టాలీవుడ్

“చాల్లే చాల్లే” పాటను విడుదల చేసిన శివ నిర్వాణ

లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం “అభిరామ్” ఈ చిత్రం…

3 years ago

తిమ్మాపూర్ ని దత్తత తీసుకున్ననిర్మాత అభిషేక్

సక్సెస్ ఫుల్, డైనమిక్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలతో పాటు తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తిమ్మాపూర్ కేబినెట్ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి జన్మస్థలం కావడం మరో విశేషం. అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్ హైదరాబాద్‌ లోని జే ఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది.  వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, అనుపమ్ ఖేర్ , వివేక్ అగ్ని హోత్రి, పల్లవి జోషి, పీవీ సింధు, ఉత్తర్ ప్రదేశ్ మంత్రి నందగోపాల్, శ్రీమతి కావ్య రెడ్డి, స్నేహలతా అగర్వాల్, నిశాంత్ అగర్వాల్, అర్చన అగర్వాల్, సోనమ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ విలేజ్ మైల్ స్టోన్ ని ఆవిష్కరించారు. తిమ్మాపూర్ గ్రామ విద్యార్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ కుటుంబం ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది.  అభిషేక్ అగర్వాల్ తండ్రి గారి పుట్టిన రోజున గ్రామాన్ని దత్తత తీసుకోవడం మరింత ఆనందకరమైన విషయం. గొప్ప పనులు చేసేవారికి అందరి ఆశీస్సులు వుంటాయి. అభిషేక్ అగర్వాల్ వెంట మేముంటాం. తిమ్మాపూర్ లో మళ్ళీ కలుస్తాం. విద్యార్ధులందరికీ నా ఆశీస్సులు. అలలకు భయపడితే పడవ ముందుకు వెళ్ళలేదు. ప్రయత్నించేవారికి ఓటమి వుండదు. మీరంతా గొప్పగా ఎదగాలి.'' అని కోరారుపీవీ సింధు మాట్లాడుతూ.. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అభిషేక్ అగర్వాల్ గారి గొప్ప మనసుకు హ్యాట్సప్. తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్నీ మౌలిక వసతులు కల్పించడానికి సంకల్పించారు. గ్రామంలోని విద్యార్ధులు కూడా చక్కగా చదువుకొని మరెందరికో స్ఫూర్తిని ఇవ్వాలి. అభిషేక్ అగర్వాల్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్'' తెలిపారు. పల్లవి జోషి మాట్లాడుతూ.. ఇక్కడ కూర్చున్న స్కూల్ విద్యార్ధులని చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తుకువచ్చాయి. అభిషేక్ అగర్వాల్ గారు గ్రామాన్ని దత్తత తీసుకోవడం మరింత మెరుగైన విద్య అందుతుందని విశ్వాసం వుంది. భవిష్యత్ లో మీలో నుండి ఒక పీవీ సిందు వస్తుందనే నమ్మకం వుంది. ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నా అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్ హృదయపూర్వక కృతజ్ఞతలు.వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. భారతదేశానికి పల్లెలు పట్టుకొమ్మలు. నాగరిక,  సంస్కృతికి మూలకేంద్రాలు పల్లెలు. ఆలాంటి పల్లెలని అభివృద్ధి పధంలోకి తీసుకురావడం నిజమైన ధర్మం, దేశభక్తి. అభిషేక్ అగర్వల్  తిమ్మాపూర్ న్ని  దత్తత తీసుకోని, ఆదర్శ గ్రామంగా మలచడానికి సంకల్పించడం గొప్ప విషయం. ఇంత గొప్ప ఉపకారాన్ని చేస్తున్న అభిషేక్ అగర్వల్ కి అభినందనలు. వారి పిల్లలు కూడా ఈ సేవకార్యక్రమాలని కొనసాగించాల్సిందిగా ఆశిస్తున్నాను.శ్రీమతి కావ్యరెడ్డి మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ మా అత్తగారి ఊరు  తిమ్మాపూర్ ని దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా వుంది. వారికీ మనస్పూర్తిగా అభినందనలు. గ్రామానికి విద్య వైద్యం ఇలా అన్ని మౌలిక వసతులు కల్పించి గొప్ప అభివృద్ధి పధం వైపు నడిపిస్తున్నందుకు అభిషేక్ అగర్వాల్ గారికి అభినందనలు'' తెలిపారు. మంత్రి నందగోపాల్ మాట్లాడుతూ.. చంద్రకళ ఫౌండేషన్ గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తోంది. కోవిడ్ సమయంలో వారు అందించిన సేవలు మహోన్నతమైనవి. కష్ట కాలంలో వారు చూపిన ఔదార్యం అభినందనీయం.అభిషేక్ అగర్వాల్ మరో అడుగు ముందుకేసి  తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చడానికి ముందుకు రావడం చాలా సంతోషం. చంద్రకళ ఫౌండేషన్ మరిన్ని సేవాకార్యక్రమాలతో ముందుకు వెల్లాలని, ఈ విషయంలో వారికి మా సాకారం ఉంటుంది'' అని పేర్కొన్నారు.కాళి సుధీర్ మాట్లాడుతూ... అమరేంద్ర గారి ఆలోచన వలనే ఇది మొదలైయింది. ఆయనకి కృతజ్ఞతలు. జ్యోతి గారికి కృతజ్ఞతలు. పీవీ సింధు, పల్లవి జోషి, వివేక్ అగ్ని హోత్రి, నందగోపాల్, అనుపమ్ ఖేర్, కావ్యరెడ్డిగారికి .. వేడుకకు హాజరైన అందరికీ కృతజ్ఞతలు.'' తెలిపారు

3 years ago

మా చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన…

3 years ago

గ్రాండ్ గా “రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అశ్విన్ & రమేష్.కె సమర్పణలో పద్మావతి పిక్చర్స్ పతాకంపై అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా పద్మమగన్ దర్శకత్వంలో వి. యస్. సుబ్బారావు నిర్మించిన చిత్రం "రూమ్".…

3 years ago

వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ…

3 years ago

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందు “హాంట్” మూవీ టీం నిరసన

హాంట్ సినిమా వివాదం రోజు రోజు కి పెరుగుతుంది. హంట్ మూవీ టైటిల్ మాది అంటూ ఇటు శ్రీ క్రియేషన్స్, అటు భవ్య క్రియేషన్స్ వాదనలు వినిపిస్తున్నప్పటి…

3 years ago

రాఘవ లారెన్స్, కతిరేసన్ ‘రుద్రుడు’ గ్లింప్స్ విడుదల

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌'రుద్రుడు'. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. నిర్మాతలు సినిమా విడుదలకు సరైన స్లాట్‌ని ఎంచుకున్నారు. రుద్రుడు 2023లో ఏప్రిల్ 14న వేసవిలో థియేటర్స్ లో అలరించనుంది.రాఘవ లారెన్స్ బర్త్ డే కానుకగా 'రుద్రుడు' భారీ యాక్షన్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. లారెన్స్ కంప్లీట్ ట్రాన్స్ ఫార్మ్మేషన్ లో రగ్గడ్ లుక్ లో కనిపించారు. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్స్ క్రియేటడ్ అనే ట్యాగ్ లైన్  సినిమాలో లారెన్స్ పాత్రని తెలియజేస్తింది.  యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. ఈ గ్లింప్స్ యాక్షన్ ని ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుంది.ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పిస్తున్నారు.ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.రుద్రుడు ఏప్రిల్  14,2023న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్  కానుంది. తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం - కతిరేశన్ నిర్మాత- కతిరేశన్ బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ డీవోపీ : ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి ఎడిటర్: ఆంథోనీ స్టంట్స్: శివ - విక్కీ

3 years ago

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “వినరో భాగ్యము విష్ణుకథ”

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో…

3 years ago

బనారస్ విజువల్ ట్రీట్ లా వుంటుంది

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్‌' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరో జైద్ ఖాన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 'బనారస్' ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి ? దాదాపు దేశం మొత్తం కవర్ చేశాం. ముంబై, పూణే,  ఢిల్లీ, లక్నో, బనారస్, గురజాత్, ఆంధ్రా, తెలంగాణ, కలకత్తా, తమిళనాడు.. ఇలా దేశం అంతా తిరిగాం. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్ ఈవెంట్ లో వచ్చిన రెస్పాన్ చాలా ప్రత్యేకం. ప్రేక్షకులు చూపిన అభిమానాని కి కృతజ్ఞతలు. అలాగే లక్నో లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బనారస్ కి ముందు ఎవరైనా మిమ్మల్ని కలిశారా ? నాంది సతీష్ గారు ఒక తెలుగు సినిమా చేద్దామని కలిశారు. అయితే అప్పటికి నేను ఇంకా రెడీగా లేను. ఒక కోర్స్ ట్రైనింగ్ లో వున్నాను. అలాగే హిందీ నుండి కూడా రెండు అవకాశాలు వచ్చాయి. అయితే నా ద్రుష్టి సౌత్ సినిమాపైనే వుంది. బనారస్ ని మీరే ఎంచుకున్నారా ? దర్శకుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ? బనారస్ ఛాయిస్ నాదే. నేనే దర్శకుడు జయతీర్ధని అప్రోచ్ అయ్యాను. చాలా కాలం నుండి మంచి స్క్రిప్ట్, దర్శకుడు కోసం ఎదురుచూశాను. ఫైనల్ గా బనారస్ తోజయతీర్ధ గారు వచ్చారు. అలా మా ప్రయాణం మొదలైయింది. కెజియఫ్, కాంతార సినిమాల విజయాలతో కన్నడ సినిమా పరిశ్రమపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు బనారస్ వస్తోంది. ఈ విషయంలో ఏమైనా ఒత్తిడి ఫీలౌతున్నారా ?  ఒత్తిడి కాదు కానీ భాద్యత వుంటుంది. నేను కొత్త కావచ్చు కానీ పాన్ ఇండియా అనేది చిన్న విషయం కాదు. మా నిర్మాతలకు ముందే చెప్పాను. కెజియఫ్, కాంతార తో కన్నడ సినిమా ఒక గొప్ప స్థాయిని సంపాదించుకుంది. ఈ విషయంలో నాకు చాలా ఆనందం వుంటుంది. కన్నడ నుండి మరో పాన్ ఇండియా సినిమా వస్తుందంటే ఒక స్థాయిలో వుండాలి. బనారస్ ని అన్ని భాషల పంపిణీదారులకు చూపించాం. వాళ్ళంతా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులని అలరిస్తోందని అభిప్రాయపడిన తర్వాతే పాన్ ఇండియా విడుదలని నిర్ణయించాం. బనారస్ విజువల్స్ చూస్తుంటే బాలీవుడ్ మూవీ లా  కనిపిస్తుంది ? విజువల్స్ పై నేను ప్రత్యేక ద్యాస పెట్టాను. సౌత్ సినిమాల పట్ల బాలీవుడ్ కి ఒక చిన్న చూపు వుండేది. సౌత్ సినిమాల్లో క్యాలిటీ వుందని వారు అభిప్రాయ పడేవారు. దీనిని ద్రుష్టిలో పెట్టుకొని బనారస్ ని చాలా గ్రాండ్ గా ఎక్కడా రాజీ పడకుండా బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు ఎందులోనూ తక్కువ కాదని తెలియజేశాలా బనారస్ ని చిత్రీకరించాం. ప్రస్తుతం సౌత్ పరిశ్రమ గొప్ప స్థితిలో వుంది.  బనారస్ నేపధ్యంలో సినిమా చేయడానికి కారణం ? బనారస్ కంటెంట్ లో  ఒక మిస్ట్రీరియస్, డార్క్  ఎలిమెంట్ వుంది. దానికి బనారస్ నేపధ్యం  ఎంచుకున్నాం. కంటెంట్, బ్యాగ్డ్రాప్ .. రెండూ ప్రేక్షకులని థ్రిల్ చేస్తాయి. బనారస్ మిస్టీరియస్  లవ్ స్టొరీ. 85శాతం షూటింగ్ బనారస్ లోనే చేశాం. ప్రేక్షకు లకి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. సస్పన్స్, కామెడీ, థ్రిల్ యాక్షన్ అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో ఒక ప్రయోగం కూడా చేశాం. అది ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో టైం ట్రావెల్ కూడా వుంటుంది. అయితే అది కథలో కొంత భాగమే. ఇది మీ మొదటి సినిమా కదా.. ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ? మనకి ఏదైనా కావాలంటే దాని కోసం మనమే నిలబడాలి. అలాగే జీవితం చాలా చిన్నది. అందరితో ప్రేమగా వుండి నలుగురికి సాయపడటమే జీవితం. ఈ రెండు విషయాలు బనారస్ నుండి నేర్చుకున్నాను. బనారస్ ని ఎంచుకుకోవడానికి ట్రిగ్గర్ పాయింట్ ఏమిటి ?…

3 years ago

జర్నలిస్ట్ ప్రభు రాసిన “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్‌.

24 మంది సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తూ జర్నలిస్ట్‌ ప్రభు రాసిన శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ శుక్రవారం ఎంతో ఘనంగా…

3 years ago