‘స్పై’ లో ఛాలెజింగ్ రోల్ చేశాను : హీరోయిన్ ఐశ్వర్య మీనన్

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’తో వస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చ‌ర‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో  నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ విలేకరుల సమావేశంలో ‘స్పై’ విశేషాలని పంచుకున్నారు.  

స్పై ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
ఇది నా మొదటి తెలుగు సినిమా. నిజంగా డ్రీమ్ డెబ్యు. దర్శకుడు గ్యారీ బిహెచ్ ఈ సినిమా సైన్ చేసినపుడే నన్ను హీరోయిన్ గా అనుకున్నారు. నేరుగా వచ్చి కథ చెప్పారు. కథ విని చాలా థ్రిల్ అయ్యాను.  ఇందులో నాది చాలా ఇంటెన్స్ రోల్. మరో ఆలోచన లేకుండా సైన్ చేశాను. స్పై .. ఎక్సయిటింగ్ యాక్షన్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది.

మీ పాత్ర యాక్షన్ కోణంలో ఉంటుందా ?
ఇందులో నా పాత్రకు చాలా కోణాలు వుంటాయి. యాక్షన్, స్టంట్స్ అన్నీ వుంటాయి. రా ఏజెంట్ గా కనిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. యాక్షన్,  గన్ షూటింగ్ లో  దాదాపు ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. నిజంగా ఇది చాలా ఎక్సైటింగ్ జర్నీ.

ఈ పాత్ర  చేసే క్రమంలో ‘రా’ గురించి చాలా నేర్చుకున్నాను. ఎలాంటి గుర్తింపుని ఆశించకుండా దేశానికి సేవ చేస్తుంటారు. అలాగే ఈ సినిమా యాక్షన్ విషయంలో నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. ఇకపై యాక్షన్ పాత్రలు వస్తే చాలా కాన్ఫిడెంట్  గా  చేస్తాననే నమ్మకం వుంది. స్పై కి పార్ట్ 2 చేసే స్కోప్ వుంది. ఒకవేళ అది జరిగితే అందులోనూ నేనే హీరోయిన్ గా ఉండాలనేది నా కోరిక.(నవ్వుతూ)

నిఖిల్ తో పని చేయడం ఎలా అనిపించింది ?  
నిఖిల్ బ్రిలియంట్ యాక్టర్. హ్యాపీ డేస్ నుంచి ఆయన వర్క్ ని చూస్తున్నాను. ఆయన కథల ఎంపిక చాలా బాగుంటుంది. తను చాలా పాజిటివ్ పర్సన్ . చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు.

స్పై మ్యూజిక్ గురించి చెప్పండి ?
శ్రీచరణ్ పాకాల గారు నేపధ్య సంగీతం తో పాటు తూ ముజే ఖూన్ ధో పాట చేశారు, అలాగే విశాల్ చంద్రశేఖర్ గారు రెండు పాటలు చేశారు. స్పై మ్యూజిక్ ఎక్స్ట్రార్డినరి  గా  వుంటుంది.  

స్పై షూటింగ్ లో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
నేను ఇది వరకు యాక్షన్ సినిమాలు చేయలేదు. రా ఏజెంట్ గా కనిపించడం అంటే దానికి   ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మన కదలిక, యాక్షన్, ఫైట్. యాటిట్యూడ్ అన్నీ రా ఏజెంట్ లా సహజంగా ఉండేలా చూసుకోవడం ఛాలెంజింగ్ గా అనిపించింది.  ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

మీ సినిమా ప్రయాణం ఎలా జరిగింది ?
ఇప్పటివరకూ  ప్రయాణం చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇంజనీరింగ్ చేశాను. నేను ఎప్పుడూ హీరోయిన్ అవుతానని అనుకోలేదు. ఆరంభంలో చిన్న చిన్న యాడ్స్ చేశాను. ఒకొక్క అడుగువేసి ఇక్కడి వరకూ వచ్చాను. ఈ ప్రయాణం చాలా ఆనందాన్ని ఇస్తోంది.

మీ డ్రీమ్ రోల్స్ ఏంటి ? మీ ఫేవరేట్ హీరో ఎవరు ?
చాలా డ్రీమ్ రోల్స్ వున్నాయి. అలియా భట్ చేసిన హైవే తరహ పాత్రలు పోషించాలని వుంది. నాకు అందరి హీరోలతో వర్క్ చేయాలని వుంటుంది

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి ?
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా చేస్తున్నా

ఆల్ ది బెస్ట్
థాంక్స్.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

14 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago