Geeta Sakshigaa is an upcoming emotional and intense drama based on real-life incidents. The film, starring Aadarsh and Chitra Shukla,…
Shibasish Sarkar was unanimously elected as President of the Producers Guild of India (“Guild”) at the first meeting of its…
హైదరాబాద్, 22nd సెప్టెంబర్ 2022: మీ కుటుంబంతో సమయాన్ని గడపడానికి పండగలకు మించిన అవకాశం మరొకటి ఉండదు. ఐతే, మీ ఫెస్టివల్ మరియు ఫ్యామిలీ టైంకి ఇంకాస్త…
ఉగ్రవాదం కారణంగా జమ్మూకశ్మీర్లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మూతబడిన సినిమా థియేటర్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. పుల్వామా, సోపియాలలోని ఆదివారం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్…
https://youtu.be/6ZBzOmYQHdI ఏ సినిమాకైనా మొదటి రోజు మొదటి ఆట ఎంతో ముఖ్యం. మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాలెన్నో ఉన్నాయి. అయితే ఫస్ట్ డే…
మిల్కీ బ్యూటీ తమన్నా బౌన్సర్స్ వీడియో జర్నలిస్ట్ లపై దాడి చేయడం సంచలనం సృష్టిస్తోంది. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న తమన్నా ప్రస్తుతం బబ్లీ బౌన్సర్ అనే సినిమా…
ప్రశ్న: 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'... సినిమా కథేంటి? మీరు, శింబు ఇంతకు ముందు చేసిన సినిమాలకు చాలా డిఫరెంట్గా టీజర్, ట్రైలర్ ఉన్నాయి!గౌతమ్ మీనన్ : మేం…
There is no end to entertainment on Zee Telugu, and its amazing line up of clutter-breaking shows lends credence to…
వినోదాత్మకమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోస్ తో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్న 'జీ తెలుగు' ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకువస్తూ వారి మన్ననలు పొందుతున్న…
'శాకిని డాకిని' యూనిక్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్.. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు: 'శాకిని డాకిని' ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్' కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శాకిని డాకిని'. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో అడవి శేష్, దర్శకులు నందిని రెడ్డి, అనుదీప్, విమల్ కృష్ణ ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో సీనియర్ కథానాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజుకు నివాళిగా చిత్ర బృందం మౌనం పాటించి అంజలి ఘటించింది. అడవి శేష్ మాట్లాడుతూ.. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ వండర్ ఫుల్ యాక్టర్స్. రెజీనాతో 'ఎవరు'లో కలసి పని చేశా. మొన్ననే రెజీనా రాకెట్ బాయ్స్ చూశాను. చాలా నచ్చింది. నివేదా చేసిన నిన్ను కోరి, బ్రోచేవారెవరురా నాకు చాలా ఇష్టం. తను ఏ పాత్ర చేసిన అద్భుతంగా వుంటుంది. ఈ ఈవెంట్ కి రావడానికి కారణం సునీత గారు. మా కోరిక మేరకు సునీత గారు మేజర్ లో హీరోయిన్ మదర్ గా చేశారు. అయితే లెంత్ కారణంగా సినిమాలో సీన్లు వుంచడం కుదరలేదు. ఈ ఈవెంట్ వేదికగా సునీత గారికి క్షమాపణలు చెబుతున్నా. 'మిడ్నైట్ రన్నర్స్' ఇద్దరు అబ్బాయిలు చేసిన సినిమా. ఇందులో ఇద్దరు అమ్మాయిలు చేయడం చాలా క్యూరియాసిటీని పెంచుతోంది. సెప్టెంబర్ 16న 'శాకిని డాకిని' థియేటర్లోకి వస్తుంది. నేను థియేటర్ లో ఉంటా. థియేటర్ లో కలుద్దాం'' అన్నారు. నందిని రెడ్డి మాట్లాడుతూ.. హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ కామెడీ గా 'శాకిని డాకిని' రావడం చాలా ఆనందంగా వుంది. ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేస్తే అదిరిపోతుంది. నాకు థియేటర్ కి వెళ్లి చూడాలని వుంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ కెమిస్ట్రీ చాలా యూనిక్ గా వుంది. 'శాకిని డాకిని' ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ అవుతుంది. మన తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ వుంటే ఖచ్చితంగా చూస్తారు. ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. నాకు ఓ బేబీ సినిమా ఇచ్చిన సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కి థాంక్స్. ఓ బేబీ కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. రెజీనా చాలా మంచి మనసున్న నటి. రెజీనా, నివేదా ఈ సినిమాని చాలా ప్యాషన్ తో చేశారు. సెప్టెంబర్ 16న సినిమాని తప్పకుండా థియేటర్లలో చూడండి'' అని కోరారు. రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. శాకిని డాకిని తో చాలా ట్రావెల్ చేశాం. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ కి కృతజ్ఞతలు. ఇలాంటి చిత్రాలని ఇలాంటి నిర్మాణ సంస్థలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బావుంటుంది. దర్శకుడు సుధీర్ వర్మ సినిమాని అద్భుతంగా తీశారు. రిచర్డ్ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. అక్షయ్ చాలా మంచి డైలాగ్స్ రాశారు. సంయుక్త కి బిగ్ థాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కి థాంక్స్. యాక్షన్ మాస్టర్ వెంకట్ గారికి స్పెషల్ థాంక్స్. నాకు ఎప్పటి నుండో యాక్షన్ సినిమా చేయాలని వుంది. ఈ సినిమాతో కుదిరింది. నరేష్ చాలా మంచి పాటలు ఇచ్చారు. సునీత మేడంకి హ్యాపీ బర్త్ డే. ఆమెతో కలసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నుండి చాలా నేర్చుకున్నాను. నివేదాతో కలసి నటించడం చాలా ఆనందంగా వుంది. ఒక నటిగా నివేదా అంటే నాకు చాలా ఇష్టం. సెప్టెంబర్ 16న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా థియేటర్ కి వెళ్లి చూడండి. ఈ సినిమా మాకు ఒక మైల్ స్టోన్ గా కాబోతుందనే నమ్మకం వుంది. నివేదా థామస్ మాట్లాడుతూ.. 'శాకిని డాకిని' తో చాలా నేర్చుకున్నాను. ఇందులో పని చేసిన ప్రతిఒక్కరూ నన్ను ముందుకు నడిపారు. నరేష్ బ్రిలియంట్ నేపధ్య సంగీతం అందించారు. ఇద్దరు హీరోయిన్స్ తో 'శాకిని డాకిని' చేయాలనే ఆలోచన సంయుక్తది. సుధీర్ వర్మ లాంటి ప్రతిభగల దర్శకుడిని ఇచ్చి ఇంత గొప్పగా సినిమా విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్ , సురేష్ బాబు, సునీత మేడం కి కృతజ్ఞతలు. సునీత మేడం నుండి చాలా నేర్చుకున్నాను. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులని దాటుకొని చాలా విజయవంతంగా సినిమాని నిర్మించారు. రెజీనాతో కలసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. నందిని రెడ్డి, అడివి శేష్, అనుదీప్ ఈ ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. కొత్త కంటెంట్ ని ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుటారు. ఈ సినిమాని కూడా ఆదరిస్తారనే నమ్మకం వుంది'' అన్నారు. సునీత తాటి మాట్లాడుతూ.. ఇద్దరు హీరోలతో ఈ సినిమా చేయాలని మొదలుపెట్టాం. ఇద్దరు హీరోయిన్స్ తో సినిమా చేస్తే ఎలా వుంటుందని సంయుక్త అన్నారు. ఈ విజన్ ని దర్శకుడు సుధీర్ వర్మ నమ్మారు. ఈ సినిమా టైటిల్ ఇచ్చింది కూడా సంయుక్తనే. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులని దాటి సినిమాని చాలా విజయవంతంగా నిర్మించాం. 'శాకిని డాకిని' యూనిక్ ఫిల్మ్ .రెజీనా, నివేదా లేకుండా ఈ సినిమా వుండేది కాదు. యాక్షన్ కోసం చాలా కష్టపడ్డారు. నివేదాలో మంచి డైరెక్టర్ కూడా వున్నారు. ఆమె ఆ సవాల్ ని త్వరలోనే స్వీకరిస్తుందని భావిస్తున్నాను. రెజీనా అద్భుతమైన నటి. అన్ని భాషల్లో చాలా మంచి చిత్రాలు చేస్తోంది. ఈ వేడుకకి అడవి శేష్ రావడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో మాకు సహకరించిన మా బ్రదర్, డాక్టర్ శరత్ అద్దంకి కి కృతజ్ఞతలు. సతీష్, పృద్వీ గారు, అనుదీప్ కి థాంక్స్. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్, పవన్, పాటలు రాసిన రాకేందు మౌళి, డైలాగ్ రైటర్ అక్షయ్, నేపధ్య సంగీతం అందించిన నరేష్, నిహారిక, ఎడిటర్ విప్లవ్ కి కృతజ్ఞతలు'' తెలిపారు. అనుదీప్ మాట్లాడుతూ.. నిర్మాతలు సురేష్ బాబు, సునీత తాటి, హీరోయిన్లు రెజీనా, నివేదాలకు ఈ సినిమా పెద్ద విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 16న ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు. విమల్ కృష్ణ మాట్లాడుతూ.. 'మిడ్నైట్ రన్నర్స్' చూశాను. ఇది తెలుగులో ఎలా వుంటుందో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ చూసిననప్పుడు చాలా క్యురియాసిటీ పెంచింది. రెజీనా, నివేదా అద్భుతంగా యాక్ట్ చేశారు. సురేష్ బాబు గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు. సతీష్ మాట్లాడుతూ .. ఈ సినిమా కథ గురించి నాకు తెలుసు. అద్భుతమైన కథ. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ బ్రిలియంట్ గా ఫెర్ ఫార్మ్ చేశారు. సెప్టెంబర్ 16న ఈ సినిమా తప్పకుండా చూడండి'' అన్నారు రాకేందుమౌళి మాట్లాడుతూ.. ఇందులో రెండు పాటలు రాశాను. రెండు పాటలు చాలా వైవిధ్యంగా వుంటాయి. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సురేష్ బాబు, సునీత తాటి గారికి థాంక్స్. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ఇద్దరూ అద్భుతంగా చేశారు. సెప్టెంబర్ 16న సినిమా వస్తోంది. తప్పకుండా చూడండి'' అన్నారు…