The GOAT మూవీ హోల్సమ్ ఎంటర్ టైనర్. చాలా సర్ ప్రైజ్ లు వున్నాయి. డైరెక్టర్ వెంకట్

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.  ‘The GOAT’ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. The GOAT మూవీ హోల్సమ్ ఎంటర్ టైనర్. థియేటర్స్ లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. దళపతి విజయ్ ని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాం. సెప్టెంబర్ 5న థియేటర్స్ లో సినిమా చూసి ఎలా వుందో చెప్పండి. విజయ్ గారు, ప్రశాంత్, ప్రభుదేవ,  జయరాం ఇలా ఎంతోమంది బిగ్ స్టార్స్ తో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. స్నేహ,లైలా, మీనాక్షి, యోగిబాబు, ప్రేమ్ జీ ఇలా హ్యుజ్ స్టార్ కాస్ట్ వున్న సినిమా ఇది. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ తో వర్క్ చేయడం ఇదే తొలిసారి. విజయ్ గారి సినిమా, అలాగే ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ 25వ సినిమాని డైరెక్టర్ చేయడం ఆనందంగా వుంది. ఏడాదిలో ఈ సినిమా చేశాం. ఇదే సినిమా హాలీవుడ్ లో చేస్తే చాలా టైం, బడ్జెట్ తీసుకుంటారు. ఇలా చేయడానికి రాజమౌళి గారే స్ఫూర్తి. ఆయనకి పెద్ద ఫ్యాన్. మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్ యూ. వారు ఈ సినిమాని రిలీజ్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. సెప్టెంబర్ 5న సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి.  బాలయ్య గారు సినీ పరిశ్రమలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. ఆయనకి మనస్పూర్తిగా శుభాకాంక్షలు. జై బాలయ్య. తెలుగు ఇండస్ట్రీలో  ‘GOAT’ బాలయ్య గారు’ అన్నారు.      

నిర్మాత అర్చన కల్పాతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రవి గారు, శశి గారు, మైత్రీమూవీ మేకర్స్ కి థాంక్ యూ.  మైత్రీ మూవీ మేకర్స్ The GOAT. నా ఆల్ టైం ఫేవరేట్ మూవీ పుష్ప ని నిర్మించారు. The GOAT సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. మ్యాగ్జిమం స్క్రీన్స్ లో రిలీజ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో కొలబరేట్ అవ్వడం ఆనందంగా వుంది. ఇది మా 25వ సినిమా. విజయ్ గారు మా GOAT. డైరెక్టర్ వెంకట్ ప్రభు గారుకి థాంక్. యువన్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు.సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. సెప్టెంబర్ 5న అందరూ థియేటర్స్ లో సినిమా ఎంజాయ్ చేయండి’ అన్నారు.

యాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఇది. ఆడియన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. నిర్మాతలు చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు. ఇంతమంది స్టార్స్ ని ఒక ఫ్రేంలో చూపించి మూవీ తీయడం అంత తేలిక కాదు. వెంకట్ ప్రభు గారు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. చాలా గ్రేట్ విజన్ తో సినిమాని రూపొందించారు. చాలా హ్యుజ్ ఫిలిం ఇది. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ కి ఒక ట్రీట్ లా వుంటుంది. విజయ్ చాలా సాఫ్ట్ పర్శన్. విజయ్, ప్రభుదేవ, నేను కలసి చేసిన సీన్స్ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తాయి. యువన్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ సపోర్ట్. నిర్మాత అర్చన గారు చాలా పాషన్ తో సినిమా చేశారు. ఆడియన్స్ తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

హీరోయిన్ స్నేహ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ గారు, వెంకట్ ప్రభు గారు, అర్చన గారికి థాంక్ యూ. ఇదొక మెగా ఫిల్మ్. సెట్స్ లో విజయ్, ప్రశాంత్, లైలా, మీనాక్షి ఇలా  ఎందరో స్టార్స్ వుండేవారు. ఈ అందరితో పని చేయడం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చాలా రోజుల తర్వాత నా సినిమా వస్తోంది. సినిమా అదిరిపోతుంది’ అన్నారు.

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. నా కెరీర్ బిగినింగ్ లోనే ఇంత బిగ్ స్టార్స్ తో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. విజయ్ గారు చాలా కామ్ పర్శన్. చాలా డెడికేటెడ్ గా వుంటారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. ఈ మూవీ జర్నీ చాలా మెమరబుల్. సెట్స్ లో చాలా ఫన్ వుండేది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరున థాంక్స్. వెంకట్ ప్రభుగారు చాలా కూల్ గా వుంటారు, ఎలాంటి సమస్యనైన కూల్ పరిష్కరిస్తారు. యువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ గారితో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సినిమాలో చాలా సర్ప్రైజ్ లు వున్నాయి. సెప్టెంబర్ 5న మూవీని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి’ అన్నారు.      

యాక్ట్రెస్ లైలా మాట్లాడుతూ.. విజయ్ గారు వెంకట్ ప్రభు గారితో కలసి ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. ఈ మూవీ లవ్ లవ్లీ జర్నీ. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. అందరూ సెప్టెంబర్ 5న సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.      

మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ శంకర్ రాజా మాట్లాడుతూ.. అందరికీ హాయ్. విజయ్ గారి సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం ఎప్పుడూ స్పెషల్ గా వుంటుంది. తప్పకుండా ఈ సినిమాని మీరంతా లవ్ చేస్తారు. నా లైఫ్ లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మై ఫాదర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు’ అన్నారు  

డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత అర్చన గారికి థాంక్యూ. బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో చాలా గ్రాండ్ గా నిర్మించిన సినిమా ఇది. ట్రైలర్, టీజర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు మేమంతా కలిసి ఈ సినిమాని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయడం జరుగుతుంది. విజయ్ గారి కెరీర్ హయ్యస్ట్ రిలీజ్. ఎర్లీ మార్నింగ్ షోస్ ప్లాన్ చేస్తున్నాం. సినిమా తప్పకుండా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది’ అన్నారు.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

1 day ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

3 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago