వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ . ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి.. కృష్ణమ్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మూవీని థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ‘కృష్ణమ్మ’ సినిమా టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్ లుక్‌కి, అతని యాక్టింగ్‌లోని ఇన్‌టెన్సిటీతో సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి.
ఇటీవల విడుదలైన మెలోడీ సాంగ్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నెట్టింట ట్రెండ్ అవుతోంది. కృష్ణమ్మ సినిమా కథలోని మెయిన్ సోల్‌ను తెలియజేసేలా ఈ పాట ఉంది. ‘కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం..’ అంటూ సాగే ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ కాల భైరవ.. కృష్ణమ్మ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. పాట వింటుంటే సత్యదేవ్ అతని స్నేహితులు.. వారి మధ్య ఉండే అనుబంధాలను తెలియజేస్తోంది. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా పాట ఉంది.
సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో లక్ష్మణ్, కృష్ణ, అధీరా రాజ్, అర్చన, నందగోపాల్, రఘుకుంచె, తారక్, సత్యం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్ని కొర్రపాటి సినిమాటోగ్రఫీ చేస్తోన్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…