పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అనుష్క నాయికగా, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. గోపీకృష్ణా…
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ ల తాజా చిత్రం 'సర్దార్' బ్రిలియంట్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నిర్మాతలు తాజాగా థియేట్రికల్…
ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకం పై యస్ వి శివా రెడ్డి గారి సమర్పణ లో కడప జిల్లా వారు తీసి నిర్మించిన చిత్రం "AP04…
అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "అరి".…
! మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' విజయవంతంగా ప్రదర్శితమౌతున్న సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్.జె.ఎ.) కార్యవర్గ సభ్యులు, టీవీ ఛానెల్స్ ప్రతినిధులు…
మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'క్రేజీ ఫెలో'. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో ఆది సాయికుమార్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 'క్రేజీ ఫెలో' ఎలా వుండబోతుంది ? చాలా మంచి ఎంటర్ టైనర్ . సినిమా పట్ల అందరం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాం. దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నాడు. చాలా నీట్ గా ప్రజంట్ చేశాడు కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. అందరికీ నచ్చే కథ ఇది. కె.కె.రాధామోహన్ గారికి కూడా చాలా బాగా నచ్చి సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. క్రేజీ ఫెలో లో మంచి మ్యాజిక్ వుంది. మీ పాత్ర ఎలా వుండబోతుంది ? ఇందులో నా పాత్ర చాలా క్రేజీగా వుంటుంది. తొందరపాటు క్యారెక్టర్. చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే క్యారెక్టర్. చాలా ఎంటర్ టైనింగా వుంటుంది. నర్రా శ్రీనివాస్, అనీస్ కురువిల్లా పాత్రలతో పాటు మిగతా పాత్రలు కూడా బావుంటాయి. ప్రతి క్యారెక్టర్ లో ఫ్రెష్ నెస్ వుంటుంది. ఇందులో చాలా ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నారు కదా ? దీనికి కారణం దర్శకుడే. ఒక చేంజ్ ఓవర్ కావాలని అడిగారు. ప్రేమ కావాలి సినిమాకి రామ్ అనే హెయిర్ స్టయిలీస్ట్ చేశారు. క్రేజీ ఫెలో కోసం మళ్ళీ కలసి పని చేశాం. కొంచెం బరువు కూడా తగ్గాను. చాలా మంది లవ్లీ , ప్రేమ కావాలి లాంటి సినిమాలు చేయమని అడుగుతారు. అలాంటి వైబ్ వుండే సినిమా క్రేజీ ఫెలో. మీ పర్శనల్ గా ఏ జోనర్ ఇష్టం ? నాకు ఎంటర్ టైనర్ ఇష్టం. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలు అలా విజయం సాధించినవే . అలాగే రియలిస్టిక్ స్క్రిప్ట్ ఒకటి చేయాలనీ వుంది. లవ్లీ, ప్రేమ కావాలి తర్వాత మీకు నచ్చిన సినిమాలు ? 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' కి చాలా మంచి పేరు వచ్చింది. 'నెక్స్ట్ నువ్వే' సినిమాకి కూడా మంచి రెస్పాన్ వచ్చింది. అలాగే తీస్ మార్ ఖాన్ సినిమా చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు క్రేజీ ఫెలో కూడా ఎంజాయ్ చేస్తూ చేశా. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. మీ కెరీర్ విషయంలో నాన్నగారి జోక్యం ఎలా వుంటుంది ? కొన్ని కథలు నాన్న వింటారు. కొన్ని నేను విని తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటాను (నవ్వుతూ)ముందు చక్కగా వినమని చెబుతారు. ఆయన జడ్జ్ మెంట్ బావుటుంది. ఇకపై చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటూ చేయాలి. హీరోయిన్స్ గురించి ? ఇద్దరు హీరోయిన్స్ అద్భుతంగా చేశారు. దిగంగన సూర్యవంశి కి మంచి పేరు వస్తుంది. మంచి డ్యాన్సర్.అలాగే మిర్నా కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్ర కూడా బావుటుంది. కామెడీ చేయడంలో సవాల్ వుంటుందా ? ఈ సినిమా కామెడీ విషయంలో దర్శకుడు చాలా పర్టిక్యులర్. టైమింగ్ విషయంలో చాలా ఖచ్చితంగా వుంటారు. కామెడీ చాలా సహజంగా చేశాం. కామెడీ సీన్స్ అన్నీ హిలేరియస్ గా వుంటాయి.…
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసినటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో నిర్మాత ఎన్వి ప్రసాద్ ''గాడ్ ఫాదర్'' గ్రాండ్ సక్సెస్ ని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు. ''గాడ్ ఫాదర్'' బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. కలెక్షన్స్ ఎలా వున్నాయి ? ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వున్నాయి. సినిమాని ఎవరికీ అమ్మలేదు. మేము సొంతంగా విడుదల చేశాం. రెవెన్యూ చాలా స్ట్రాంగ్ గా వుంది. కలెక్షన్స్ లో ఇంత భారీ నెంబర్స్ ఊహించారా ? కలెక్షన్స్ మేము ఊహించిన దాని కంటే అద్భుతంగా వున్నాయి. లూసిఫర్ ని అందరూ చూశారు. ఆ సినిమాని రీమేక్ చేయడం ఒక సాహసం. అలాంటి సినిమాని మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్ తో పాటు హిందీ కలెక్షన్స్ కూడా బలంగా వున్నాయి. హిందీలో మొదటి వారం పదికోట్లు రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. తమిళనాడులో పోన్నియిన్ సెల్వన్ అద్భుతంగా ఆడుతోంది. అది వారి కల్చర్ మూవీ. వారి కల్చర్ మూవీకి గౌరవం ఇచ్చి అక్కడ గాడ్ ఫాదర్ రిలీజ్ ని ఆపుకున్నాం. అక్టోబర్ 14న గాడ్ ఫాదర్ ని తమిళనాడులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. గాడ్ ఫాదర్ విజయం పై చిరంజీవి గారిని కలిసినప్పుడు ఏమన్నారు ? సక్సెస్ మీట్ లో మేమందరం మాట్లాడాం. సమిష్టి కృషితో సినిమా చేశాం. చాలా సాహసంతో కూడిన సినిమా ఇది. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం ఇచ్చాం. మేము ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. నిర్మాణ సంస్థగా చాలా ఆనందంగా వుంది. ఒక గొప్ప విజయం ఇచ్చిన తృప్తి మాలో వుంది. గాడ్ ఫాదర్ విజయం పట్ల మేము చాలా గర్వంగా ఫీలౌతున్నాం. మా బ్యానర్ కి మైల్ స్టోన్ సినిమా. ఇదే ఉత్తేజంతో రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు తీయడానికి ఆక్సిజన్ లా పని చేసింది. యూనిట్ అంతా పడిన కష్టానికి తగిన ఫలితం ప్రేక్షకులు గొప్ప విజయం రూపంలో ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో ఎంత వరకు కలెక్షన్ రాబట్టింది ? తెలుగు రాష్ట్రాలలో 60 కోట్ల షేర్ వచ్చింది. విదేశాల్లో కూడా కలెక్షన్స్ బలంగా వున్నాయి. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 1.1 మిలియన్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ అద్భుతంగా వున్నాయి. రామ్ చరణ్ గారి స్పందన ఎలా వుంది ? చరణ్ బాబు గారి ఆలోచన వలనే ఈ సినిమా మొదలైయింది. విడుదల తర్వాత రామ్ చరణ్ గారి ఆనందం మాటల్లో చెప్పలేం. ఆయన సొంత సినిమా కంటే ఎక్కువ ఆనందపడ్డారు. చిరంజీవి గారి సినిమా అంటే పాటలు డ్యాన్సులు వుంటాయి కదా..అవి లేకుండా సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా? పాటలు, అద్భుతమైన డ్యాన్స్ లని తెలుగు సినిమాకి పరిచయం చేసింది చిరంజీవి గారు. ఎంతో మంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఒక కొత్త తరహాలో చిరంజీవి గారిని చూపించాలని ఒక చేంజ్ ఓవర్ ఫిలిం చేశాం. దీనికి ప్రేక్షకులు ఆశీర్వదించారు. ఇది పెద్ద మార్పుకు సంకేతం. దర్శకుడు మోహన్ రాజా గురించి ? మోహన్ రాజా చాలా హార్డ్ వర్క్ చేసి అద్భుతమైన మార్పులు చేశారు. తమన్ కూడా తన అద్భుతమైన మ్యూజిక్ తో సినిమాకి ఆరో ప్రాణంగా నిలిచారు. దసరా, దీపావళి మధ్య గాడ్ ఫాదర్ ఒక బ్రిడ్జ్ లా నిలిచింది కదా ? గాడ్ ఫాదర్ లాంటి విజయం ఇండస్ట్రీకి అవసరం. ఇలాంటి విజయాలు వచ్చినప్పుడే ఎగ్జిబిటర్ వ్యవస్థ వుంటుంది. ఎగ్జిబిటర్స్ అందరికి కూడా ఒక పండగలాంటి సినిమా గాడ్ ఫాదర్. టికెట్ ధరలు పెంచకపోవడం కూడా కలిసొచ్చిందని భావిస్తున్నారా ? టికెట్ ధరలు పెంచాలనే ఆలోచన మొదటి నుండి లేదు మన సినిమాలకి మన ఆడియన్స్ కి ఈ రేట్లు సరిపోతాయి. గాడ్ ఫాదర్ ఎగ్జిబిటర్లు అందరూ చాలా ఆనందంగా వున్నారు. కోవిడ్ నుండి కూడా ఇండస్ట్రీ దాదాపు బయటపడింది. ప్రేక్షకులని ద్రుష్టి పెట్టుకొని వారి అభిరుచి తగిన కథలు ఎంపిక చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్…
మంచి స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో నిర్మాత కె.కె.రాధామోహన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. క్రేజీ ఫెలో దసరా, దీపావళికి మధ్యలో విడుదలౌతుంది కదా.. ఇది ఎలాంటి సమయం అనుకుంటున్నారు ? కోవిడ్ కారణంగా ఆగిన చిత్రాలు గత మూడు నెలలుగా వరుసగా విడుదలౌతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ చాలా సినిమాలు వరుసలో వున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ 14 మంచి డేట్ అనిపించింది. నవంబర్ డిసెంబర్ లో కూడా వరుసగా సినిమాలు వున్నాయి. అయితే ప్రస్తుతం ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం పెద్ద సవాల్. క్రేజీ ఫెలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దినితో పాటు వైవిధ్యమైన ప్రమోషన్స్ చేస్తున్నాం. రెండు వెహికల్స్ తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్నాయి. ప్రతి చోట ట్రైలర్, సాంగ్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశాం. దీనితో పాటు టీవీ కమర్షియల్, పోస్టర్స్, గూగుల్ యాడ్స్ ,అన్ని రకాలుగా కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాం. క్రేజీ ఫెలో మంచి వినోదం వున్న చిత్రం. ప్రేక్షకులు థియేటర్ కి వస్తారనే నమ్మకం వుంది. కథలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి ? క్రేజీ ఫెలో కథ చాలా బావుటుంది. నేను కథనే బలంగా నమ్ముతాను. బలమైన కథ ఇది. నూతన దర్శకుడు ఫణి కృష్ణ చెప్పినట్లే చక్కగా తీశారు. ఆదికి సరిపడే కథ ఇది. ఆది లుక్ డిఫరెంట్ గా ఫ్రెష్ గా వుంటుంది. ఆది క్యారెక్టర్ చాలా క్రేజీగా కొత్తగా వుంటుంది. కథలో చాలా క్యూరియాసిటీ వుంటుంది. చాలా క్లీన్ సినిమా. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసి ఒక రెండున్నర గంటలు పాటు హాయిగా ఎంజాయ్ చేసే సినిమా క్రేజీ ఫెలో. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన మారిందా ? చాలా మారింది. ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు. వరల్డ్ సినిమా చూస్తున్నారు. ఇంటర్ నేషనల్ కంటెంట్ దొరుకుతుంది. వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం మాకు సవాల్. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్ కి వెళ్ళాలా ? ఓటీటీలో చూడాలా ? అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు ప్రేక్షకులని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక నిర్మాతలకు ఒక సవాల్. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ సినిమా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి కదా ? మొదట్లో శాటిలైట్,, ఇప్పుడు ఓటీటీ.. ఇలా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. అయితే ఇందులో నిర్మాతకు మిగిలేది ఏమీ లేదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక రోజు షూటింగ్ కి 3 లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు 8 లక్షలు అవుతుంది. మార్కెట్ ని అర్ధం చేసుకుంటూ కథకు తగిన వనరులు సమకూర్చుకుని నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన భాద్యత నిర్మాతపైనే వుంటుంది. యూఎస్ నుండి షిఫ్ట్ అయిపోయాను. పూర్తి సమయం సినిమాలకి కేటాయించాను. గత మూడేళ్ళుగా ఓరేయ్ బుజ్జిగా, ఓదేల రైల్వే స్టేషన్.. ఇప్పుడు క్రేజీ ఫెలో చేశాం. స్పీడు పెంచుతూనే రిస్క్ ని బ్యాలన్స్ చేస్తేనే ఇండస్ట్రీలో వుండగలం. ఇప్పుడు ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్ద్, కార్పోరేట్ స్టయిల్ లో వుంది. నేను కూడా ఇలానే సినిమాలు చేయడానికే ఇష్టపడతాను. మీ నిర్మాణంలో మీకు తృప్తిని ఇచ్చిన చిత్రాలు ? కథ పరంగా అధినేత నాకు చాలా తృప్తిని ఇచ్చిన చిత్రం. ఏమైయింది ఈవేళ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మారుతి లాంటి దర్శకులు ఆ సినిమాతోనే స్ఫూర్తి పొంది సినిమాలు చేశామని చెబుతుంటారు. పంతం సినిమాలో ఇచ్చిన సందేశం కూడా నచ్చుతుంది. కమర్షియల్ గా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం రవితేజ బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ నిర్మాత అనే గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో ఇద్దరి కథానాయికలు గురించి ? దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ ఇద్దరూ చాలా చక్కగా చేశారు. మిర్నా మీనన్ కి ఇది తొలి తెలుగు సినిమా. ఆమె పాత్రలో మంచి సర్ ప్రైజ్ వుంటుంది. సంగీతం గురించి ? ఆర్ఆర్ ద్రువన్ అప్ కమిగింగ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఐదు పాటలు డిఫరెంట్ వేరియేషన్స్ లో చేశాడు. ఆర్ఆర్ ని కూడా చాలా బ్రిలియంట్ గా చేశాడు. మ్యూజిక్ విషయంలో తృప్తిగా వుంది. కొత్తగా చేయబోతున్న చిత్రాలు ? ప్రస్తుతం ఆయుష్ శర్మ తో ఒక హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాం. త్వరలోనే వివరాలు తెలియజేస్తాం. ఆల్ ది బెస్ట్…
భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి రూపొందిన న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని…
స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం 'అజయంతే రందం మోషణం'. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జితిన్…