న్యూస్

నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ విడుదల

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ, ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్స్ “లైక్ షేర్ & సబ్‌ స్క్రైబ్” నుండి జాక్ డేనియల్స్ గా నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ విడుదల వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ కొన్ని సూపర్‌హిట్‌ లను సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్‌ తో 'లైక్ షేర్ & సబ్‌ స్క్రైబ్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంతోష్  కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్' ఏక్ మినీ కథ' కు మేర్లపాక గాంధీ కథ,  స్క్రీన్ ప్లే అందించినందున వారి క్రేజీ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. యూనిక్ కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న లవ్ అండ్ ఎంటర్‌ టైనర్‌ లో సంతోష్ శోభన్ జోడిగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ 'శ్యామ్ సింగరాయ్‌' ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటివలే విదుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హీరో, హీరోయిన్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ  చిత్రం నుండి నెల్లూరు సుదర్శన్  ఫస్ట్ లుక్ విడుదలైయింది. బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ జాక్ డేనియల్స్ గా సుదర్శన్ ఫస్ట్ లుక్ హిలేరియస్ గా వుంది. సినిమా నుండి రివిల్ చేస్తున్న మెటీరియల్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచుతున్నాయి.  ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ నిర్మాత: వెంకట్ బోయనపల్లి బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంగీతం: ప్రవీణ్ లక్కరాజు డీవోపీ: వసంత్ ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్) పీఆర్వో: వంశీ-శేఖర్

3 years ago

విజ‌య‌నిర్మల మ‌న‌వ‌డు శరణ్ `మిస్టర్ కింగ్` గ్రాండ్ గా టీజర్ లాంచ్

విజ‌య నిర్మల గారి మ‌న‌వుడు శరణ్ కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం…

3 years ago

‘ఒకే ఒక జీవితం’ సక్సెస్ మీట్

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. శర్వానంద్, అమల అక్కినేని, నిర్మాత ఎస్ఆర్ ప్రభు, వెన్నెల కిషోర్, శ్రీకార్తిక్, సుజీత్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్ మొత్తం లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. దీని కోసమే కదా సినిమాల్లోకి వచ్చామనిపించింది. ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుందనే అటుంచితే థియేటర్ లో చప్పట్లు వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమని ఇచ్చారు. సినిమా చూసిన అందరూ హత్తుకుంటున్నారు. ఇంతకంటే ప్రేమ ఏం కావాలి. నా చుట్టూ పక్కల వున్న వాళ్ళంతా నేను సక్సెస్ కొట్టాలని కోరుకున్నారు. ఇదే నా మొదటి సక్సెస్. వంశీ శేఖర్ చాలా ఆప్యాయంగా హత్తుకున్నారు. నన్ను నడిపిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన అందరూ చాలా డిఫరెంట్ గా అనిపించాం. దీనికి కారణం మా దర్శకుడు శ్రీకార్తిక్. ఇంత గొప్ప కథని రాసిన శ్రీకార్తిక్ కు కృతజ్ఞతలు. అతని మొదటి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా వుంది. అమల గారితో పని చేయడం గౌరవంగా వుంది. అమల గారు కనిపించగానే థియేటర్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమల గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సుజీత్ సినిమాని అద్భుతంగా చూపించారు. నిర్మాత ప్రభుగారు ధైర్యం గల నిర్మాత. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం వుండాలి. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. వర్డ్ అఫ్ మౌత్ తో సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రేక్షకులు. ప్రతి షోకి ప్రేక్షకులు డబల్ అవుతున్నారు. ఈ రోజు షోలు మొత్తం ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు, మీడియా మిత్రులు సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సక్సెస్ వారిదే. ప్రేక్షకులకు అందరికీ కృతజ్ఞతలు. ఒకే ఒక జీవితం. ఎంజాయ్ యువర్ లైఫ్'' అన్నారు అమల అక్కినేని మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం ప్రేక్షకులకు నచ్చింది. అందరూ సినిమాని ప్రశంసిస్తున్నారు. శర్వానంద్ పరిపూర్ణ నటుడు. శర్వాతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. రీతూ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి అందరూ చక్కగా చేశారు. శ్రీకార్తిక్ సినిమాకి అద్భుతంగా దర్సకత్వం వహించారు. నిర్మాత ప్రభు గారు చాలా సాహసం గల నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. సుజిత్ శ్రీజిత్ జేక్స్ బిజోయ్ ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. యువత ధైర్యంగా జీవితాన్ని ఎదురుకొని విజయం సాధించే మార్గం చూపే సినిమా ఇది. ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ సినిమాని ఎంతో గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు''అని తెలిపారు. నిర్మాత ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ.. సినిమాకి అన్ని ప్రాంతాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పని చేసిన మా టీంకి కృతజ్ఞతలు. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మరోసారి మా టీం తరపున కృతజ్ఞతలు' అని తెలిపారు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ..నేను చాలా స్ట్రాంగ్ అని ఫీలౌతా. కానీ ఇందులో అమల గారి ఎంట్రీ తర్వాత కన్నీళ్లు ఆగలేదు. ఈ సినిమాలో మంచి పాత్రని ఇచ్చిన దర్శకుడు కార్తిక్ కి కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాని ఇప్పించిన శర్వానంద్ కి థాంక్స్. ప్రియదర్శి కూడా చాలా సపోర్ట్ చేశారు. అమల గారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు శ్రీకార్తిక్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం గొప్ప విజయంగా భావిస్తున్నా. సినిమాని చూసిన ప్రేక్షకులు చాలా తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ గారి నటనని ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. శర్వానంద్- అమల గారు తల్లీ కొడుకులు గా ప్రేక్షకుల మనసుని హత్తుకున్నారు. వెన్నెల కిషోర్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. చిరకాలం గుర్తిండిపోయే సినిమా ఇది. మీ ఫ్యామిలీ తో కలసి సినిమాని థియేటర్ లో చూసి ఆనందించండి'' అని కోరారు. సుజీత్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా వుంది. శర్వానంద్, అమల గారి తో పని చేయడం సంతోషంగా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని తీశారు. పచాలా నిజాయితీగా తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు అంతే గొప్పగా ఆదరించడం ఆనందాన్ని ఇస్తుంది'' అన్నారు

3 years ago

ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో

ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద గోపాల్ దర్శకత్వంలో, పులి, ఇంకొకడు, సామి 2, పలు హిందీ చిత్రాలు నిర్మించిన పాపులర్ ప్రొడ్యూసర్ 130 కి పైగా చిత్రాలు…

3 years ago

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌శంస‌లందుకున్న పంచ‌తంత్ర క‌థ‌లు

మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మించిన చిత్రం పంచ‌తంత్ర క‌థ‌లు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, నిహాల్ కోద‌ర్తి,…

3 years ago

TFJA సోషల్ మీడియాను ప్రారంభించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

జనసేనాని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విడుదలైన తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్ సైట్ & సోషల్ మీడియా అకౌంట్స్.. https://www.youtube.com/watch?v=lStMFU9xnvw తెలుగు ఫిలిం…

3 years ago

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైన కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్రైలర్

*కమర్షియల్ హంగులతో "నేను మీకు బాగా కావాల్సినవాడిని" ట్రైలర్* యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం,సమ్మతమే…

3 years ago

‘యశోద’ టీజర్‌కు జాతీయ స్థాయిలో టెర్రిఫిక్ రెస్పాన్స్…

1800కు పైగా థియేటర్లలో టీజర్ విడుదల టైమ్‌కు తినాలన్నారు...ఆమె తినే పరిస్థితిలో లేదు.బాగా నిద్రపోవాలన్నారు...కానీ, ఆమెకు నిద్ర కరువైంది.జాగ్రత్తగా నడవాలని చెప్పారు...ప్రాణాల కోసం ఆమె పరుగు తీసింది.దెబ్బలు తగలకుండా చూసుకోమన్నారు...ఆమెకు దెబ్బ మీద…

3 years ago

AMB Mall లో సందడి చేసిన శ్రుతి హాసన్

ధనుష్, శ్రుతిహాసన్ జంటగా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన "3" సినిమా పదేళ్ళ క్రితం తెలుగు, తమిళ భాషలలో విడుదలై, అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి…

3 years ago

వర్సటైల్ స్టార్ సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్‌లో యూవి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న చిత్రం నుంచి మోష‌న్ పోస్టర్ విడుద‌ల‌

విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వర్సటైల్ స్టార్ సూర్య.. మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా…

3 years ago