‘మను చరిత్ర’ – శివ కందుకూరి ఇంటర్వ్యూ

 

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. ఇంటెన్స్ లవ్ స్టొరీగా రూపొందింది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మించారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో శివ కందుకూరి ముచ్చటించారు. 

‘మను చరిత్ర’ టైటిల్ వెనుక కథేంటి? మీ క్యారెక్టర్ ఎలా ఉంది?
నేను టైటిల్ రోల్ ప్లే చేశా. నా పాత్ర పేరు మను. అతడి ఏడెనిమిదేళ్ళ జీవితాన్ని సినిమాలో చూపిస్తున్నాం. అందుకే, ‘మను చరిత్ర’ టైటిల్ యాప్ట్ అనిపించింది. ట్రైలర్ లో చూపించినట్లు మను క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఒక కాలేజీ స్టూడెంట్ ఎందుకు అలా అయ్యాడనేది మేం చెబుతున్నాం. అందులో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేశాం. మనం కొత్తగా ఏ ప్రేమకథను చెప్పలేం. నేపథ్యమే కథను కొత్తగా మారుస్తుంది. వరంగల్ గుండాయిజం నేపథ్యంలో దర్శకుడు కథ రాశారు. అందరూ రిలేట్ చేసుకునేలా క్యారెక్టర్ ఉంటుంది. అలాగే, చాలా షేడ్స్ ఉంటాయి. 

దర్శకుడు భరత్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా?  లేదంటే మీరు భరత్ ను అప్రోచ్ అయ్యారా?
నేను వేరే సినిమా కోసం ఆడిషన్ చేస్తున్నాను. లిరిసిస్ట్ సిరాశ్రీ గారు చెప్పడం ద్వారా ఆ ఆడిషన్ కు వెళ్ళా. భరత్ గారు ఆ ఆడిషన్ టేప్ చూసి ‘మను చరిత్ర’ కోసం కాంటాక్ట్ చేశారు. యాక్టర్ గా కమర్షియల్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అప్పటి వరకు విన్న కథలు టెంప్లేట్ మోడ్ లో ఉన్నాయి. ‘మను చరిత్ర’ కథ విన్నప్పుడు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఆర్గానిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది. ఫోర్స్డ్ గా ఫైట్స్, సీన్స్ ఉండవు. కథలో భాగంగా అన్నీ వచ్చాయి. నటుడిగా ఎదగడానికి ఇటువంటి కథ అవసరం అనిపించింది. విన్న వెంటనే ఓకే చెప్పేశా. 

మీరు ఇప్పటివరకు చేసినవి సాఫ్ట్ క్యారెక్టర్స్. ఇందులో రఫ్ క్యారెక్టర్ చేశారు. ప్రిపరేషన్ ఏమైనా?
క్రెడిట్ అంతా డైరెక్టర్ భరత్ గారికి ఇవ్వాలి. నాకు ఫస్ట్ టైమ్ స్టోరీ నేరేట్ చేసినప్పుడు మూడు గంటలు చెప్పారు. ప్రతిదీ డిటైలింగ్ గా నేరేట్ చేశారు. షాట్ మేకింగ్, కెమెరా యాంగిల్స్ నుంచి క్లియర్ గా చెప్పారు. దర్శకుడిగా ఆ క్లారిటీ ఉన్నప్పుడు యాక్టర్స్ వర్క్ ఈజీ అవుతుంది. ఆయన అంత వర్క్ చేసినా, ఏ రోజూ మీరు ఇలాగే చేయాలని చెప్పలేదు. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి 30 రోజుల ముందు మేనరిజమ్, యాస విషయాల్లో ఓ డెసిషన్ తీసుకున్నాం. వర్క్ షాప్ చేశాం.

మీ ముందు సినిమాల్లో ఇంత మంది హీరోయిన్లు లేరు. ఈ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ అయిందనుకుంటా!
అవును. ఇంతకు ముందు సినిమాల్లో ఇంత మంది లేరు. క్యారెక్టర్ పరంగా మేం వెళ్లాం. బడ్జెట్ అంటే శ్రీనివాసరెడ్డి గారు ఇంతలో సినిమా తీయమని ఎప్పుడు చెప్పలేదు. కథకు అవసరం అంటే ఎప్పుడూ నో చెప్పలేదు. దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో బాగా తీశారు. ఎక్కడ ఓవర్ ద టాప్ తీయలేదు. ఇంత మంది అమ్మాయిలు ఉన్నా గ్లామర్ యాడ్ చేయాలని ఎవరిని పెట్టలేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చు. నేను అది బలంగా చెబుతా. 

ముగ్గురు హీరోయిన్లను తీసుకోవడానికి కారణం?
సినిమాలో క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంది. ఆ బ్యాక్ డ్రాప్ చెప్పడానికి ఒక లవ్ స్టోరీ ఉపయోగపడింది. ఒక అమ్మాయితో సినిమా చేస్తే ఆ ఇంట్రెస్ట్ వచ్చేది కాదేమో! ఒక్క ప్రేమ కథతో అంత ఇంటెన్స్ రాదేమో! 

గోపీసుందర్ మ్యూజిక్ గురించి…
ఆయనతో నా సెకండ్ ఫిల్మ్ ఇది. దీనికి ముందు ‘చూసీ చూడంగానే’ చేశా. ఆయనతో బ్యూటిఫుల్ ర్యాపో ఉంది. ఒక ట్యూన్ కోసం నాలుగైదు ఆప్షన్స్ ఇచ్చేవారు. వరంగల్ నేపథ్యం కనుక ఆ ప్రాంతంలో వినిపించే సౌండ్స్ కావాలని అడిగితే రీ వర్క్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో తెలుగులో ఆయన ఇటువంటి సినిమా చేయలేదు. ఫైవ్ సాంగ్స్, 2 బిట్ సాంగ్స్ ఉన్నాయి.    

సినిమా చూసి మీ నాన్నగారు ఏమన్నారు?
కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేశానని చెప్పారు. అది కాంప్లిమెంట్. కొత్త హీరోకి ఇటువంటి ఛాన్స్ రావడం అరుదు. 

‘మను చరిత్ర’ను లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయాలనుకున్నారట!

సెప్టెంబర్ 9న అనుకున్నాం. విడుదలకు రెండు వారాల ముందు పది రోజుల ఫుటేజ్ మిస్ అయ్యిందని గుర్తించాం. ఫుటేజ్ స్టోరేజ్ థర్డ్ పార్టీ వాళ్ళకు ఇచ్చాం. అప్పటికి నేను వేరే సినిమా షూటింగ్ చేస్తున్నా. అందువల్ల, లేట్ అయ్యింది. ఫారిన్ పంపిస్తే కొంత రికవర్ చేశారు. తర్వాత మళ్ళీ షూట్ చేశాం. మధ్యలో ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చేశా. అది కూడా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాను శ్రీ విజయ ఫిలిమ్స్ నవీన్ గారు టేకోవర్ చేశారు. ఆయన జూన్ 23న రిలీజ్ చేయాలనుకున్నారు. అప్పుడు ఇద్దరు నిర్మాతలను కూర్చోబెట్టి మాట్లాడా. అందరం కలిసి ముందు ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నాం.    

మీ నెక్స్ట్ మూవీస్?
‘భూతద్దం భాస్కర్’ రెడీగా ఉంది. మార్చి 31న విడుదల చేయాలనుకున్నాం. సీజీ వర్క్ వల్ల డిలే అయ్యింది. త్వరలో ఆ సినిమా వస్తుంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

1 day ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago