మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వాల్తేర్ వీరయ్య' సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ కొల్లి (కెఎస్…
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా బేబీ. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్కేఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా…
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా "ధమాకా" నుండి డు డు సాంగ్ ని నవంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రవితేజ్ లుక్ టెర్రిఫిక్ గా వుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.
యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్ మూవీ "లెహరాయి" ట్రైలర్ విడుదల,డిసెంబర్ 9న విడుదలకానున్న చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న…
'హను- మాన్' పాన్ వరల్డ్ కంటెంట్ వున్న చిత్రం.. విజువల్ వండర్ గా వుంటుంది : తెలుగులో తొలి జాంబీ చిత్రం జాంబీ రెడ్డి ని రూపొందించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాలను రూపొందించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని సృష్టించాడు. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హను-మాన్ మల్టీవర్స్ నుండి వస్తున్న తొలి చిత్రం. ప్రశాంత్ వర్మ ఇదివరకే తేజ సజ్జ పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది సినీ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచింది. తర్వాత పోస్టర్ల ద్వారా ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఈ రోజు ఊహాతీతమైన కంటెంట్ తో వచ్చారు. ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైయింది. జలపాతంకు ఆనుకొని చేతిలో గదతో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది. నేపథ్యంలో శ్రీరామ నామం వినిపించింది. కొన్ని జీవురాశులు కొండపై ఒక కాంతిపుంజం చుట్టూ ప్రదక్షణం చేయడం 'సుప్రీమ్ బీయింగ్' రాకను సూచిస్తుంది. సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో వున్నట్లుగా తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చాడు. అమృత అయ్యర్ భయపడుతూ చూడటం సూర్యగ్రహణం చెడు యొక్క ఆగమనాన్ని సూచిస్తుంది. వినయ్ రాయ్ 'మ్యాన్ ఆఫ్ డూమ్' గా భయపెట్టాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ కొబ్బరిగెలతో విలన్స్ ని కొట్టే పెళ్లికూతురుగా ఎంట్రీ ఇచ్చింది. హనుమంతు అండర్ డాగ్ నుంచి సూపర్‌హీరోగా మారడం విజువల్ వండర్ గా వుంది. గద పట్టుకుని, కొండపై నిలబడి, హెలికాప్టర్ సమీపిస్తుండగా ఆకాశంలో ఎగురుతూ తన అతీత శక్తులను చూపిస్తూ.. హనుమంతుడు ఆవహించినట్లు కనిపిస్తోంది. హనుమ తపస్సు చేస్తూ, రామ నామం జపిస్తున్న చివరి విజువల్స్ మనసులో నాటుకునేలా వున్నాయి. ప్రశాంత్ వర్మ,అతని టీం మాస్టర్ వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. 121 సెకన్ల టీజర్ విజువల్ వండర్ గా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది. శివేంద్ర తన అద్భుతమైన కెమెరా వర్క్‌తో స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేశాడు. సంగీత దర్శకుడు గౌరహరి తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో మంత్రముగ్ధుల్ని చేశాడు. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగళ ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. వీఎఫ్ ఎక్స్ వర్క్ అత్యన్నత క్వాలిటీతో సన్నివేశాలను కొత్త స్థాయికి ఎలివేట్ చేసింది. తేజ సజ్జ సూపర్ హీరోగా చాలా కన్విన్సింగ్ గా ఉన్నాడు. అతని గెటప్ , బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ప్రతిదీ అద్భుతంగా వుంది. అమృత అయ్యర్ ఏంజెల్ లా కనిపిస్తుంది. మిగతా వారు కూడా పాత్రలను సమర్ధవంతంగా పోషించారు. టీజర్ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఎప్పుడెప్పుడు సినిమాని బిగ్ స్క్రీన్‌లపై చూడాలనే ఆసక్తి నెలకొంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. హనుమాన్.. గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగిన వారు, బుద్ధిలో శ్రేష్టులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రియాలని జయించినవారు, సాక్ష్యాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకంటే సూపర్ హీరో మనదగ్గర ఎవరున్నారు. సూపర్ హీరో అనగానే స్పైడర్ మాన్ సూపర్ మాన్ అని భావిస్తుంటారు. సినిమాలో చూసింది వాళ్ళనే. కానీ వాళ్ళు స్ఫూర్తిపొందింది మన కల్చర్ నుండి, మన హనుమంతులవారి నుండి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ మాత్రమే. హనుమంతులవారు మన చరిత్ర. మన కల్చర్. ఇది మన సత్యం. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేది మా హను -మాన్. ఇంతగొప్ప సినిమాలో పాత్రకు న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మగారి కి థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది. ఆయన తో ఇదివరకే ఒక సినిమా చేశాను. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ గారు గ్రేట్ క్రాఫ్ట్ మాన్. ఆయనతో ప్రతి క్షణం లెర్నింగ్ ప్రాసస్ వుంటుంది. సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. హనుమంతులవారి గురించి చెప్పినపుడు వినయం, నిజాయితీ, గొప్ప అనే మాటలు చెబుతాం. మా సినిమా కూడా అంతే వినయంగా నిజాయితీతో సినిమా చేశాం. కానీ సినిమా చాలా గొప్పగా వుండబోతుంది. ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి సినిమా అంటే చాలా ప్యాషన్. అంత ప్యాషన్ వున్న నిర్మాతకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ అందరం చాలా కష్టపడి చేశాం. నాలుగు సినిమాల కష్టం ఈ సినిమా కోసం పడ్డాను. ఈ సినిమా రావడం కూడా దైవ సంకల్పం అని నమ్ముతున్ననాను. త్వరలోనే మీ అందరినీ థియేటర్ లో కలుస్తాం. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడు. ఆయన పేరు మీద ఇంత పెద్ద సినిమా చేయడం ఆనందంగా వుంది. ఇంత పెద్ద సినిమా చేయడానికి ముందుకు వచ్చిన మా నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు పెద్దదయ్యింది. ఆయన ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా చేయమని సపోర్ట్ చేశారు. హను మాన్ కేవలం పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా. ఎందుకంటే హనుమంతుడు సూపర్ హీరో. బ్యాట్ మాన్ సూపర్ మాన్ కంటే పవర్ ఫుల్ ఎవరంటే హను మాన్ పేరు చెబుతాం. నాకు చిన్నప్పటి నుండి పౌరాణికాలు చాలా ఇష్టం. నా ప్రతి సినిమాలో ఎదో ఒక రిఫరెన్స్ వుంటుంది. మొదటి సారి పూర్తి స్థాయి పౌరాణిక పాత్ర అయిన హను మాన్ మీద సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని చాలా పాత్రలతో ఒక యూనివర్ష్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటికే అధీర అనే ఒక సినిమా ప్రకటించాం. ఇవన్నీ మన పురాణాల నుండి స్ఫూర్తి పొందిన పాత్రల ద్వారా రూపొందే చిత్రాలు. హను మాన్ టీజర్ కంటే ట్రైలర్ బావుంటుంది. ట్రైలర్ కంటే సినిమా ఇంకా బావుంటుంది. తేజ సజ్జాతో కలసి జాంబీ రెడ్డి చేశాం. హను మాన్ కి తేజనే ఎందుకు తీసుకున్నామని చాలా మంది అడిగారు. ఈ పాత్ర కోసం ఒక అండర్ డాగ్ కావాలి. చిన్నప్పటి నుండి తేజ చేసిన పాత్రలు కారణంగా అందరికీ తేజ అంటే పాజిటివ్ ఫీలింగ్ వుంటుంది. అతను చేస్తే బావుంటుందని అందరూ కోరుకుంటారు. తేజకి ఆ ఛార్మ్ వుంది. బడ్జెట్, మార్కెట్ ఏమీ అలోచించకుండా ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో పని చేసిన అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి.. అందరికీ థాంక్స్. ఇందులో గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ విలక్షణమైన గెటప్స్ లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త వరల్డ్ క్రియేట్ చేశాం. ఇక్కడి జరిగే కథ. విజువల్ వండర్ గా వుంటుంది. మన సినిమా ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2 పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళుతున్నాయి. హను మాన్ కూడా అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమాగా చేశామని నమ్ముతున్నాం. తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా రూపొందించాం. హను మాన్ పాన్ వరల్డ్ ఫిల్మ్. నిజంగా చాలా గొప్ప సినిమా చేశాం'' అన్నారు అమృత అయ్యర్ మాట్లాడుతూ.. హను మాన్ టీజర్ అద్భుతమనిపించింది. అనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తేజ సజ్జా మీ అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. త్వరలోనే సినిమా థియేటర్లోకి వస్తుంది'' అన్నారు. ఈ వేడుకలో శ్రీనాగేంద్ర తంగాల, శివేంద్ర, గౌరా హరి, గెటప్ శ్రీను తదితరాలు పాల్గొన్నారు ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు
వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఆనంది కథానాయిక. ఈ నెల 25న సినిమా థియేటర్లలో విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గానిర్వహించారు. హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తిరుమల కిషోర్, విఐ ఆనంద్, విజయ్ కనకమేడల, వశిష్ట, రామ్ అబ్బరాజు, నిర్మాతలు సతీష్ వర్మ, అభిషేక్ అగర్వాల్ అతిధులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ గారికి చిత్ర యూనిట్ నివాళులు అర్పించింది. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అతిథులు అందరికీ కృతజ్ఞతలు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మా కడలి గారు అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు. ప్రతి ఫ్రేము రిచ్ గా వుంటుంది. డీవోపీ రాం రెడ్డిగారు సినిమాని అద్భుతంగా చూపించారు. ఇందులో నేను చాలా అందంగా వున్నాని చెబుతున్నారు. నన్ను అంత అందంగా చూపించిన డీవోపీ రాం రెడ్డి గారి కిథాంక్స్. ఎడిటర్ చోటా ప్రసాద్ గారు ఆల్ రౌండర్ గా పని చేశారు. శ్రీచరణ్ చాలా హార్డ్ వర్కింగ్ కంపోజర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక డ్యాన్స్ నెంబర్ కూడా వుంది. మాటల రచయిత అబ్బూరి రవి నాంది సినిమా నుండి పరిచయం. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఇందులో ఒక పాట కూడా పాడారు. ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్ డే. ఆయనకి గిఫ్ట్ 25న ఇస్తాం. ఈ సినిమాతో పరిచయం అవుతున్న నిర్మాత రాజేష్ దండా, దర్శకుడు మోహన్ .. ఇద్దరికీ కంగ్రాట్స్. రాజేష్ కి మినీ దిల్ రాజు అని పేరు పెట్టాం. మొదటి సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. దిల్ రాజు గారిలానే పెద్ద నిర్మాత కావాలి. మోహన్ గారు చాలా ప్రతిభ వున్న దర్శకుడు. కథ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశాం. అందరం ఒక టీం వర్క్ గా ఈ సినిమా చేశాం. అనంది గారు ఈ సినిమా చేస్తున్నపుడు బేబీకి బర్త్ ఇచ్చి మూడో నెల. ఆమె చాలా కష్టపడతూ ఏ రోజు కష్టాన్ని బయటికి చెప్పాకుండా చేశారు. ఆనంది అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం చాలా అనందంగా వుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్ .. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది సీరియస్ సినిమా అని చాలా మంది అనుకుంటారు. కాదు. ఇందులో 40 శాతం కామెడీ వుంటుంది. 60 శాతం ఎమోషన్ వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. నా కెరీర్ నాంది లాంటి విభిన్నమైన సినిమా ఇచ్చిన నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు విజయ్ కి థాంక్స్. మాకు ఎల్లవేళలా తోడుండే వంశీ- శేఖర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. వారి సపోర్ట్ మర్చిపోలేనిది. మాకు, మా టీంకి వారి సపోర్ట్ ఎప్పుడూ ఇలానే వుండాలి. ఇందులో నేను టీచర్ గా కనిపిస్తా. ఈ సందర్భంగా నేను స్టూడెంట్ గా వున్నపుడు కొన్ని యాక్టింగ్ క్లాసులు చెప్పిన సుమ గారికి కూడా కృతజ్ఞతలు. జీ స్టూడియోస్ తో కలిసి పని చేయడం అనందంగా వుంది. అన్ని బాషలలో ఆకట్టుకునే సత్తా వున్న సినిమా ఇది. ఇక్కడ విజయం సాధించిన తర్వాత మోహన్ దర్శకత్వంలోనే హిందీలో కూడా ఈ సినిమా చేయాలి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మీరంతా థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి' అని కోరారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ... అల్లరి నరేష్ గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. అల్లరి నుండి ఫాలో అవుతున్నా. ఆయన ఫన్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తా. గమ్యం, శంభో శివ శంభో లో ఆయన డిఫరెంట్ గా చేస్తే ఇంకా నచ్చేది. నరేష్ మొదటి నుండి అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' పెద్ద సక్సెస్ అవ్వాలి. మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' గురించి నిర్మాత రాజేష్ గారు చెప్పారు. చాలా కంటెంట్ వున్న సినిమా అనిపించింది. రాజేష్ గారికి, ప్రసాద్ గారికి కథలు ఎంచుకోవడంలో మంచి టేస్ట్ వుంది. మారేడుమిల్లి అంటే నాకు చాలా ఇష్టం.'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' పేరు పెట్టి అక్కడే సినిమా తీసిన దర్శకుడు మోహన్ గారికి కృతజ్ఞతలు. ఆనంది గారు చాలా సహజంగా నటిస్తారు. . 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మంచి పాజిటివ్ టీం. 25 తేదిన అందరూ థియేటర్ కి వచ్చి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాని దీవిస్తారని కోరుకుంటున్నాను. ఆనంది మాట్లాడుతూ.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నా లైఫ్ లో చాలా స్పెషల్ మూవీ. మూడు నెలల బేబీతో ఈ సినిమా చేశా. టీం ఇచ్చిన సపోర్ట్ ని ఎప్పుడూ మర్చిపోలేను. నాపై ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నాంది తర్వాత నరేష్ గారి తో పని చేయడం చాలా ఆనందంగా వుంది. నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించిన రాజేష్ గారికి స్పెషల్ థాంక్స్. టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు'' తెలిపారు. చిత్ర దర్శకుడు ఏఆర్ మోహన్ మాట్లాడుతూ.. ఇది నా 17 ఏళ్ల కల. ఈ కలని నిజం చేసిన అల్లరి నరేష్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. నా లైఫ్ లాంగ్ నరేష్ గారికి థాంక్స్ చెబుతూనే వుంటాను. ప్రజల జీవితాన్ని తెరపై చెప్పాలనే కోరికే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కథ. నిర్మాతలు రాజేష్ గారికి కృతజ్ఞతలు. వెన్నెల కిషోర్, ప్రవీణ్, రఘు బాబు.. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ కృతజ్ఞతలు. ఆనంది గారు చాలా అద్భుతంగా చేశారు. ఆర్ట్ డైరెక్టర్ కడలి, శ్రీ చరణ్, ఎడిటర్ ప్రసాద్, పృథ్వీ మాస్టర్, శేఖర్ మాస్టర్, డీవోపీ రాంరెడ్డి, మాటల రచయిత అబ్బూరి రవి గారికి కృతజ్ఞతలు'' తెలిపారు. చిత్ర నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఈ నెల 25న సినిమా థియేటర్లలో విడుదలౌతుంది. అందరూ థియేటర్లో చూసి నా మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి అంకితంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నాం'' అన్నారు. నాంది సతీష్ వర్మ మాట్లాడుతూ.. నాంది సినిమా వలనే నన్ను ఇక్కడికి పిలిచారు. దీనికి కారణం నరేష్ గారు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మంచి సినిమాని నమ్ముతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు. అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. నిర్మాత రాజా నా బ్రదర్ లాంటి వారు. చాలా సినిమాలని పంపిణీ చేసారు. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. నరేష్ గారితో పాటు ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు. శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. …
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్షణ చిత్రం ‘దహిణి - మంత్రగత్తె’. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వేదికలపై ఈ సినిమా…
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో…
గోవాలో జరిగే 53వ IFFI - 2022 లో “శంకరాభరణం” చిత్రం , Restored Indian Classics విభాగంలో ఎంపికయ్యంది . National Film Archives of…
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. సినిమా…