మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. "ధమాకా" ఆల్బమ్ లోని జింతాక్ పాట మాస్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా జింతాక్ పాట 26 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషనల్ సాంగ్ గా అలరిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మాస్ డ్యాన్స్ ట్యూన్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు అన్ని వర్గాల నుండి ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. ప్రతి రెండు రోజులకు వన్ మిలియన్ వ్యూస్ పెంచుకుంటూ యూట్యూబ్, మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ లో దూసుకుపోతుంది జింతాక్ సాంగ్. జింతాక్ పాటలో రవితేజ మాస్ డ్యాన్సులు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశాయి. రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ ఈ పాటని ఎనర్జీటిక్ గా పాడగా, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.ఇటివలే చిత్ర యూనిట్ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ 'ధమాకా' చిత్రం విడుదల తేదిని ప్రకటించారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ-శేఖర్
సక్సెస్ ఫుల్, డైనామిక్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలతో పాటు తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో…
నటీనటులు: విజయ్ శంకర్, అషు రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్ తదితరులు దర్శకత్వం: జీ…
సింగిల్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని హలో మీరా అంటూ ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు.…
గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం B&W (బ్లాక్ & వైట్). పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..…
యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామహైబ్రిడ్ అల్లుడు’. నటకిరీటి డా.…
ఓ అమ్మాయిని ఎవరో దారుంగా చంపేసుంటారు. ..ఆ హత్యను ఎవరు చేశారని పోలీస్ ఆఫీసర్స్ దర్యాప్తు చేస్తుంటారు. నవీన్ చంద్రను అనుమానిస్తుంటారు. మరో వైపు ఓ హంతకులు…
Picking the right kind of subjects is essential for talented youngheroes to win the patronage of the Telugu audience. There's…
''అరే.. స్టాక్స్ ఉదమ్ములేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిపోతుంది'' అని అంటున్నారు టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్ అనిల్ రావిపూడి. ఆహా తెలుగు ద్వారా ఓటీటీలోకి…
విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు సత్యదేవ్. రీసెంట్‌గా విడుదలైన చిత్రం ‘రామ్ సేతు’తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు ఈ విలక్షణ…