ సినిమా గురించి చాలా బాగా చెప్పాడు. చాలా నమ్మకంగా వున్నాం. ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఏప్రిల్ 7న విజల్స్ పడతాయి. మా ఆర్టీ టీం వర్క్ శ్వేతా, వ్రిందా, నమ్రత.. ఆర్టీ టీం వర్క్ బ్యాక్ బోన్స్. అభిషేక్ నామా ని మేము క్యూట్ బాయ్ అంటాం. రావణాసుర టైటిల్ కూడా అతనిదే. టైటిల్ డిజైన్స్ కూడా తనవే. తను మల్టీ టాలెంటెడ్. ఈ సినిమా పెద్ద హిట్ అయి మా ఇద్దరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా బావుంటుంది. నిర్మాతలుగా మాకు మంచి కాంబినేషన్  ఏర్పడుతుందని భావిస్తున్నాను. సుశాంత్ చాలా సాఫ్ట్ పర్శన్. తనతో చేసిన ప్రతి సీను ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో తనది ఎక్స్ లెంట్ క్యారెక్టర్. చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాతో కొత్త సుశాంత్ ని చూడబోతున్నారు. సుధీర్ వర్మ  నాకు ఇష్టమైన డైరెక్టర్. చాలా స్వీట్ అండ్ పాజిటివ్ పర్శన్. సుధీర్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. ఏప్రిల్ 7 థియేటర్స్ లో ఇరగదీసేద్దా. మాములుగా వుండదు. సౌండ్ దద్దరిల్లుతుంది. ప్రేక్షకులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు. జై సినిమా’’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ.. అభిషేక్ గారికి థాంక్స్. శ్రీకాంత్ గారు కథ చెప్పినప్పుడే రవితేజ గారిని ఇలా ఎప్పుడూ చూడలేదు, చాలా బావువుందని చెప్పాను. మాస్ మహారాజాని ఎప్పుడూ ఇలా చూసి వుండరు. సుధీర్ గారు అద్భుతమైన డైరెక్టర్. హీరోయిన్స్ అంతా చక్కగా చేశారు. టెక్నిషియన్స్ అందరికి కృతజ్ఞతలు. రవితేజ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయనతో పని చేయడం చాలా ఎంజాయ్ చేశాను’’ అన్నారు.  దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా స్వామి రారా తర్వాత నాకు వచ్చిన మొదటి ఫోన్ కాల్ రవితేజ గారిది. ఆప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు.ఒకసారి ఫోన్ చేసిన శ్రీకాంత్ కథ చెప్పాడు విను అన్నారు. అద్భుతమైన కథ. ఇంత మంచి కథ డైరెక్ట్  చేయడానికి నన్ను ఎంచుకోవడం అనందంగా వుంది. హీరోయిన్స్ అందరూ అద్భుతంగా చేశారు. రవితేజ గారు ఎప్పుడూ ఎక్స్ టార్డినరీగా చేస్తారు. ఈ సినిమాలో థ్రిల్ అవుతారు, షాక్ అవుతారు. ఇందులో సుశాంత్ మరో సర్ప్రైజ్. ఆయన్ని కొత్తగా చూపించానని భావిస్తున్నాను. శ్రీకాంత్ అద్భుతమైన కథ ఇచ్చారు. హర్ష వర్ధన్, బీమ్స్, విజయ్, శీను.. టెక్నికల్ టీం, ప్రొడక్షన్ టీం అందరికీ కృతజ్ఞతలు ‘’ తెలిపారు.    నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. ఈ వేడుక చూస్తుంటే 50 రోజుల పండగలా వుంది. ఏప్రిల్ 7 తర్వాత .. ఇక్కడే యాభై రోజుల పండగ  చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు.   హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ.... నాకు ఇంతపెద్ద అవకాశం ఇచ్చిన రవితేజ గారికి, నిర్మాతకు, దర్శకుడు సుధీర్ వర్మ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు. భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. రవితేజ గారు నన్ను తలెత్తుకునేలా చేశారు. ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రవితేజ గారితో పని చేయడం అంటే ఆయన అభిమానులతో కలసి పని చేయడం లాంటింది. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’’ తెలిపారు. పూజిత మాట్లాడుతూ.. ‘రావణాసుర’ నాకు చాలా స్పెషల్ మూవీ. రవితేజ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. దర్శక నిర్మాతలకు, నటీనటులందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న అందరూ ‘రావణాసుర’చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. దక్ష మాట్లాడుతూ...అభిషేక్ పిక్చర్స్ నాకు హోం బ్యానర్ లా అనిపిస్తుంది. సుధీర్ వర్మ గారితో పని చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. రవితేజ గారి లాంటి గ్రేట్ కోస్టార్ తో పని చేయడం నాకు ఇదే మొదటి. టీం అందరికీ థాంక్స్.  మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. రవితేజ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్టింగ్ డ్యాన్సింగ్, కామిక్ టైమింగ్ సెన్స్ అఫ్ హ్యుమర్  ఇలా చాలా విషయాలు వున్నాయి. రవితేజ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇలాంటి యూనిక్ ఫిల్మ్ లో భాగం అయినందుకు చాలా ఆనందంగా వుంది. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఎస్కేఎన్ మాట్లాడుతూ.. రవితేజ గారు కేవలం ప్రతిభని నమ్మే వ్యక్తి. ఈ ట్రైలర్ చూస్తుంటే ఆయన పాత రికార్డులన్నీ బద్దలుగొట్టేలా వుంది. సుశాంత్ గారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు. వంశీ మాట్లాడుతూ.. రవితేజ గారితో పని చేస్తున్నపుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు నేను గెలవాలి అనరు. మనం గెలవాలి అంటారు. నేనుండాలి అనరు. మనం వుండాలి అంటారు. అది గొప్ప లక్షణం. సుధీర్ వర్మ థ్రిల్లర్ అద్భుతంగా తీశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.  సురేష్ బాబు మాట్లాడుతూ.. రవితేజకి అభినందనలు. తను ఎనర్జిటిక్ పర్శన్. దర్శకుడు సుధీర్ వర్మ, నిర్మాతలు, సుశాంత్, హీరోయిన్స్, అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. నా లాంటి దర్శకులు ఇండస్ట్రీలో వున్నారంటే దానికి కారణం మాస్ మహారాజ రవితేజ. ఆయనతో మూడు సినిమాలు తీశాను. మనం ఒకటి అడిగితే నాలుగు వేరియేషన్స్ ఇచ్చే హీరో రవితేజ. డాన్ శీను సమయంలో రాజమౌళి గారు స్వయంగా ఈ మాట చెప్పారు. పరిశ్రమలో నాకు అన్నయ్య రవితేజ. రావణాసుర ట్రైలర్ ఎక్స్ టార్డినరిగా వుంది. సుధీర్ వర్మ అద్భుతమైన టెక్నిషియన్. మంచి టీం ఎక్స్ టార్డినరిగా తీశారు. సుశాంత్ కి ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాలో చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.   హనురాఘవపూడి మాట్లాడుతూ.. రవితేజ గారికి నిజంగా దండం. మొన్న వాల్తేరు వీరయ్యల్లో ఒకలా కనిపించారు. అంతకుముందు ధమాకాలో మరోలా కనిపించారు. ఇప్పుడు రావణాసురలో ఇంకొల కనిపిస్తున్నారు. మూడు తలలు ఇందులోనే అయిపోయాయి. ఇప్పటికే బోలెడు హ్యాట్రిక్ లు ఇచ్చారు. ఇది మరో హ్యాట్రిక్ అవుతుంది. ఇందులో సందేహం లేదు. టీజర్ ట్రైలర్ అద్భుతంగా వున్నాయి. ఈ సినిమా సుధీర్ కోసం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్’’ చెప్పారు. వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ..రావణాసుర ట్రైలర్ చాలా నచ్చింది. రవితేజ గారికి, టీం అందరికీ ఆల్ ది బెస్ట్.సినిమా సూపర్ హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు’’ అన్నారు. హైపర్ ఆది మాట్లాడుతూ.. ప్రతిభని ప్రోత్సహించే హీరో రవితేజ. ఆయనది గొప్ప మనసు. సినిమాతో పాటు సినిమా చేసే హీరో రవితేజ గారు. ఎప్పుడూ పాజిటివ్ గా వుంటారు. ..రావణాసుర కి పది తలలు వుంటాయి. తలకి 10 కోట్లు వేసుకున్నా.. ఈ సినిమాకి వందకోట్లు గ్యారెంటీ. హ్యాట్రిక్ వందకోట్లు హిట్లు ఈ సినిమాతో రవితేజ అన్నకి సాధ్యం కాబోతుంది. సుధీర్ వర్మ గారు అద్భుతంగా తీశారు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు…

2 years ago

నాగా నాయుడు పాత్ర  బిగ్ ఛాలెంజ్: విక్టరీ వెంకటేష్

Naga Naidu's Role Big Challenge: Victory Venkatesh 'Rana Naidu' was a major milestone in Venkatesh Daggubati's career.

2 years ago

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టన్నింగ్ న్యూ లుక్

Superstar Mahesh Babu's stunning new lookSuperstar Mahesh Babu is the most desirable man in the country.

2 years ago

ఆకట్టుకునే ఫస్ట్ లుక్ తో ‘డిటెక్టివ్ తీక్షణ’

With my 50th film 'Detective Thikshan', the audience will not only be entertained but also undergo a thrilling experience" -…

2 years ago