కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ల భారీ యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్ కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. ఇప్పుడు ది ఘోస్ట్ ఆడియో ప్రమోషన్ లకు సమయం ఆసన్నమైంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్ భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటను స్కోర్ చేశారు. కపిల్ కపిలన్, రమ్య బెహరా పాడిన ఈ పాటకు కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు. సాంగ్ రిలీజ్ పోస్టర్ లో నాగార్జున, సోనాల్ చౌహాన్ క్రూయిజ్‌లో కలిసి సమయాన్ని ఆస్వాదించడాన్ని చూడవచ్చు. నాగార్జున, సోనాల్ ని ప్రేమగా దగ్గరగా తీసుకొని చెంపపై ప్రేమగా ముద్దు పెడుతుండగా, ఆమె అతని కౌగిలింత ముద్దులోని వెచ్చదనాన్ని అనుభవిస్తున్నట్లు పోస్టర్ లవ్లీగా వుంది. సోనాల్ గ్లామరస్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది. తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు సాంకేతిక విభాగం దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్ బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి. సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ - సౌరబ్) యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్ ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి…
ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘’నేను c/o నువ్వు’’.ఈ చిత్రానికి…
చందన మూవీస్ బ్యానర్లో సీడీ నాగేంద్ర నిర్మాతగా, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "బాక్సు బద్దలౌద్ది". వివేకానంద విక్రాంత్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ,…
వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.…
వెర్సటైల్ హీరో నాగశౌర్య డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి' రెండు వారాల్లోపు థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.…
ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్…
సినిమా అనేది శక్తివంతమైన కళారూపం. సమాజంలోని సత్యాన్ని మరియు కఠినమైన వాస్తవాలను ప్రేక్షకులకు తెలియచేయడానికి ఇప్పటివరకు ఎంతో మంది చిత్ర నిర్మాతలు చేసిన ప్రయత్నాలకు ప్రేక్షకులనుండి గుర్తించబడడమే…
శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా మిథున ఎంటర్‌టైన్‌మెట్స్ ప్రై.లి, సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’.…
తాహిర్, పల్లవి హీరోహీరోయిన్లుగా బత్తిని ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత బి. నరేష్ కుమార్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘నెక్స్ట్ లెవల్’. ఈ చిత్రంతో గోపీ దేవెళ్ళ దర్శకుడిగా…
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని స్థానిక చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన లకావత్ రామారావు (late) కుమార్తె లావణ్య UPSC, IAS పోటీ పరీక్షలకు తర్ఫీదు తీసుకుంటుంది,…