Categories: Uncategorized

‘కోట బొమ్మాళి పీఎస్‌’ పొలిటికల్ సెటైర్ కాదు.. సిస్టమ్ లో జరిగేది చూపించాం : హీరో శ్రీకాంత్

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్ మీడియా మిత్రులతో ముచ్చటించారు.

“ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఎక్కడైనా పోలీసులు క్రిమినల్స్ ని చేజ్ చేసి పట్టుకుంటారు. కానీ ఇందులో పోలీస్ చేజెస్ పోలీస్ కథ. పొలిటిషన్స్ పోలీసులను ఎలా వాడుకుంటారు? దానివల్ల పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓటు బ్యాంకింగ్ కోసం కులాలను మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు అనేది ఇందులో స్పష్టంగా చూపించారు. సిస్టమ్ లో జరిగేది మాత్రమే చూపించారు.. కానీ పొలిటికల్ గా ఎలాంటి సెటైర్ ఉండదు.

దర్శకుడు తేజ ఈ సబ్జెక్టును బాగా డీల్ చేశాడు.
తను కథ చెబుతున్నప్పుడే థ్రిల్ అయ్యాను. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టనివ్వదు.

హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్రలో నేను నటించాను. దీనికోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్న. నేను రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ మా పై ఆఫీసర్ గా ఉండి.. మమ్మల్ని పట్టుకోవడానికి చూస్తారు. వరలక్ష్మి వేసే ఎత్తులకు నేను పైఎత్తులు వేస్తూ ఉంటాను.

అంతముందు నేను చేసిన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్.. సాంగ్స్ ఫైట్స్ అన్ని ఉంటాయి.. ఇందులో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంతయో అనేది ఉంటుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన నయట్టు చిత్రానికి ఇది రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. ఈ మధ్య కాలంలో నేను చేసిన ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ క్యారెక్టర్ ఇది. పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉన్న పాత్ర పోషించాను. ఒరిజినల్ గా పోలీస్ ఎలా ఉంటారు.. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో.. నా పర్ఫామెన్స్ లెవెల్ కూడా అలాగే ఉంటుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా యంగ్ బ్యాచ్. చాలా స్ట్రాంగ్ గా దీన్ని రూపొందించారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఎడిటింగ్ సహా అందరూ.. ప్యాషన్ తో వర్క్ చేశారు. అరకు వ్యాలీ లో ఎక్కువ భాగం షూట్. నైట్ టైం అడవిలో చెప్పులు లేకుండా పరిగెత్తడం, చేజింగ్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం.

ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను కానీ ఇందులో చూసిన లొకేషన్స్ ని ఎక్కడ చూడలేదు. పాడేరు ప్రాంతలో బాగా డెప్త్ కి వెళ్లిపోయి మరీ షూట్ చేశాం. నాకు ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాంటిది.

లింగిడి లింగిడి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై బజ్ బాగా పెరిగింది. సినిమా కూడా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మా అందరిలో ఉంది. ఏ ఆర్టిస్ట్ కి అయినా సిన్సియారిటీ ముఖ్యమని రాహుల్ కి, శివానికి చెప్పేవాడిని. రాహుల్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. తనను చూస్తే నా బిగినింగ్ డేస్ లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. మన తెలుగు అమ్మాయి శివాని కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తుంది. రాజకీయ నాయకుడిగా మురళీ శర్మ పోషించిన పాత్ర కీలకంగా ఉంటుంది. ఇందులో పాత్రతో పాటు, డైలాగ్స్ ఎమోషన్స్ అన్ని చాలా నేచురల్ గా ఉంటాయి. ఈ సినిమా కోసం నేను కూడా ఈగరగా వెయిట్ చేస్తున్నా. ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, విద్య చాలా క్లారిటీగా దీన్ని రూపొందించారు.

ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్, ఎన్టీఆర్ తో దేవర చిత్రాలతో పాటు మోహన్ లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న చిత్రంలోను కీలకపాత్ర పోషిస్తున్నా”.

తారాగణం: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: తేజ మార్ని
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి
డోప్: జగదీష్ చీకాటి
డైలాగ్స్: నాగేంద్ర కాశి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సంగీత దర్శకుడు: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
కో-డైరెక్టర్: రామ్ నరేష్

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago