Categories: Uncategorized

కిచ్చా సుదీప్, అనూప్ భండారి, ‘బిల్లా రంగ బాషా’ వీడియో రిలీజ్

సూపర్ స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారి బ్లాక్ బస్టర్ ‘విక్రాంత్‌ రోణ’ తర్వాత మరోసారి చేతులు కలిపారు. హనుమాన్ తో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యూచర్ లో జరగబోయే కథను పరిచయం చేసే కాన్సెప్ట్ వీడియోతో పాటు ‘బిల్లా రంగ బాషా‘ అఫీషియల్ లోగో ని మేకర్స్ రివిల్ చేశారు. యూనిక్ అప్రోచ్ సినిమాలు చేయడంలో అనూప్ భండారి దిట్ట. ఈ వీడియో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది.  

కాన్సెప్ట్ వీడియో క్రీ.శ. 2209లో జరిగిన భవిష్యత్తు గురించి గ్లింప్స్ ని అందిస్తోంది. ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, తాజ్ మహల్ స్మాస్ అయినట్లుగా చూపిస్తూ, ఒక వ్యక్తి అన్నింటినీ జయించినట్లు ప్రజెంట్ చేయడం ఆసక్తికరంగా వుంది. దీనికి మూడు వేర్వేరు ప్రాంతాలు, క్లైమాట్స్ యాడ్ చేశారు. అనూప్ భండారి ఎక్సయిటింగ్ డీటెయిల్స్ తో విజువల్ ప్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు.  

ఈ కొలాబరేషన్ గురించి డైరెక్టర్ అనూప్ భండారి మాట్లాడుతూ, ‘విక్రాంత్‌ రోణ తర్వాత నిరంజన్ రెడ్డి నాతో కలిసి పనిచేయాలనుకున్నారు. మేము ఇంతకు ముందు హనుమాన్ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కలుసుకున్నాము. నా తర్వాతి చిత్రం కూడా బాద్‌షా కిచ్చా సుదీప్‌తోనే ఉంటుందని, బిల్లా రంగ బాషా కథాంశాన్ని, ఆ వరల్డ్ వివరించినప్పుడు ఆయన థ్రిల్ అయ్యారు. వారు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పెద్ద ఎత్తున నిర్మించాలని కోరుకున్నారు. బిల్లా రంగ బాషా దీనికి పర్ఫెక్ట్. కిచ్చా సుదీప్‌తో జతకట్టడం గురించి అనూప్ మాట్లాడుతూ, ‘సుదీప్ సర్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ గొప్ప అనుభవం. ప్రజలు విక్రాంత్ రోనాను ఇష్టపడ్డారు. వారు దీన్ని మరింత ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సుదీప్ సార్ దీనిని తన బిగ్గెస్ట్ అని పిలవడం చాలా పెద్ద అభినందన, నా భుజాలపై పెద్ద బాధ్యత. అంచనాలని అందుకునేలా ఈ సినిమా వుంటుంది’ అన్నారు 

‘కిచ్చా సుదీప్‌తో అనూప్‌ భండారి సినిమా చేస్తున్నారని మొదట విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం. విక్రాంత్ రోనా తెలుగులో విజయవంతమైంది. ఈ కొలాబరేషన్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. బిల్లా రంగ బాషా కథ విన్నప్పుడు, ఇది మేమే నిర్మించాలి అనే నమ్మకం కలిగింది. సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌తో సినిమా చేయడం గొప్ప అవకాశం. షూటింగ్‌ ప్రారంభం కావాలని, ప్రేక్షకులు బిల్లా రంగ బాషా ప్రపంచాన్ని చూడాలని ఎదురుచూస్తున్నాం’ అని నిర్మాతలు తెలిపారు.

బిల్లా రంగ బాషా అన్ని ప్రధాన భారతీయ భాషలలో నిర్మాణమౌతుంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. 

తారాగణం: కిచ్చా సుదీప్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: అనూప్ భండారి

నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి

బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago