Categories: Uncategorized

కర్మణ్యే వాధికారస్తే చిత్రం రిలీజ్ ప్రోమో విడుదల. అక్టోబర్ 31న చిత్రం విడుదల

ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల అవుతుంది. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క రిలీజ్ ప్రోమో ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ “ఈరోజు మా చిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’ నుంచి రిలీజ్ ప్రోమో ను విడుదల చేసాం. రిలీజ్ ప్రోమో అదిరిపోయింది, చూసిన వాళ్లంతా ప్రోమో అద్భుతంగా ఉంది అని కొనియాడారు. మా చిత్రం అక్టోబర్ 31న విడుదల అవుతుంది. టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథ కి సరి సాటిగా బ్రహ్మాజీ, శత్రు మరియు  ‘మాస్టర్’ మహేంద్రన్ వారి నటన తో చిత్రానికి మరింత ప్రాణం పోశారు.

ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్,  స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా నిర్మించాం. ఇటీవలే సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి అద్భుతంగా ఉంది అని కొనియాడారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మా చిత్రం అక్టోబర్ 31న భారీగా విడుదల అవుతుంది” అని తెలిపారు

నటి నటులు: బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్ర, బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్(నూతన పరిచయం). ఇరా దయానంద్(నూతన పరిచయం), అయేషా(నూతన పరిచయం), రెహానా ఖాన్(నూతన పరిచయం), జయ రావు, బాహుబలి మధు, తదితరులు

బ్యానర్: ఉషస్విని ఫిలిమ్స్
సమర్పణ: జవ్వాజి సురేంద్ర కుమార్
చిత్రం పేరు: కర్మణ్యే వాధికారస్తే
ఆర్ట్: నాయుడు
సంగీతం: గ్యాని
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
డి ఓ పి: భాస్కర్ సామల
కథ, మాటలు: శివ కుమార్ పెళ్లూరు
ఫైట్ మాస్టర్: రామ్ సుంకర, డ్రాగన్ అంజి
లిరిక్స్: శ్రేష్ఠ (అర్జున్ రెడ్డి)
స్టిల్స్: మహేష్ పింజల
టీజర్ కట్: వాల్స్ అండ్ ట్రెండ్స్
అసోసియేట్ డైరెక్టర్: ప్రమోద్ తెలకపల్లి
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్
మార్కెటింగ్: వంశీ కృష్ణ (సినీ డిజిటల్)
పబ్లిసిటీ డిజైనర్: ఏ జె ఆర్ట్స్
నిర్మాత”: డి ఎస్ ఎస్ దుర్గాప్రసాద్
స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం: అమర్ దీప్ చల్లపల్లి

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

20 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

20 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

20 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago