ఇంటర్వ్యూలు

హీరోయిన్ సోనాల్ మోంటెరో ఇంటర్వ్యూ

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్‌' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్  సోనాల్ మోంటెరో విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 'బనారస్'  విడుదలకు ఇంకా నాలుగు రోజులే వుంది,, ఎలా అనిపిస్తుంది ? ఎక్సయిట్ మెంట్, నేర్వస్నెస్.. రెండూ వున్నాయి. ఇది నా మొదటి పాన్ ఇండియా మూవీ. అన్ని పరిశ్రమలకు ఈ సినిమాతో పరిచయం కావడం ఎక్సయిటింగ్ గా అదే సమయంలో నెర్వస్ గా కూడా వుంది. ప్రేక్షకులు తప్పకుండా బనారస్ చిత్రాన్ని ఇష్టపడతారనే నమ్మకం వుంది. పాన్ ఇండియాకి మీరు కొత్త .. ప్రమోషన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ? కన్నడ ఎనిమిది సినిమాలు చేశాను. మిగతా చోట్ల నేను కొత్తే. హిందీ, తెలుగు పరిశ్రమల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు నచ్చాయి. ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ మా నమ్మకాన్ని పెంచింది.  ట్రైలర్ లో టైం ట్రావెల్, ప్రేమ కథ కనిపించాయి.. ఇంతకీ బనారస్ జోనర్ ఏమిటి ? టైం ట్రావెల్ కథలో చిన్న భాగం మాత్రమే. లవ్ స్టొరీ, థ్రిల్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని వైవిధ్యమైన ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా వుంటుంది. బనారస్ ని అద్భుతంగా చూపించాం. కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. అసాదారణమైన స్క్రిప్ట్ ఇది.  ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. బనారస్ లో మీ పాత్ర ప్రాధన్యత ఎలా వుంటుంది ? జయతీర్ధ గారి సినిమాల్లో హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధన్యత వుంటుంది. ఇందులో కూడా నా పాత్ర చాలా కీలకమైనది. ఇందులో ధని అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. హీరోకి ఎంత ప్రాధన్యత వుంటుందో  హీరోయిన్ కూడా అంతే ప్రాధాన్యత వున్న కథ ఇది. కాంతార లాంటి విజయం తర్వాత కన్నడ నుండి వస్తున్న చిత్రం బనారస్.. ఎలా అనిపిస్తుంది ? కాంతార విషయంలో నేను చాలా ఆనందంగా, గర్వంగా వున్నాను. మా ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కథని చెప్పారు. అయితే బనారస్ పూర్తిగా భిన్నమైన సినిమా. రెండు జోనర్స్ వేరు. కాంతారని ఇష్టపడినట్లే బనారస్ ని కూడా ప్రేమిస్తారనే నమ్మకం వుంది. మీకు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి కదా.. చేయకపోవడానికి కారణం ? నా ద్రుష్టి సౌత్ పై వుంది. తులులో నా కెరీర్ ప్రారంభించాను. కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నేనేవరో ఇక్కడవారికి తెలుసు. నాకంటూ ఒక పేరు వచ్చింది. వేరే పరిశ్రమలోకి డైరెక్ట్ గా  జంప్ చేసేయడం ఇష్టం వుండదు. అందులోనూ సౌత్ సినిమాలు బాలీవుడ్ కంటే అద్భుతంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా బాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది. తెలుగులో రాబర్ట్ సినిమాలో ఒక క్యామియో చేశా. తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తి వుంది. తెలుగు సినిమాలు చూస్తారా ? తెలుగు పరిశ్రమలో నచ్చిన అంశం ఏమిటి ? తెలుగు భాష అర్ధమౌతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోనే నా సినిమాలు షూటింగ్ జరుపుకుంటాయి. చక్కని నటన కనబరిస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. సీతారామం, ఆర్ఆర్ఆర్ , పుష్ప సినిమాలు తెలుగులోనే చూశా. విజయ దేవరకొండ అంటే ఇష్టం. జైద్ ఖాన్ తో పని చేయడం ఎలా అనిపించింది ? జైద్ పొలిటికల్ నేపధ్యం నుండి వచ్చారు. ఆయన ఎలా వుంటారోఅనిపించేది. అయితే జైద్ నా ఆలోచనలు తప్పని నిరూపించారు. జైద్ వండర్ ఫుల్ పర్శన్. మంచి ఫెర్ ఫార్మర్. చాలా సపోర్ట్ చేస్తారు. ట్రైలర్ చూస్తే చాలా అనుభవం వున్న నటుడిలానే కనిపిస్తారు తప్పితే కొత్త నటుడనే భావన రాదు. కొత్తగా చేయబోతున్నా సినిమాలు ? మూడు కన్నడ సినిమాలు చేస్తున్నా. అలాగే సరోజినీ నాయుడు బయోపిక్ చేస్తున్నా. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.

2 years ago

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ

దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి  నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్‌ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథలో మిమ్మల్ని  ఆకర్షించిన అంశాలు ఏమిటి ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ చాలా మంచి కథ. బిగినింగ్ నుండి ఎడింగ్ వరకూ చాలా లేయర్స్ వున్న స్క్రిప్ట్. నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ ట్రావెలింగ్ నేపధ్యంలో వుంటుంది. అలాగే ఇందులో నా పాత్రలో చాలా మలుపులు, ఎత్తుపల్లాలు వుంటాయి. ఇందులో  ప్రతి పాత్రకు ఒక నేపధ్యం ఉంటూ కథలో భాగం అవుతుంది.  లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ? ఇందులో ట్రావెల్ వ్లాగర్ గా కనిపిస్తా. వీడియోస్ కోసం దేశమంతా తిరిగే పాత్ర ఇది. ఈ ప్రయాణంలో హీరోని కలుస్తా. తను కూడా ఒక ట్రావెల్ వ్లాగర్. కథ చాలా ఎంటర్ టైనింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రయాణంలో మర్చిపోలేని జ్ఞాపకాలు వున్నాయి. జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వలనే జరిగింది.  థాయిలాండ్ లో ఒక పాట షూట్ చేయడం కోసం వెళ్లాను. మర్చిపోలేని జ్ఞాపకం ఇది. జాతిరత్నాలు, లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్.. ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ ని ప్రభాస్ గారు విడుదల చేయడం ఎలా అనిపించింది ? లక్కీ ఛార్మ్ గా ఫీలౌతున్నా.  జాతిరత్నాలు తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపించా. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ హీరోయిన్ గా నా రెండో సినిమా. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. జాతిరత్నాలు లానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. హీరో సంతోష్ శోభన్ గురించి ? సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా ప్యాషనేట్ గా పని చేస్తారు. సంతోష్ శోభన్ తో నటించడం ఆనందంగా వుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ గారితో పని చేయడం ఎలా అనిపించింది ? మేర్లపాక గాంధీ గారితో పని చేయడం డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా క్లారిటీతో డైరెక్ట్ చేస్తారు. ఆయన ఫన్ కూడా చాలా నేచురల్ గా వుంటుంది. ఆయన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోయా. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విషయంలో మీకు సవాల్ గా అనిపించిన అంశాలు ఏమిటి ? చాలా అడ్వంచర్ మూవీ ఇది. అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్. 40 శాతం సినిమా అడవిలో జరుగుతుంది. ఇరవై రోజులు అడవిలోనే వున్నాం. సిగ్నల్ కూడా వుండదు. ట్రైలర్ లో ఒక ఊబి కనిపిస్తుంది. దాన్ని క్రియేట్ చేశాం. అలాగే యాక్షన్, చేజింగ్ సీన్లు వున్నాయి. మొత్తం ఖత్రోన్ కే ఖిలాడీ లాంటి అనుభవం ఇచ్చింది (నవ్వుతూ). మీ మొదటి సినిమా జాతిరత్నాలు లో 'చిట్టి' పాత్రకు మంచి పేరొచ్చింది కదా.. ఆ పేరుతోనే పిలుస్తున్నారు.. ఈ విషయంలో  భాద్యత పెరిగిందని అనిపిస్తుందా ? 'చిట్టి' పాత్రని అందరూ అభిమానించారు. చిట్టి అనేది ఒక ఎమోషన్ గా మారింది. ఈ విషయం లో ఆనందంతో పాటు భాద్యత కూడా పెరిగింది. నా స్కిల్ పై నాకు పూర్తి నమ్మకం వుంది. అయితే ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ని ఆదరిస్తారనేది కూడా ఇక్కడ కీలకం. నా పాత్ర వరకూ వందశాతం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ సినిమాలో చిట్టి కాదు వసుధనే కనిపిస్తుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సుదర్శన్ కి మీకు మంచి కాంబినేషన్ ఉంటుందని విన్నాం ?…

2 years ago

‘క్రేజీ ఫెలో’ లో ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ 'క్రేజీ ఫెలో'.  దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో ఆది సాయికుమార్‌  విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 'క్రేజీ ఫెలో' ఎలా వుండబోతుంది ? చాలా మంచి ఎంటర్ టైనర్ . సినిమా పట్ల అందరం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాం. దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నాడు. చాలా నీట్ గా ప్రజంట్ చేశాడు కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. అందరికీ నచ్చే కథ ఇది. కె.కె.రాధామోహన్‌ గారికి కూడా చాలా బాగా నచ్చి సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. క్రేజీ ఫెలో లో మంచి మ్యాజిక్ వుంది. మీ పాత్ర ఎలా వుండబోతుంది ? ఇందులో నా పాత్ర చాలా క్రేజీగా వుంటుంది. తొందరపాటు క్యారెక్టర్. చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే క్యారెక్టర్. చాలా ఎంటర్ టైనింగా వుంటుంది. నర్రా శ్రీనివాస్, అనీస్ కురువిల్లా పాత్రలతో పాటు మిగతా పాత్రలు కూడా బావుంటాయి. ప్రతి క్యారెక్టర్ లో ఫ్రెష్ నెస్ వుంటుంది. ఇందులో చాలా ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నారు కదా ?  దీనికి కారణం దర్శకుడే. ఒక చేంజ్ ఓవర్ కావాలని అడిగారు. ప్రేమ కావాలి సినిమాకి రామ్ అనే హెయిర్ స్టయిలీస్ట్ చేశారు. క్రేజీ ఫెలో కోసం మళ్ళీ కలసి పని చేశాం. కొంచెం బరువు కూడా తగ్గాను. చాలా మంది లవ్లీ , ప్రేమ కావాలి లాంటి సినిమాలు చేయమని అడుగుతారు. అలాంటి వైబ్ వుండే సినిమా క్రేజీ ఫెలో. మీ పర్శనల్ గా ఏ జోనర్ ఇష్టం ? నాకు ఎంటర్ టైనర్ ఇష్టం. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలు అలా విజయం సాధించినవే . అలాగే రియలిస్టిక్ స్క్రిప్ట్ ఒకటి చేయాలనీ వుంది. లవ్లీ, ప్రేమ కావాలి తర్వాత మీకు నచ్చిన సినిమాలు ? 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' కి చాలా మంచి పేరు వచ్చింది. 'నెక్స్ట్ నువ్వే' సినిమాకి కూడా మంచి రెస్పాన్ వచ్చింది. అలాగే తీస్ మార్ ఖాన్ సినిమా చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు క్రేజీ ఫెలో కూడా ఎంజాయ్ చేస్తూ చేశా. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. మీ కెరీర్ విషయంలో నాన్నగారి జోక్యం ఎలా వుంటుంది ? కొన్ని కథలు నాన్న వింటారు. కొన్ని నేను విని తొందర పాటు నిర్ణయాలు  తీసుకుంటాను (నవ్వుతూ)ముందు చక్కగా వినమని చెబుతారు. ఆయన జడ్జ్ మెంట్ బావుటుంది. ఇకపై చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటూ చేయాలి. హీరోయిన్స్ గురించి ? ఇద్దరు హీరోయిన్స్ అద్భుతంగా చేశారు. దిగంగన సూర్యవంశి కి మంచి పేరు వస్తుంది. మంచి డ్యాన్సర్.అలాగే మిర్నా కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్ర కూడా బావుటుంది. కామెడీ చేయడంలో సవాల్ వుంటుందా ? ఈ సినిమా కామెడీ విషయంలో దర్శకుడు చాలా పర్టిక్యులర్. టైమింగ్ విషయంలో చాలా ఖచ్చితంగా వుంటారు.  కామెడీ చాలా సహజంగా చేశాం. కామెడీ సీన్స్ అన్నీ హిలేరియస్ గా వుంటాయి.…

2 years ago

దర్శక నిర్మాత- విశ్వానంద్ పటార్ ఇంటర్వ్యూ

ఎస్ ఎమ్ ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి అనిత, ప్రఖ్యాత్ సమర్పణలో ప్రణవి పిక్చర్స్ పతాకంపై డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం…

2 years ago

హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఇంటర్వ్యూ

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'.  పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో…

2 years ago

‘కృష్ణ వ్రింద విహారి’ ఎవర్ గ్రీన్ మూవీ.. :హీరో నాగశౌర్య

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.…

2 years ago

‘దొంగలున్నారు జాగ్రత్త’ చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది: హీరో శ్రీ సింహ ఇంటర్వ్యూ

డి. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. యువ హీరో శ్రీ సింహ కోడూరి…

2 years ago

‘ఒకే ఒక జీవితం’ : హీరో శర్వానంద్ ఇంటర్వ్యూ

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి…

2 years ago

దర్శకుడు అనీష్‌ ఆర్‌ కృష్ణ ఇంటర్వ్యూ

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో దర్శకుడు అనీష్‌ ఆర్‌ కృష్ణ విలేఖరుల సమావేశంలో ‘కృష్ణ వ్రింద విహారి' విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా కోసం నాగశౌర్యని ఎప్పుడు కలిశారు ? నాగశౌర్య గారికి 2020లో ఈ కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆయన హోమ్ బ్యానర్ లోనే ఈ కథ చేయాలని నిర్ణయించారు. నాగశౌర్య స్వతహగా రచయిత కదా.. ఆయన్ని ఎలా ఒప్పించారు ? చాలా బలమైన కథ ఇది. నిజానికి హీరోలకు కథని నేను నెరేట్ చేయను. నెరేషన్ లో నేను కొంచెం వీక్(నవ్వుతూ) నా సహాయ దర్శకుడితో చెప్పిస్తుంటాను. కాని తొలిసారి ఈ కథని శౌర్యగారికి నేనే చెప్పాను. కథలో వున్న బలం అలాంటిది. నేను చెప్పినా ఓకే అవుతుందనే నమ్మకంతో చెప్పాను. నేను చెప్పినప్పుడే ఆయనకు చాలా నచ్చేసింది. ‘కృష్ణ వ్రింద విహారి' వుండే యూనిక్ పాయింట్ ఏంటి ? ఇప్పటివరకూ ఇందులో వున్న యూనిక్ పాయింట్ ని ఇంకా రివిల్ చేయలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కథపై ఒక అవగాహన ఇస్తాం. అయితే ఈ కథకి మూలం చెప్తాను. నాకు బాగా కావాల్సిన సన్నిహితుడు జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఫ్రేమ్ చేసుకున్న

2 years ago

నటిగా గొప్ప తృప్తిని ఇచ్చిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ : అమల అక్కినేని ఇంటర్వ్యూ

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి…

2 years ago