శర్వానంద్, శ్రీ కార్తీక్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘ఒకే ఒక జీవితం’  థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన అనిరుధ్ రవిచందర్

4 years ago

ప్రామెసింగ్ హీరో శర్వానంద్ డిఫరెంట్ జోనర్‌ల సినిమాలు చేయడంలో తన వైవిధ్యాన్ని చాటుతున్నారు. శర్వానంద్ కెరీర్ లో 30వ చిత్రంగా తెరకెక్కిన వైవిధ్యమైన చిత్రం ‘ఒకే ఒక…

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల

4 years ago

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌ తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్సకత్వంలో రాబోతున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. నివేదా పేతురాజ్ కథానాయిక. దాస్ కా ధమ్కి రోమ్కామ్, యాక్షన్ థ్రిల్లర్.  తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్‌ వుంటుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి. 95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌, హరి హర వీర మల్లు చిత్రాలకు  స్టెంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజి తో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్‌ లోని సారధి స్టూడియోస్‌ లో వేసిన భారీ సెట్‌ లో షూటింగ్ జరుగుతోంది. ఫుకెట్‌ లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్‌ ను, స్పెయిన్‌ లో ఒక చిన్న షెడ్యూల్‌ ను టీమ్ పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు. బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్‌ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌ ను పర్యవేక్షించారు. చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా,  లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ప్రతి నటుడికి సమానమైన, మంచి ప్రాముఖ్యత ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్

‘దాస్ కా ధమ్కీ’ నా పాన్ ఇండియా మూవీ : విశ్వక్ సేన్

4 years ago

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద…

భారతదేశం మూలాల్లో కథలు చెప్పడానికి చేతులు కలిపిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్

4 years ago

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలిసి ఈ ఏడాది 'కాశ్మీర్ ఫైల్స్' భారీ బ్లాక్బస్టర్ను అందించారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో  అభిషేక్…

పాపారావు బియ్యాల ‘మ్యూజిక్‌ స్కూల్‌’ కోసం సింఫనీ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేసిన మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా

4 years ago

ఇళయరాజా సంగీతం వహించిన సినిమా మ్యూజిక్‌ స్కూల్‌. బుడాపెస్ట్ లో నేపథ్య సంగీతానికి తుది ముస్తాబులు చేశారు. అక్కడి ఆర్కెస్ట్రాతో నిన్న రికార్డింగ్‌ పూర్తి చేశారు. ఈ…

సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’

4 years ago

బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి…

మీసం తిప్పి బరిలోకి దిగిన ‘వీరమల్లు’

4 years ago

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి.…

‘ప్రిన్స్’ ఫస్ట్ సింగల్  ”బింబిలిక్కి పిలాపి” విడుదల

4 years ago

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లను ఫస్ట్ సింగల్ ''బింబిలిక్కి పిలాపి''డ్యాన్స్ నెంబర్ తో గ్రాండ్ గా ప్రారంభించింది చిత్ర యూనిట్. సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టయిల్ లో మాస్ బీట్ డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేయగా.. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ఈ పాటని చూస్తుంటే థియేటర్లో ఫ్యాన్స్ విజల్స్ వేయడం ఖాయమనిపిస్తోంది. రామ్ మిరియాల, రమ్య బెహరా, సాహితీ చాగంటి త్రయం ఈ పాటని డైనమిక్ గా ఆలపించగా.. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో శివకార్తికేయన్ డ్యాన్స్ మూమెంట్స్ అలరించగా, మారియా కూడా శివకార్తికేయన్ యొక్క ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ప్రయత్నించింది. మారియా తన సూపర్ కూల్ లుక్స్, స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత. తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు. సాంకేతిక విభాగం రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి సంగీతం: ఎస్ థమన్ నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ సమర్పణ: సోనాలి నారంగ్ సంగీతం: ఎస్ థమన్ డీవోపీ: మనోజ్ పరమహంస సహ నిర్మాత:  అరుణ్ విశ్వ ఎడిటర్: ప్రవీణ్ కెఎల్ ఆర్ట్ : నారాయణ రెడ్డి పీఆర్వో : వంశీ-శేఖర్

“జరీ జరీ పంచె కట్టు’ సాంగ్ గ్రాండ్ లాంచ్ ..

4 years ago

నివృతి' వైబ్స్ విడుదల చేసిన 'జరీ జరీ పంచె కట్టు' సాంగ్ .. జ్యోతి, ప్రియ, ప్రశాంత్ నిర్మాతలుగా మదిన్ సంగీత సారథ్యంలో వి.జె .శేఖర్ మాస్టర్…

ZEE5 announces a new Original titled ‘Maya Bazar’

4 years ago

The streaming giant collaborates with Rana Daggubati for the first time ZEE5 has been relentlessly dishing out a wide variety…