“రేవు” పార్టీలో హేమా హేమీలు.

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రంలో గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి నిర్మిస్తున్నారు. నవీన్ పారుపల్లి సమర్పకులుగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “రేవు” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ఫ్యాషన్ షో మరియు స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో చిత్ర బృందంతో పాటు మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల, సంపత్ నంది, ఉత్తేజ్ గెస్టులుగా పాల్గొని సందడి చేశారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ.. రేవుల దగ్గర జీవనం గడిపే మత్య్సకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు వారి శ్రమను దోచుకుంటారు. చేపలను వారు చెప్పిన రేటుకే కొనాలని షరతులు విధిస్తారు. మత్స్యకారుల జీవితాల్లోని ఇలాంటి ఇబ్బందులను నేపథ్యంగా ఎంచుకుని రేవు సినిమా చేయడం మంచి ప్రయత్నం. ప్రభు నాకు ఈ సినిమాను అంతా కొత్తవాళ్లు చేస్తున్నారు, బాగా చేశారని చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. ప్రభు మనకున్న ఫిలిం జర్నలిస్టుల్లో ది బెస్ట్ పర్సన్. ఆయనను ఈ సినిమాకు పర్యవేక్షకుడిగా పెట్టుకోవడం మంచి నిర్ణయం. అలాగే మరో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. స్టార్స్ ఉన్న సినిమా హిట్ అవడం కంటే కొత్త వాళ్లతో చేసిన సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరు. ఆ సంతోషం పర్వతనేని రాంబాబు గారికి, ప్రభు గారికి, ప్రొడ్యూసర్ డాక్టర్ మురళీ గింజుపల్లి గారికి దక్కాలని కోరుకుంటున్నా. దర్శకుడు హరినాథ్ పులి చూడటానికి చిన్నవాడైనా సినిమా బాగా తెరకెక్కించాడు. స్టార్ సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వస్తాయి కానీ చిన్న సినిమాకు బాగుందని మౌత్ టాక్ మొదలైతే హౌస్ ఫుల్స్ అవుతాయి. అలా రేవు సినిమా జరగాలని కోరుకుంటున్నా. రామ్ గోపాల్ వర్మ గారు కొత్త వాళ్లతో సినిమాల చేసి వాటిని బాగా ప్రమోట్ చేయించి ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటారు. ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. రేవు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జీవీ మాట్లాడుతూ.. నేను విజయవాడలో ఉన్నప్పుడు మచిలీపట్నం రేవుకు వెళ్లేవాడిని. అయితే అక్కడ మత్స్యకారుల బాధలు చూసేందుకు కాదు అక్కడ చేపలు అమ్మే వారిని చూసేందుకు. రేవు సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను చూసిన ఈ సినిమా కంటెంట్ ప్రకారం రేవు నేపథ్యంగా సాగే మత్స్యకారుల జీవితాలు, వారి లైఫ్ లో జరిగే ఈవెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారని అనుకుంటున్నాను. రేవు నేపథ్యంగా కంప్లీట్ గా ఒక సినిమా వచ్చినట్లు నాకు గుర్తులేదు. ఈ సినిమాకు సంబంధించి అదొక యూనిక్ పాయింట్ గా చెప్పొచ్చు. దర్శకుడు హరినాథ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ మూవీ టీమ్ అందరికీ నా కంగ్రాట్స్. రేవు సినిమా గ్రేట్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన మురళీ మోహన్ గారి గురించి ఓ మాట చెప్పాలి. మురళీ మోహన్ గారు మంచికి మారు పేరు అయితే నేను చెడుకు మారు పేరు. ఆయనను ఒక విషయంలో నేను బాగా ద్వేషించేవాడిని. జ్యోతి సినిమాలో నా ఫేవరేట్ హీరోయిన్ జయసుధ ఆయన ఒడిలో ఉండేది. ఆ సీన్ చూసి కోపంగా థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయేవాడిని. అందుకే మురళీ మోహన్ గారంటే నాకు కోపం. అయితే ఆయన లాంటి నాన్ కాంట్రవర్శియల్ పర్సన్ ను నా లైఫ్ లో చూడలేదు అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. రేవు సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్ విషయాలు వింటున్నా. ఈరోజు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రేవు సినిమా పార్టీ చేసుకోవడం, ఈ ఈవెంట్ లో నేను పాల్గొనడం సంతోషంగా ఉంది. రేవు సినిమా ఘన విజయం సాధించాలి, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.
సంపత్ నంది మట్లాడుతూ.. నిర్మాత డాక్టర్ మురళి గింజుపల్లి నాకు క్లాస్ మేట్. ఆయన నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది. రేవు సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నటుడు ఉత్తేజ్ మట్లాడుతూ.. ఈ సినిమాని ఆల్రెడీ నేను చూసాను. కొత్త వారైనా అందరూ చాలా బాగా చేసారు. మ్యూజిక్ బాగా కుదిరింది. ఇలాంటి కల్ట్ మూవీస్ ప్రేక్షకులు ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. దర్శకుడు హరి కి, నిర్మాత మురళి కి, ప్రభు అన్నకు, పర్వతనేని రాంబాబు కు ఆల్ ద బెస్ట్.
నిర్మాత డాక్టర్ మురళి గింజుపల్లి మాట్లాడుతూ.. నాకు మంచి మిత్రుడైన RGV గారు, నా గురు సమానులు మురళి మోహన్ గారు ఇద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వారు. ఒకరు నా సినిమా ఇష్టానికి గురువైతే.. ఇంకొకరు నా వ్యాపార విస్తరణకు ఇన్స్పిరేషన్. RGV గారు నా ఫస్ట్ మూవీ కి గెస్ట్ గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉత్తేజ్ గారు గురించి ఎవరు మరిచిపోలేరు, ఆయన ఫిలిం స్కూల్ నడుపుతున్నారు. ఆయన ఈవెంట్ కి రావడం హ్యాపీ గా ఉంది. నాకు తోడుగా వుంటున్న పారుపల్లి ప్రోడక్షన్ నవీన్ కు మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రెస్ అండ్ మీడియా కి థాంక్యూ.
నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. యూఎస్ నుంచి వచ్చిన తర్వాత మురళి గారికి రేవు సినిమా ఫస్ట్ కాపీ చూపించాం. మురళీ గింజుపల్లి గారు హ్యాపీగా ఫీలయ్యారు. చాలా సహజంగా రేవు సినిమా సాగుతుంది, మూవీలో ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టుల నేచురల్ పర్ ఫార్మెన్స్ చేశారు. మురళి మోహన్ గారిని మీరు రేవు పార్టీకి రావాలి సర్ అంటే ఆయన ఖంగుతిని నేను ఈ వయసులో రేవు పార్టీలకేంటి అని మందలించారు. అప్పుడు రేవు అనే సినిమాకి సంబందించిన పార్టీ అని, సినిమా యూనిట్ కి మీ ఆశీర్వాదం కావాలని అడిగితే రావడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ ఇంత టైమ్ మాతో స్పెండ్ చేసిన ఆయన బర్త్ డే వేడుకలని మేము ముందుగానే నిర్వహించే అవకాశం కల్పించినందుకు ఆయనకి మా కృతఙ్ఞతలు. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు ఈ రేవు పార్టీ కి రావడం పట్ల సంతోషంగా ఉంది.
ఆర్టిస్టులు: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు.
సాంకేతిక నిపుణులు:
డి ఓ పి – రేవంత్ సాగర్
నేపథ్య సంగీతం- వైశాక్ మురళీధరన్
పాట- జాన్ కె జోసెఫ్
ఎడిటర్ – శివ శర్వాని
కళ- బాషా
సాహిత్యం – ఇమ్రాన్ శాస్త్రి,
నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు,
నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి, రచయిత దర్శకుడు – హరినాథ్ పులి.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago