‘హిట్ 2’ టీజ‌ర్‌పై యూ ట్యూబ్ యాక్ష‌న్

వెర్సటైల్ రోల్స్ చేస్తూ తనదైన గుర్తింపు, క్రేజ్‌ను సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. డిసెంబర్ 2న సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతుంది. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నాని స‌మ‌ర్ప‌కుడిగా వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌.

ప్రస్తుతం సినిమా ప్రమోషనల్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ‌చింది. అతి త‌క్కువ వ్య‌వ‌ధిలోనే యూ ట్యూబ్ స‌హా అన్నీ సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో ‘హిట్ 2’ టీజ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తూ ట్రెండ్ అయ్యింది. ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

అయితే యూ ట్యూబ్ ‘హిట్ 2’ టీజ‌ర్‌ను తొల‌గించి అంద‌రికీ షాకిచ్చింది. ట్రెండింగ్ లిస్టు నుంచి తొల‌గించింది. టీజ‌ర్ చూడ‌టానికి వ‌యోప‌రిమితి ఉండాలంటూ ఆంక్ష‌లు విధించింది. టీజ‌ర్‌పై యూ ట్యూబ్ యాక్ష‌న్ తీసుకునే లోపు 9 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. దీనిపై హీరో అడివి శేష్ వివ‌ర‌ణ ఇస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు. అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాన్ని వివరిస్తూనే టీజ‌ర్‌ను చూడాల‌నుకుంటే ఏం చేయాలో కూడా చెప్పారు.

ఇలాంటిది ముందే జ‌రుగుతుంద‌ని టీమ్ ముందుగానే ఊహించింది. అయితే అంతా స‌వ్యంగానే జ‌రుగుతుంద‌ని యూనిట్ భావిస్తోంది. యూ ట్యూబ్ నిర్ణ‌యాన్ని చిత్ర యూనిట్ స్వాగ‌తించింది. అదే స‌మ‌యంలో అడివి శేష్ త‌న వీడియోలో రేపు విడుద‌ల‌వుతున్న ఉరికే ఉరికే సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరారు. గ్యారీ బి.హెచ్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago